Thursday, August 28, 2014

What is Fuel?- ఇంధనము అంటే ఏమిటి?

  •  

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్ర :  ఇంధనము అంటే ఏమిటి?

జ : శక్తిని ఇచ్చే ఏ పదార్ధమైనా ఇంధనమే . మనిషికి ఆహారము ఇంధనమే . ఐతే యంత్రాలు తిరిగేందుకు వాడే పదార్ధాలను ఇంధనం అంటారు.

ఇంధనము మండినపుడు  ఉష్ణోగ్రత , కాంతి  వస్తుంది . అవే శక్తిగా ఉపయోగపడతాయి. బొగ్గు అనేది భూమిలోపల పడిన చెట్లనుండి కుళ్ళిపోయి ఏర్పడినది. ఆ రీతిలో ఏర్పడినవే సహజవాయువు , ముడిచమురు వగైరాలు. ఇంధనము స్థితి ని బట్టి ఘన ,ద్రవ ,వాయు ఇంధనాలు అంటాము . ముఖ్యమైన ద్రవ ఇంధనాలు -- కిరోసిన్‌ , డీజిల్ , పెట్రోల్ . రాకెట్ లో ఘన ఇంధము , వంట చేసుకునేందుకు వాయుఇంధనము (సి.ఎన్‌.జి) లను వాడుతారు .
  • =========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

No comments:

Post a Comment

your comment is important to improve this blog...