Sunday, November 09, 2014

అంతరిక్ష వస్తువుల ఆకారాలను ఏ అంశాలు నిర్ధరిస్తాయి?

  •  

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: అంతరిక్షంలోని గ్రహాలు, ఇతర ఖగోళ వస్తువుల ఆకారాలను ఏ అంశాలు నిర్ధరిస్తాయి?

జవాబు: అంతరిక్షంలోని ఏ ఖగోళ వస్తువు ఆకారాన్నైనా నిర్ణయించేది అది ఏ పదార్థాలతో నిర్మితమై ఉంది అనే విషయంపైనే కాకుండా దాని ద్రవ్యరాశిపై తద్వారా ఉత్పన్నమయ్యే గురుత్వం (Gravity) పై కూడా ఆధారపడి ఉంటుంది. వాయువులేక ద్రవ పదార్థాలతో కూడుకున్న గ్రహాలు, గోళాకారంలో రూపొందుతాయి. కారణం దానిపై గురుత్వం అన్ని దిశలలో ఒకే రకంగా, సమానంగా పనిచేయడమే. భూమి తొలుత ద్రవ రూపంలోనే ఉండేది. అదే వాటి అంతర్భాగాలు అప్పటికే రాతితో నిర్మితమయి ఉంటే, గురుత్వ బలంకన్నా బరువైన రాయి ప్రయోగించే బలం ఎక్కువవడంతో 'ఆస్టరాయిడ్ల' లాంటి లఘు గ్రహాలు గోళాకారంలో కాకుండా ఒక క్రమంలేని విచిత్రమైన ఆకారాలు కలిగి ఉంటాయి. కానీ ఆస్టరాయిడ్ల వ్యాసం 800 కిలోమీటర్ల కన్నా ఎక్కువగా ఉంటే దాని గురుత్వం తగినంత బలం కలిగి ఉండడంతో అది చాలా వరకు గోళాకారాన్ని కలిగి ఉంటుంది. దీనికి 970 కిలోమీటర్ల వ్యాసం ఉండే లఘు గ్రహం 'సిరీస్‌' మంచి ఉదాహరణ.

తమ చుట్టూ తాము అతి వేగంగా తిరిగే ఖగోళవస్తువులు కచ్చితమైన గోళాకారంలో కాకుండా దీర్ఘవృత్తాకారం (Elliptical form) కలిగి ఉంటాయి. దీనికి కారణం వాటి పరిభ్రమణ వేగం వాటి విషువద్రేఖ (Equator) దగ్గర ఎక్కువగా ఉండడంతో అక్కడ ఏర్పడిన ఉబ్బు వల్లనే.

- ప్రొ|| ఈ.వి.సుబ్బారావు,-హైదరాబాద్‌
  • ============================

No comments:

Post a Comment

your comment is important to improve this blog...