Wednesday, December 24, 2014

Soaps clean dirt How?,సబ్బులు మురికిని ఎలా వదిలించగలవు?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
  •  

  •  
ప్రశ్న: స్నానం చేసేటపుడు, బట్టలు ఉతికేప్పుడు సబ్బులు మురికిని ఎలా వదిలించగలవు?
Ans :  మనం వేసుకొనే వస్త్రాల మీద, శరీరం మీద చేరే మురికి కణాలు రెండు రకాలు. కొన్ని నూనె లాంటి జిడ్డు పదార్థాలకు చెందినవైతే, మరికొన్ని విద్యుదావేశాలు కలవి. గాలిలోని కణాలు ఒకదానిని మరొకటి రాసుకోవడం వల్ల వాటికి విద్యుదావేశం కలుగుతుంది. మామూలుగా నీటిలో ముంచి బట్టలు ఉతకడం వల్లకానీ శరీరంపై నీరు పోసుకుని రుద్దుకోవడం వల్ల కానీ ఈ మురికి కణాలు సులభంగా తొలిగిపోవు. పైగా ఉతకడం వల్ల, రుద్దడం వల్ల ఈ కణాలలో విద్యుదావేశం తొలిగిపోయి బట్టలకు, ఒంటికి అంటుకుపోతాయి. నూనె కణాలు నీటితో కలవక పోవడం వల్ల అవి మరీ అతుక్కుపోతాయి. సబ్బు వివిధ రకాల రసాయనిక పదార్థాల సమ్మేళనం. సబ్బులోని రసాయనిక అణువులకు ఉన్న ప్రత్యేక ధర్మం, అణు నిర్మాణం మూలంగా అవి మురికిలోని జిడ్డుతో కూడిన కణాలకు, విద్యుదావేశం ఉన్న కణాలకు అంటుకుంటాయి. తర్వాత నీరు పోసి ఉతకడం గానీ, రుద్దడం కానీ చేయగానే సబ్బుకణాలు మురికి కణాలను తమతో పాటు, గుడ్డలనుంచి, ఒంటి నుంచి తొలగిస్తాయి.

స్నానానికి వాడే సబ్బుల్లో మురికిని తొలగించే రసాయన పదార్థాలతో పాటు సువాసన వెదజల్లే పదార్థాలు కూడా ఉండటం వల్ల మనకి ఆహ్లాదంగా అనిపిస్తుంది.

- ప్రొ|| ఈ.వి.సుబ్బారావు, హైదరాబాద్‌
  • ========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

No comments:

Post a Comment

your comment is important to improve this blog...