Saturday, January 25, 2014

చండ్రుడు చల్లగా ఉంటాడా? వేడిగా ఉంటాడా?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
 ప్ర : చండ్రుడు చల్లగా ఉంటాడా? వేడిగా ఉంటాడా?

జ : ' చల్లని రాజా ఓ చందమా ' అని కవులు వర్ణించింది .. చంద్రుడు నుండి వచ్చే వెన్నెల చల్లదనాన్ని అనుభవించి. వాస్తవానికి చంద్రుడు చల్లనిరాజు మాత్రం కాదు .  పట్టపలు చందుడి మీద నీరు మరిగేటంత ఉష్ణోగ్రత ఉంటుంది. రాత్రి గడ్డకట్టుకు పోయేటంత చలి ఉంటుంది. సౌర కాంతి చంద్రుడి మీద పడ్డాక చాలా భాగం శోషించబడుతుంది(Absorbed). కేవలం కొంత భాగం మాత్రమే విస్తరణం (Scattering) చెంది అన్ని వైపులకూ వెళుతుంది. అందులో భాగాన్నే మనం వెన్నెలగా చూస్తాము.

చంద్రుడి మీద నీడ నిచ్చేందుకు మేఘాలు ఉండవు అక్కడ పగలు దాదాపు రెండు వారాలు , రాత్రి మరో 2 వారాలు . నిజానికి చంద్ర్డు తనకు తాను మాడిపోతూ మనకు మాత్రము చల్లని వెన్నెల అందిస్తూ  మనచేత " శీతాంశువు " అనిపించుకుంటున్నాడు .
  • ========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Thursday, January 23, 2014

చలి.వర్షాకాలాల్లో కొయ్య తలుపులు బిగుసుకుపోతాయి.ఎందుకు?

  •  

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: చలి, వర్షాకాలాల్లో కొయ్య తలుపులు, బిగుసుకుపోతాయి. ఎందుకు?
జవాబు: ఎండిన కొయ్య ముక్కలను నీళ్లలో వేస్తే అవి నీటిని పీల్చుకొని ఉబ్బడం మనందరికీ తెలుసు. దీనికి కారణం కొయ్య పదార్థాలలో ఉండే సెల్యులోజ్‌, పిండి పదార్థం. కార్బో హైడ్రేట్‌లు, పెక్టిన్‌ లాంటి ప్రోటీన్లు. ఇవే కాకుండా ఎండు కొయ్యలో బోలుగా ఉండే మృతకణాలు కూడా ఉంటాయి. అందువల్ల ఎండు కొయ్య చుట్టు పక్కల ఉండే వాతావరణాన్ని బట్టి నీటిని, నీటి ఆవిరినీ సులభంగా పీల్చుకోనూ గలదు, వదలనూ గలదు.

వర్షాకాలంలో వాతావరణంలో తేమ శాతం ఎక్కువగా ఉంటుంది. అలాగే చలికాలంలో మంచు కురియడం వల్ల వాతావరణం తేమగా ఉంటుంది. ఆ రోజుల్లో ఆ తేమలోని నీటికణాలను కొయ్య తలుపులు పీల్చుకొని ఉబ్బుతాయి. ద్వారబంధానికి, తలుపులకు మధ్య తగినంత ఖాళీ ప్రదేశం లేకపోవడంతో ఉబ్బిన తలుపులు బిగుసుకుపోయి (వాటి పరిమాణం కొంచెం పెరిగి) తలుపులు వేయడం, తీయడం కష్టంగా ఉంటుంది. తలుపులకు, ద్వారబంధాలకు రంగులేయడం ద్వారా కొయ్య తేమను పీల్చుకొనే ధర్మాన్ని కొంత వరకు తగ్గించవచ్చు. దాంతో తలుపులను సులభంగా తెరిచి, మూయవచ్చు.

- ప్రొ|| ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌
  • =================================
 visit My website > Dr.Seshagirirao - MBBS.-

కర్ర మొద్దులు నీటిపై తేలుతాయి ఎందుకు?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

 ప్రశ్న: చిన్న గులకరాయి సైతం నీటిలో మునుగుతుంది. కానీ పెద్ద కర్ర మొద్దు మాత్రం నీటిపై తేలుతుంది. ఎందుకు?

జవాబు:
ఒక వస్తువు మరో ద్రవంలో మునుగుతుందా తేలుతుందా అన్నది ఆ వస్తువు సైజును బట్టి ఉండదు. అది కేవలం ద్రవపు సాంద్రతకు, ఆ వస్తువు సాంద్రతకు ఉన్న సాపేక్షతను బట్టి నిర్ధారించబడుతుంది. ఒక వస్తువు మునగడం అంటే ఆ వస్తువు గురుత్వాకర్షణ బలం ద్వారా ఆ ద్రవంలో కిందికి చొచ్చుకుపోవాలి. ఆ క్రమంలో

అది తనంతటి ఘనపరిమాణం గల ద్రవాన్ని తొల్చుకుంటూ లోనికెళ్లాలి. ఒకవేళ మీదనున్న ఆ ద్రవపు ద్రవ్యరాశి ఎక్కువయితే తానే కింద ఉండటానికి ప్రయత్నిస్తుంది కానీ తన కన్నా తక్కువ ద్రవ్యరాశి ఉన్న పదార్థాన్ని తొలవనీయదు కదా! అందుకే ద్రవ్యరాశికి, ఘనపరిమాణానికి ఉన్న నిష్పత్తిని పరిగణించాలి. ఈ నిష్పత్తినే సాంద్రత అంటారని తెలిసే ఉంటుంది. సాంద్రత ఓ ఆంతరంగిక ధర్మం. అంటే ఆ విలువ పదార్థాపు సైజును బట్టి కాకుండా పదార్థపు లక్షణాన్ని బట్టి ఉంటుంది. నీటి బొట్టుకైనా, పెద్ద ట్యాంకు నిండా ఉన్న నీటికైనా సాంద్రత ఒకటే.

వస్తువు సాంద్రత నీటి సాంద్రత కన్నా తక్కువయితే తేలుతుంది. ఎక్కువయితే మునుగుతుంది. గులకరాయి సాంద్రత నీటి సాంద్రత కన్నా హెచ్చు. కాబట్టి మునిగింది. కర్రమొద్దు సాంద్రత నీటి సాంద్రత కన్నా తక్కువ. కాబట్టి తేలుతుంది. ఈ ధర్మాలనే ప్లవన సూత్రాలు అంటారు.

-ప్రొ||ఎ.రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
  • ===========================
 visit My website > Dr.Seshagirirao - MBBS.-

A snap of a finger produce sound how?,చిటిక- వేస్తే శబ్దం ఎలా వస్తుంది?

  •  

  •  

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న:
మన చేతి బొటనవేలితో, మధ్యవేలితో కలిపి 'చిటిక' వేస్తే శబ్దం ఎలా వస్తుంది?

జవాబు: చిటిక అంటే బొటనవేలు మద్యవేలు కలుపుతూ చేసే శబ్ధము..మనం చిటిక వేసినపుడు స్థిరంగా ఉండే బొటన వేలు, కదిలే మధ్యవేలు మధ్య చిక్కుకున్న గాలి ఒత్తిడికి గురవుతుంది. అలా అక్కడ ఎక్కువ పీడనంతో ఉన్న గాలిని చిటికవేయడం ద్వారా తటాలున వదలడంతో శబ్దం వస్తుంది. వూదిన బెలూన్‌ లోపలి గాలి కూడా అత్యంత పీడనంతో ఉంటుంది కాబట్టే ఆ బెలేన్‌ పగిలినపుడు సైతం 'ఢాం' అనే శబ్దం వస్తుంది. చిటిక, బుడగల ద్వారా పుట్టే శబ్దాలు ఒత్తిడిలో ఉన్న గాలి వల్ల వచ్చేవే.

- ప్రొ|| ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌
  • ============================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Wednesday, January 08, 2014

Metal vessels not using in micro-oven Why?-మైక్రో ఒవెన్‌లో లోహ పాత్రల్ని వాడరేం?

  •  
  •  

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న:
మైక్రోవేవ్‌ ఒవెన్‌లలో సిరమిక్‌ (పింగాణీ), ప్లాస్టిక్‌ పాత్రలలోనే పదార్థాలను ఉంచి ఉడికిస్తారు. అంతకన్నా దృఢంగా ఉన్న లోహ పాత్రల్ని వాడకూడదంటారు. ఎందుకు?

జవాబు: విశ్వంలో కాంతి విద్యుదయస్కాంత తరంగాల రూపంలో విస్తరించి ఉంటుంది. ఈ కాంతి తరంగదైర్ఘ్యాలు వేర్వేరుగా ఉంటాయి. అత్యధికంగా కొన్ని వందల కిలోమీటర్ల మేర ఉండే తరంగదైర్ఘ్యం నుంచి అత్యల్పంగా ఫెమ్టో మీటరు (మిల్లీమీటరులో ట్రిలియన్‌ భాగం లేదా ఓ మిల్లీమీటర్ని లక్షకోట్లు విభజిస్తే ఏర్పడే భాగం) తరంగదైర్ఘ్యం వరకు ఉంటాయి. కాంతికి, పదార్థాలకు అన్యోన్య సంబంధం ఉంది. పదార్థాలలోని మార్పులతోనే విశ్వంలో కాంతి జనిస్తుంది. పదార్థాలపై పడ్డ కాంతి వాటిలో ఎంతోకొంత మార్పును కలిగించక మానదు. ఈ విధంగా చూస్తే మైక్రోవేవ్‌ ఒవెన్‌లో జనించే సూక్ష్మతరంగాల తరంగదైర్ఘ్యం సుమారు 1 నానోమీటరు నుంచి 1 మీటరు వరకు ఉంటుంది. ఇలాంటి తరంగాలు విద్యున్నిరోధ పదార్థాల గుండా బాగా చొచ్చుకుపోయినా, పాత్రల గోడలుదాటి అవతలికి వెళ్లవు. పింగాణీ, లేదా ప్లాస్టిక్‌ వస్తువులు అలాంటి విద్యున్నిరోధక పదార్థాలే. వీటిలో ఆహారపదార్థాలను ఉంచి మైక్రోవేవ్‌ ఒవెన్‌లో పెట్టినప్పుడు మైక్రోవేవ్‌ తరంగాల శక్తి మొత్తమంతా దినుసులకు చేరుతుంది. అదే లోహపు పాత్రలను పెడితే ఇలా జరగదు. మామూలు పొయ్యి మీద పింగాణీ పాత్రల్ని పెడితే అవి అధమ ఉష్ణవాహకాలు కాబట్టి పగిలిపోతాయి. అదే లోహపాత్రలను పెడితే, పొయ్యి జ్వాల నుంచి వచ్చే వేడి పాత్రకు అన్నివైపులా విస్తరించడం వల్ల పాత్రలు పగిలిపోవు. కాబట్టి మామూలు మంటల పొయ్యి మీద వాడే పాత్రలకు, మైక్రోవేవ్‌ ఒవెన్‌లో వాడే పాత్రలకు పరస్పర విరుద్ధ తత్వం ఉందన్నమాట.

- ప్రొ||ఎ.రామచంద్రయ్య నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
  • ==========================
 visit My website > Dr.Seshagirirao - MBBS.-

Yellow color to street lights-why?-వీధి దీపాలకు పసుపురంగేల?

  •  
  •  

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

 ప్ర : వీధి దీపాలకు పసుపురంగేల?

జవాబు: స్వచ్ఛమైన తెల్లని కాంతిని పటకం గుండా పయనించేటట్లు చేస్తే అది వూదా, నీలి, ఆకుపచ్చ, పసుపు, నారింజ, ఎరుపు అనే ఏడు రంగులుగా విడిపోతుందని మనందరికీ తెలుసు. ఇప్పుడు వీధి దీపాలుగా మెర్క్యురీ లాంప్స్‌ను వాడితే ఏం జరుగుతుందో చూద్దాం. పొగమంచు పడే రాత్రివేళల్లో, తేమశాతం ఎక్కువగా ఉండే శీతాకాలపు, వర్షాకాలపు రాత్రివేళల్లో వాతావరణంలో ఉండే అతి చిన్న నీటి బిందువుల కణాలు పట్టకాల్లాగా పనిచేస్తాయి. మెర్క్యురీ పేపర్‌ ల్యాంపుల నుంచి వచ్చే తెల్లని కాంతి ఈ నీటి కణాల ద్వారా పయనిస్తే ఏడురంగులుగా విడిపోతుంది. అప్పుడు దీపాల చుట్టూ గుండ్రని ఇంద్రధనస్సు లాంటి రంగుల కాంతి వలయాలు ఏర్పడతాయి. దీని వల్ల వాహనదారుల చూపులో అస్పష్టత, గజిబిజి ఏర్పడుతుంది. ఇది ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉంది.

వీటిని నివారించడానికి ఏకవర్ణ కాంతి పసుపు రంగును మాత్రమే వెలువరించే సోడియం పేపర్‌ ల్యాంపులను వీధి దీపాలుగా ఉపయోగిస్తారు. ఈ పసుపు కాంతి నీటి కణాల ద్వారా పయనించినా అది మరే రంగుగా విడిపోదు. అంతేకాకుండా పసుపు రంగు కాంతి కిరణాలు అతి తక్కువగా పరావర్తనం, వక్రీభవనం చెందుతాయి. అందువల్ల మన చూపులో అస్పష్టత ఉండదు. పైగా తెల్లని కాంతి తర్వాత ఎక్కువ వెలుగునిచ్చేది కూడా పసుపు రంగుకాంతే. ఆ కాంతిలో మనం చూసే వస్తువులు వాటి సహజమైన రంగుల్లో స్పష్టంగా, ప్రకాశవంతంగా కనబడతాయి.

- ప్రొ|| ఈ.వి సుబ్బారావు,--హైదరాబాద్‌

  •  ===============================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Train donot stop suddenly-why?-రైలుకు బ్రేకులు వేస్తే వెంటనే ఆగదెందుకు?

  •  
  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న:బస్సులకు బ్రేక్‌ వేస్తే కొద్ది దూరానికే ఆగిపోతాయి. కానీ రైలుకు అదాటుగా బ్రేకులు వేస్తే ఆగదెందుకు?

జవాబు: వేగంగా ప్రయాణించే వస్తువును ఆపడమంటే దాని వేగాన్ని శూన్యం చేయడమే. బ్రేకులు వేసినపుడు బస్సు చక్రాల వేగాన్ని శూన్యం చేసేలా నిరోధక బలం (Retardation force) పనిచేస్తుంది. వస్తువు వేగంలో మార్పును కలిగించే గుణం కేవలం బలానికే ఉంటుంది. ఆ బలం ప్రమాణం వేగం మీద, ఆ వాహనం ద్రవ్యరాశి మీద ఆధారపడి ఉంటుంది. ద్రవ్యరాశి, వేగాల లబ్దమే (product of mas and velocity) బలాన్ని నిర్దేశిస్తుందంటారు. ఈ లబ్దాన్ని ద్రవ్య వేగం (momentum)అంటారు. కాబట్టి ద్రవ్య వేగాన్ని శూన్యం చేయడానికే బ్రేకులు వేస్తారు. కథ ఇక్కడితో ఆగిపోదు. ఈ ద్రవ్య వేగాన్ని ఎంత కాలంలో శూన్యం చేస్తామన్న విషయం కూడా బలాన్ని నిర్దేశిస్తుంది. ఉదాహరణకు గంటకు 100 కి.మీ. వేగంతో ప్రయాణిస్తున్న 10 టన్నుల ద్రవ్యరాశిగల బస్సును ఒక సెకను కాలంలోనే ఆపాలంటే కావలసిన బలం విలువ పదికోట్ల న్యూటన్లవుతుంది. కానీ రైలు ద్రవ్యరాశి వేల టన్నులుంటుంది. అంటే అన్ని రెట్లు ఎక్కువ న్యూటన్ల బలాన్ని ప్రయోగించాలన్నమాట. అంత బలాన్ని రైలు చక్రాల మీద బ్రేకులతో ప్రయోగిస్తే ఏర్పడే ఘర్షణ శక్తి చాలా ఎక్కువ ఉంటుంది. అప్పుడు విపరీతమైన శబ్దంతో పాటు మంటలు వస్తాయి. ఆ వేడికి చక్రాలు కరిగిపోయే ప్రమాదం ఉంది. అలాగే రైలు పట్టాలు నునుపుగా ఉండడం వల్ల కూడా రైలును వెంటనే ఆపలేము.

- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌;-రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
  • =============================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Tuesday, January 07, 2014

Why not Tractors getdown in mud?-ట్రాక్టర్లు బురదలో కూరుకుపోవేం?

  •  
  •  

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న:పొలాల్లో బురద ఉన్నా బరువైన ట్రాక్టర్లు సాఫీగా పోతుంటాయి. అదే తక్కువ బరువున్న రైతుల పాదాలు మాత్రం కూరుకు పోతుంటాయి. ఎందుకు?

జవాబు: ఇలా జరగడానికి కారణం బరువుకి, ఒత్తిడి లేక పీడనంకు మధ్యగల సంబంధమే. ఒక చదరపు సెంటీమీటరు ప్రదేశంపై పనిచేసే బరువును పీడనం లేక ఒత్తిడి అని అంటాం. ట్రాక్టరు బరువు రైతుకన్నా ఎక్కువగానే ఉంటుంది. అయితే ఆ బరువు ఎక్కువ వైశాల్యం ఉన్న దాని అడుగుభాగం అంతా వ్యాపించి ఉంటుంది. అందువల్ల భూమిపై ట్రాక్టరు ప్రయోగించే పీడనం విలువ తక్కువగా ఉంటుంది. ఇక రైతు బరువు తక్కువగా ఉన్నప్పటికీ, ఆ బరువు తక్కువ వైశాల్యం ఉన్న అతని పాదాలపై కేంద్రీకరింపబడి ఉంటుంది. దాంతో అతను ప్రయోగించే పీడనం ఎక్కువగా ఉంటుంది. అందువల్లే బురదలో పాదాలు కూరుకుపోతాయి. ఒక ప్రదేశంలో ఒక వస్తువు దిగబడడానికి కారణం అది ఆ ప్రదేశంపై ప్రయోగించే పీడనమేగానీ, బరువుకాదు.

- ప్రొ||ఈ.వి సుబ్బారావు, హైదరాబాద్‌
  • ===============================
 visit My website > Dr.Seshagirirao - MBBS.-

శీతల కేంద్రక సంలీనం జరిపి శక్తి పుట్టదా?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
  •  
  •  

ప్రశ్న: కేంద్రక సంలీనం జరపాలంటే అధిక ఉష్ణోగ్రత అవసరం. కానీ శీతల కేంద్రక సంలీనం జరిపి ప్రస్తుతమున్న శక్తి సంక్షోభాన్ని తొలగించలేమా?

జవాబు: కేంద్రక సంలీన చర్య అంటే సాధారణంగా 4 హైడ్రోజన్‌ కేంద్రకాలను ఒక హీలియం కేంద్రకంగా సంలీనం చేయడమే. 4 విడివిడి హైడ్రోజన్‌ కేంద్రకాలలో ఉండే 4 ప్రోటాన్ల ద్రవ్యరాశి కన్నా ఒక హీలియం పరమాణు కేంద్రకంలో నెలకొనే రెండు ప్రోటాన్ల, రెండు న్యూట్రాన్ల సంయుక్త ద్రవ్యరాశి తక్కువ. అంటే నాలుగు హైడ్రోజన్లు ఒక హీలియంగా మారే ప్రక్రియలో ఎంతో కొంత ద్రవ్యరాశి మాయమయిందన్నమాట. కానీ ద్రవ్యరాశి శక్తిగా మారడం ద్వారా మాత్రమే మాయం కాగలదని ద్రవ్యశక్తి నిత్యత్వ సూత్రం చెబుతుంది. కాబట్టి మాయమైన ద్రవ్యరాశి కొంతశక్తిగా మారుతుంది. కొంచెం ద్రవ్యరాశే మాయమయినా ఏర్పడేశక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఏర్పడేశక్తి(E) మాయమైన ద్రవ్యరాశి(m)కాంతి వేగ వర్గాల (c2) లబ్దానికి సమానమని ఐన్‌స్టీన్‌ సాపేక్షతా సిద్ధాంతంలో (E= mc2) ద్వారా నిరూపితమైంది. ఉదాహరణకు ఓ బఠాణీ గింజంత బరువున్న ద్రవ్యరాశిని మనం పైసూత్రం ప్రకారం శక్తిగా మారిస్తే ఆ శక్తితో సుమారు 25 కోట్ల లీటర్ల నీటి ఉష్ణోగ్రతను 20 డిగ్రీల సెల్సియస్‌ నుంచి సుమారు 80 డిగ్రీల సెల్సియస్‌ వరకు వేడిచేయగలం. అంతటి శక్తి కేంద్రక విచ్ఛిత్తి, కేంద్రక సంలీన చర్యల్లోనే సాధ్యమవుతుంది. కానీ 4 హైడ్రోజన్‌ పరమాణు కేంద్రకాలను కలిపి ఉంచాలంటే మొదట చాలా శక్తిని ఖర్చుచేయాలి. అది సాధారణ పద్ధతుల్లో వీలుకాదు కాబట్టి మొదట కేంద్రక విచ్ఛిత్తి ద్వారా విడుదలయ్యే శక్తిని వినియోగించుకుని కేంద్రక సంలీన చర్యను ప్రేరేపిస్తారు. శీతల కేంద్రక సంలీనం వీలుకాదని రుజువైంది.

- ప్రొ||ఎ.రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
  • =====================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Why do we hear sound first in TV?-టీవీ పెట్టగానే ముందు శబ్దం వస్తుందేం?

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: కాంతివేగం ధ్వని వేగం కన్నా అనేక రెట్లు ఎక్కువ. మరి మనం టీవీని ఆన్‌ చేస్తే ముందు శబ్దం వచ్చి తర్వాత బొమ్మ కనబడుతుంది ఎందుకు?

జవాబు: దీనికి కారణం మన ఇంట్లో ఉండే టీవీలో జరిగే ప్రక్రియ. వివరాల్లోకి వెళ్లే ముందు శబ్ద, దృశ్యాన్ని టీవీ కెమెరాలు చిత్రీకరించేప్పుడు శబ్ద సంబంధిత విషయాలు కూడా ఒక మైక్రోఫోన్‌ సాయంతో ఏక కాలంలో రికార్డు అవుతాయి. ఆ వివరాలు దూరప్రాంతాలకు ప్రసారమయ్యే ముందు దృశ్య, శబ్ద వివరాలను విద్యుత్‌ స్పందనాలుగా మారుస్తారు. ఆ తర్వాత వాటిని విద్యుత్‌ అయస్కాంత తరంగాలుగా మార్చి ప్రసారం చేస్తారు. ఈ తరంగాల వేగం కాంతి తరంగాల వేగంతో సమానంగా ఉంటుంది. ఇలా ప్రసారమయి వాతావరణంలో పయనించిన తరంగాలను మన ఇంటిలో ఉండే టీవీ 'ఏంటినా' గ్రహిస్తుంది.

మనం టీవీ పెట్టినపుడు ఏంటినా గ్రహించిన విద్యుదయస్కాంత తరంగాలు టీవీలోకి చొరబడతాయి. టీవీలో ఉండే పరికరాలు, విద్యుదయస్కాంత తరంగాలను విద్యుత్‌ స్పందనాల రూపంలోకి మారుస్తాయి. టీవీలో శబ్ద, దృశ్యలకు సంబంధించిన విషయాలకు వేర్వేరు విభాగాలుంటాయి. దృశ్య విభాగాన్ని 'పిక్చర్‌ ట్యూబ్‌' (దీనిని కేథొడ్‌ కిరణాల ట్యూబ్‌ అని కూడా అంటారు) ఎలక్ట్రాన్‌ కిరణాల రూపంలోకి మార్చి ఆ కిరణాలను టీవీ తెరపై పడేటట్లు చేసి మనకు బొమ్మ రూపంలో కనబడేటట్లు చేస్తుంది. పిక్చర్‌ ట్యూబ్‌ నుంచి ఎలక్ట్రాన్‌ కిరణాలు ఆ ట్యూబ్‌లో ఉండే ఫిలమెంట్‌ వేడైన తర్వాతే వెలువడుతాయి. అలా వేడెక్కడానికి కొంత సమయం పడుతుంది. కానీ టీవీలోని శబ్దవిభాగం శబ్ద తరంగాలను వెలువరించడానికి ఏమాత్రం సమయం పట్టదు. విద్యుత్‌ అయస్కాంత తరంగాలు శబ్ద విభాగాన్ని చేరీచేరకముందే ఏ మాత్రం ఆలస్యం లేకుండా శబ్ద తరంగాలు వెలువడుతాయి. అందువల్లనే టీవీ ఆన్‌ చేయగానే ముందు మనం ధ్వనిని వింటాం.

- ప్రొ|| ఈ.వి సుబ్బారావు, హైదరాబాద్‌

  • =======================
 visit My website > Dr.Seshagirirao - MBBS.-

Electricity in thunder-How?-మెరుపుల్లో విద్యుచ్ఛక్తి ఉంటుందంటారు అదెలా సాధ్యం?

  •  

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...ర్

ప్రశ్న: వర్షం కురిసినపుడు వచ్చే మెరుపుల్లో విద్యుచ్ఛక్తి ఉంటుందంటారు అదెలా సాధ్యం?

జవాబు: సాధారణంగా నేల నుంచి 2 నుంచి 15 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న మేఘాలే మెరుపులు, ఉరుముల్ని కలిగిస్తాయి. ఈ మేఘాల్ని క్యుములోనింబస్‌ మేఘాలు అంటారు. వేసవి ఎండల వల్ల సముద్రపు నీరు ఆవిరై భూప్రాంతాలకు విస్తరించినపుడు అక్కడున్న దుమ్ము, ధూళి కణాలతో ఢీకొన్న మేఘాల్లో స్థిర విద్యుత్‌ పోగుపడుతుంది. అనువైన పరిస్థితి ఏర్పడ్డపుడు విద్యుదావేశాలు పరస్పర ఆకర్షణ ద్వారా గాలిలో ప్రవహిస్తాయి. గాలి ప్లాస్మా స్థితికి చేరడం వల్ల ఆ వేడికి కాంతి పుడుతుంది. ఇవే మెరుపులు.

మెరుపులు క్షణికంగా మెరిసినా అందులో ఉన్న విద్యుత్‌ ప్రవాహం కొన్నిసార్లు వందలాది కిలో ఆంపియర్లుగా ఉంటుంది. పొటన్షియల్‌ భేదం ద్వారా ఆ విద్యుత్‌ ప్రవాహం సంభవించడం వల్ల ఎన్నో కూలుంబుల విద్యుదావేశం మేఘాల మధ్య మేఘాలకు నేలకు మధ్య వినిమయం అవుతుంది.

- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక

  • ==============================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Sunday, January 05, 2014

Is there Earth like in the universe?,భూమి లాంటివి ఇంకా ఉన్నాయా?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
  •  

  •  
ప్రశ్న: గెలాక్సీలో మనం చూస్తున్న సూర్యుడు కాకుండా చాలా ఎక్కువ సూర్యుళ్లు ఉన్నాయంటున్నారు. మరి భూమి లాంటివి కూడా చాలానే ఉండాలి కదా?

జవాబు: సూర్యుడు తదితర నక్షత్రాలు కోటాను కోట్లుగా ఉన్న సముచ్చయాన్ని నక్షత్రరాశి లేదా గెలాక్సీ అంటారు. మన సూర్యుడున్న నక్షత్రం పేరు పాలపుంత గెలాక్సీ లేదా మిల్కీవే గెలాక్సీ. ఇది వంపు తిరిగిన పళ్లచక్రంలాగా ఉంటుంది. మధ్యలో ఉబ్బుగా అంచుల్లో పలుచగా ఉంటుంది. ఈ పాలపుంతలో ఒక అంచు నుంచి మరో అంచుకు పాలపుంత కేంద్రం గుండా సుమారు లక్ష కాంతి సంవత్సరాల నిడివి ఉంటుంది. అంటే మిల్కీవేలాంటి గెలాక్సీల వ్యాసం సుమారు ఒక లక్ష కాంతి సంవత్సరాలు. ఇలాంటి గెలాక్సీలో 4 లక్షల మిలియన్ల వరకు నక్షత్రాలుంటాయి. అందులో సూర్యుడు కూడా ఒక నక్షత్రం. మన గెలాక్సీలోనే మనకు సూర్యుని తర్వాత ఉన్న అతి సమీప నక్షత్రం పేరు ప్రాక్సిమా సెంటరి. అది మనకు దాదాపు 4 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. అంటే అక్కడ్నుంచి కాంతి సెకనుకు మూడు లక్షల కిలోమీటర్ల వేగంతో వస్తూ ఉన్నా మనల్ని చేరడానికి నాలుగు సంవత్సరాలు పడుతుంది. ప్రతీ నక్షత్రానికి మన సూర్యుడికి ఉన్నట్లే గ్రహ కుటుంబం ఉండాలన్న నిబంధన లేదు. ఒకవేళ ఉన్నా మన భూమి లాంటి పరిస్థితి ఉన్న గ్రహాలు అక్కడ ఉండాలనిగానీ, ఉండకూడదనిగానీ ప్రకృతి సిద్ధంగా నియమం లేదు. డ్రేక్‌ అనే శాస్త్రవేత్త అంచనా ప్రకారం ఈ విశాల విశ్వంలో కొన్ని కోట్ల ప్రాంతాల్లో భూమిని పోలిన స్థావరాలున్నాయనీ, జీవం ఉండటానికి ఆస్కారం ఉందనీ కంప్యూటర్‌ నమూనాల ద్వారా తెలియజేశారు. ఇంత ఆధునిక అంతరిక్ష పరిశోధనా పరికరాలు ఉపయోగించి ఇంత వరకు భూమిని మినహాయించి మరెక్కడా జీవం ఉన్నట్లు ప్రయోగ ఫలితాలు రాలేదు.

- ప్రొ|| ఎ.రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
  • =============================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

How all gases in the air mixed?, వాయువులన్నీ కలిసే ఉంటాయేం?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
  •  

  •  

ప్రశ్న: వాతావరణంలోని గాలిలో ఆక్సిజన్‌, నైట్రోజన్‌ కూడా ఉంటాయి కదా. ఆక్సిజన్‌ సాంద్రత నైట్రోజన్‌ సాంద్రత కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ ఈ వాయువులు దేనికవి విడిపోకుండా ఎలా కలిసి ఉన్నాయి?

జవాబు: మామూలు ఉష్ణోగ్రతల వద్ద గాలిలోని అణువులు సెకనుకు 500 మీటర్ల వేగంతో కదులుతూ ఒకదానితో ఒకటి తరచూ ఢీకొంటూ ఉంటాయి. వాతావరణంలోని ఉష్ణోగ్రతల మార్పుల వల్ల ఉష్ణం ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి బదిలీ కావడం వల్ల కూడా గాలిలోని అణువులు కలిసిపోతాయి. ఈ విధంగా వాతావరణంలోని వివిధ వాయువుల అణువులు, వాటి సాంద్రతల్లో తేడా ఉన్నప్పటికీ ఒకదానితో మరొకటి కలిసిపోవడం ప్రకృతిలో ఒక సహజమైన ప్రక్రియ. ఈచర్య అనంతంగా కొనసాగడానికి కారణం భూమి తన చుట్టూ తాను తిరగడం. భూమి ఉపరితలం పైన 80 నుంచి 120 కిలోమీటర్ల వరకూ వాతావరణంలోని వివిధ వాయువులు వాటి సాంద్రతలతో సంబంధం లేకుండా వాతావరణంలోని 21 శాతం ఆక్సిజన్‌, 78 శాతం నైట్రోజన్‌ విడిపోకుండా సమానమైన గాఢత ఉన్న మిశ్రమ రూపంలో కలిసిమెలిసి ఉంటాయి.

-ప్రొ|| ఈ.వి సుబ్బారావు, హైదరాబాద్‌

  • ==========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Smoke comes from outside kept Ice cubes.why?,మంచుగడ్డ నుంచి పొగలెందుకు వస్తాయి?

  •  
  •  

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: పెద్ద మంచుగడ్డను ఆరుబయట ఉంచితే దాని నుంచి పొగలెందుకు వస్తాయి?

జవాబు: ఆరుబయట గాలిలో పెట్టిన మంచుగడ్డ నుంచి వచ్చే పొగలు మంట నుంచి వెలువడే పొగల లాంటివో, ఏ వాయువుకో సంబంధించినవో కావు. మంచుగడ్డ చుట్టూ ఉన్న చల్లని గాలిలో ఘనీభవించిన నీటి ఆవిరే మనకలా పొగల రూపంలో కనిపిస్తుంది.

మంచుగడ్డ చుట్టూ ఉన్న గాలి బాగా చల్లబడి అతి తక్కువ ఉష్ణోగ్రతకు చేరుకుంటుంది. ఆ గాలిలో ఉన్న నీటి ఆవిరిలో కొంత ఘనీభవించి అతి సూక్ష్మమైన నీటి బిందువులు ఏర్పడతాయి. వాతావరణంలో సూర్యరశ్మికి వేడెక్కే గాలులు తేలికై పైకి ప్రయాణిస్తూ ఉంటాయి. ఆ గాలులతోపాటుగా మంచుగడ్డ చుట్టూ ఏర్పడిన సూక్ష్మ నీటి బిందువులు కూడా పైకి లేస్తాయి. ఆ ప్రదేశాన్ని మంచుగడ్డకు దూరంగా ఉన్న గాలి ఆక్రమిస్తుంది. తిరిగి ఈ గాలి కూడా మంచుగడ్డ వల్ల చల్లబడి సూక్ష్మ బిందువులుగా మారి ఇతర గాలులతోపాటు పైకి లేస్తుంది. ఇలా పైకి లేచే అత్యంత సూక్ష్మమైన నీటి బిందువులే మనకు దట్టమైన పొగలలాగా కనిపిస్తాయి.

- ప్రొ|| ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌

  • ==============================
 visit My website > Dr.Seshagirirao - MBBS.-