Sunday, November 30, 2014

why do we shiver in winter cold?-చలికి వణుకుతామెందుకు ?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
  •  

 ప్ర : చలికాలము లో చలికి వణుకుతామెందుకు ?

జ : చలిలో బయటకు వెళితే శరీరము వణుకుతుంది. దీనికి కారణము శరీర ఉష్ణోగ్రతకు బయట వాతావరణ ఉష్ణోగ్రతకు ఉన్న తేడా . ఉష్ణోగ్రత అధికము గా వున్న చోటనుండి తక్కువ ఉన్నచోటుకు ప్రవహిస్తుంది. అలా శరీరము నుండి చలి వాతావరణము లోకి ఉష్ణోగ్రత  హఠాత్తుగా , వేగముగా ప్రవహించేసరికి దానికి స్పందనగా శరీర కండరాలు ఒక్క సారికా కదలినట్లవుతాయి. దాంతో శరీరము వణుకుతుంది. శరీర ఉష్ణోగ్రత స్థిరముగా ఉంటేనే లోపలి శరీర వ్యవస్థ సక్రమముగా పనిచేస్తుంది. ఆ ఉష్ణోగ్రతను స్థిరము గా నిలబెట్టుకునే యత్నములో శరీరము వణుకుతుంది.
  • ==========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

వివాహిత స్త్రీలు మెట్టెలు పుస్తెలు ధరిస్తారెందుకు ?.

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
  •  

 ప్ర : వివాహిత స్త్రీలు మెట్టెలు పుస్తెలు ధరిస్తారెందుకు ?.

జ : విష్ణుభక్తులు త్రిపుండ్రాలను , శివభక్తులు విభూతిరేఖలను ధరించినట్లు గానే సౌభాగ్యవతులకు మంగళప్రదాయిని అయిన గౌరీదేవి యొక్క అలంకారాలు ధరిస్తే సౌభాగ్యవృద్ధి జరుగుతుందనే నమ్మకముతో స్త్రీలు మట్టెలు , పుస్తెలు ధరిస్తారు. అంతేకాక శారీరక శాస్త్రరీత్యా ఆ యా శరీర భాగలలో ఆ యా అలంకారాలను ఉంచడం వల్ల ఆక్యుపంచర్ వైద్యవిధానము లో కొన్ని వ్యాధుల నివారణకు ఉపకరిస్తుంది .
  • =======================
 visit My website > Dr.Seshagirirao - MBBS.-

Cannot feel taste when suffer cold?- జలుబుంటే రుచి తెలియదా?,

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
  •  

ప్రశ్న: జలుబు చేస్తే ఆహార పదార్థాల రుచి, వాసన సరిగా తెలియదు. ఎందుకు?

జవాబు: సాధారణ జలుబు (common cold) ను వైద్యశాస్త్ర పరిభాషలో నాసో ఫేరింజిటిస్‌ (naso pharyngitis)అంటారు. జలుబుకు కారణం వైరస్‌లు. దాదాపు 20 రకాల వైరస్‌ల వల్ల జలుబు వచ్చే ప్రమాదమున్నా ప్రధానంగా రైనో వైరస్‌ వల్ల వస్తుంది. జలుబు అంటువ్యాధి. ఈ వైరస్‌లు గాలి ద్వారా, శరీర స్పర్శ ద్వారా ఒకర్నించి మరొకరికి సోకుతాయి. దగ్గు, బొంగురు గొంతు, అదేపనిగా ముక్కు కారడం, తుమ్ములు, జ్వరం జలుబుకున్న ప్రధాన లక్షణాలు. జలుబుకు చికిత్స లేదు. కాబట్టి ప్రకటనలు విని డబ్బులు వృథా చేసుకోవద్దు.

జలుబు చేసినపుడు ముక్కులో ఉన్న ఘ్రాణేంద్రియ కణాల మీద వైరస్‌ కణాలు దాడిచేస్తాయి. వాటి పీచమణచడానికి మన రక్షక కణాలయిన తెల్లరక్తకణాలు యుద్ధం చేస్తాయి. అలాగే నోటిలో, నాలుకతో పాటు అన్ని వైపులా ఈ వైరస్‌లు దాడిచేయడం, వాటి మీద రక్షక కణాలు యుద్ధం చేసి తొలగించడం పరిపాటి.మరోమాటలో చెప్పాలంటే వాసన చూడాల్సిన ముక్కు, రుచి చూడాల్సిన నాలుక వైరస్‌, తెల్ల రక్తకణాల మధ్య యుద్ధ భూములుగా మారతాయన్నమాట.అటువంటి పరిస్థితిలో తిన్న ఆహార పదార్థాల్లోని వాసన నిచ్చే అణువుల్ని, రుచిని కలిగించే రసాయనాల్ని ఆయా ఇంద్రియావయవాలు సరిగా గుర్తించలేవు. అందుకే జలుబున్నపుడు వాసన, రుచి మందగిస్తాయి.

  • - ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; --కన్వీనర్‌, శాస్త్రప్రచార విభాగం, జనవిజ్ఞానవేదిక (తెలంగాణ)
  • ===========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Friday, November 28, 2014

మనం నడుస్తున్నపుడు కుడివైపు కంటే ఎడమ వైపునకే ఒరుగుతుంటామెందుకు?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

 ప్రశ్న:మనం నడుస్తున్నపుడు కుడివైపు కంటే ఎడమ వైపునకే ఒరుగుతుంటాం. ఎందుకు?

జవాబు: మనదేహం కచ్చితమైన సౌష్ఠవం కల్గి ఉండదు. మన కుడి కాలు ఎడమ కాలు కన్నా కొంచెం పొడవుగా ఉంటుంది. క్రీడాకారుల శరీర దారుఢ్యాన్ని నిర్ణయించే పరీక్షల్లో ఈ విషయం నిర్ధారణయింది. అంతేకాకుండా ఎడమ కాలు కన్నా కుడి కాలు కొంచెం ఎక్కువ బలంగా ఉండి సులభంగా వంగే గుణం కల్గి ఉంటుంది. అందువల్లే ఏదైనా వస్తువును తన్నవలసి వస్తే మనం సాధారణంగా కుడి కాలునే ఎక్కువగా వాడుతాం. నడుస్తున్నపుడు కుడికాలును ఎడమ కాలి కన్నా కొంచెం పైకి ఎత్తుతాం. కుడికాలు ఎక్కువ బలం కల్గి ఉండటం వల్ల మనం నడుస్తున్నపుడు నేలను కుడి కాలి పాదంతో నెట్టినపుడు దాని ఫలితంగా ఉత్పన్నమయ్యే ప్రతిబలం ఎడమవైపునకు పనిచేస్తుంది. ఆ బలం ఎడమపాదం కుడివైపు ప్రసరింపచేసే బలం కన్నా ఎక్కువ ఉంటుంది. కుడికాలు వేసే అంగ, అది కలగచేసే ప్రతిబలం ఎక్కువ కావడం వల్ల ఈ రెంటి కలయిక మనం ఎక్కువ దూరం నడుస్తున్నపుడు మనల్ని అపసవ్య దిశలో కదిలేటట్లు చేస్తుంది. అందువల్ల వేగంగా నడుస్తున్నపుడు ఎడమవైపునకు ఒరుగుతూ ఉంటాం. నడకలో బ్యాలెన్స్‌ పోయినపుడు ఎడమవైపునకు ఎక్కువగా వాలిపోతాం. నడకలో బలంగా ఉన్న కుడికాలు ప్రాధాన్యత వల్లే ఏదైనా శుభకార్యానికి బయలుదేరేటప్పుడు కుడికాలును ముందు పెట్టమని అంటారేమో!

- ప్రొ|| ఈ.వి.సుబ్బారావు, హైదరాబాద్‌
  • ===========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

మనం సూర్యరశ్మి నుంచి పొందే D విటమిన్‌కు, ఆహారం ద్వారా లభ్యమయ్యే డి విటమిన్‌కు తేడా ఉందా?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

    ప్రశ్న: మనం సూర్యరశ్మి నుంచి పొందే D విటమిన్‌కు, ఆహారం ద్వారా లభ్యమయ్యే డి విటమిన్‌కు తేడా ఉందా?

జవాబు: స్వచ్ఛమైన పదార్థం ఏ పద్ధతిలో తయారయినా గానీ గుణగణాలు ఒకే విధంగా ఉంటాయి. కాబట్టి D విటమిన్‌ను సూర్యరశ్మి ద్వారా పొందినా, ఆహారం ద్వారా పొందినా వాటిలో తేడా ఉండదు. ఆహారం ద్వారా లభించే D విటమిన్‌ ఒకే దఫాలో సరిపడినంత తీసుకోగలం. సాధారణ మనిషికి రోజుకు 15 నుంచి 20 మైక్రో గ్రాముల (మిల్లిగ్రాములో వెయ్యో వంతును మైక్రోగ్రాము అంటారు) 'డి' విటమిన్‌ అవసరం. అయితే ఎక్కువసేపు ఎండలో కూర్చుంటే చర్మంలో 'డి' విటమిన్‌తోపాటు క్యాన్సరు కారక ఉత్పన్నాలు కూడా వచ్చి చేరతాయి. ఎక్కువసేపు ఎండలో ఉండకూడదు. సాధారణంగా ఉదయం కాసేపు ఎండలో నడిచినా లేదా సాయంత్రం ఎండ ఉన్నప్పుడు కొన్ని నిముషాలు ఉన్నా మనకు అవసరమైనంత 'డి' విటమిన్‌ లభిస్తుంది.

'డి' విటమిన్‌ లోపిస్తే ఎముకలకు సంబంధించిన లోపాలు వస్తాయి. ఇందులో ప్రధానమైంది 'రికెట్స్‌' chole calciferol అనే పేరుతో D3 విటమిన్‌ సూర్యరశ్మి సమక్షంలో చర్మంలో కొలెస్టరాల్‌ నుంచి తయారవుతుంది. ఇది ఆహారం ద్వారా కూడా దొరుకుతుంది. ergo calciferol కూడా దొరుకుతుంది. D2 విటమిన్‌ మాత్రం సూర్యరశ్మి సమక్షంలో సాధారణంగా లభ్యం కాదు. దీన్ని ఆహారం ద్వారా పొందాల్సిందే. ఈ రెండింటిని కలగలిపి D విటమిన్‌ అంటాము. ఈ విటమిన్లు ఎముకలు సమగ్రంగా, సక్రమంగా పెరిగేలా దోహదపడతాయి.

- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; కన్వీనర్‌, శాస్త్రప్రచార విభాగం, జనవిజ్ఞానవేదిక (తెలంగాణ) 
  • ===========================
 visit My website > Dr.Seshagirirao - MBBS.-

Sunday, November 23, 2014

Sweating in Himalayas? - హిమాలయాలలో ఉన్నవారికి చెమట పోస్తుందా?.

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
  •  

  •  
 ప్ర : హిమాలయాలలో ఉన్నవారికి చెమట పోస్తుందా?.

జ : పోస్తుంది కాని కనబడదు . మనిషి క్షీరద విభాగానికి చెందిన జీవి కాబట్టి శరీరము మీద స్వేదగ్రంధులు తప్పకుండా ఉండాయి. క్షీరదాలు తమ శరీర ఉష్ణోగ్రతను స్థిరముగా ఉంచుకునేందుకు శరీరము నుండి  నీటిని చెమట రూపములో బయటకు పంపుతుంటాయి. అది నిరంతరము జరిగే ప్రక్రియ . వేడి ప్రాంతం లోవారికి కనిపించినంత అధికం గా చెమట బయటకు  కనిపించకపోయినా హిమాలయాలలో ఉండేవారికీ చెమట పోస్తుంది. ఆ చలి ప్రాంతలలోవారి చెమట వెంట వెంటనే గాలిలో కలిసిపోతుంది. కాబట్టి చెమట పోయడమనే సహజ లక్షణము ఎటువంటి వాతావరణము లో ఉన్నప్పటికీ కొనసాగుతునే ఉంటుంది.
  • =========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Why that difference in Milk and Butter milk,పాలు-మజ్జిగల్లో ఆ తేడా ఏల?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
  •  

ప్రశ్న: మజ్జిగలో కలిపిన నీరు కాసేపయ్యాక పైన తేటగా తేలుతుంది. మజ్జిగ తెలుపు కింద పేరుకుంటుంది. కానీ పాలలో నీళ్లు పోస్తే నీరు ఎప్పటికీ పైకి తేలదు ఎందుకని?

జవాబు: ఇద్దరి మధ్య బాగా సాన్నిహిత్యం ఏర్పడితే వారిద్దరూ పాలు నీళ్లలాగా కలిసిపోయారు అంటూ సామెత కూడా ఉంటుంది. గతంలో పలుమార్లు చెప్పుకున్నట్లు పాలు ఓ కొల్లాయిడ్‌ తరహా మిశ్రమ పదార్థం. అధిక భాగం నీరే ఉన్నా అందులో ఉన్న మిగిలిన పీలిక పదార్థాలు, తైల బిందువుల మీద సూక్ష్మ స్థాయిలో విద్యుదావేశం ఉండటం పరస్పర వికర్షణ ద్వారా అవి చెల్లాచెదరుగా పాల భాగం మొత్తం సమానంగా విస్తరించి ఉంటాయి. తోడు వేసి పెరుగుగా మార్చితేగానీ, లేదా ఉప్పు వేసి పాలు విరిగేలా చేస్తేగానీ లేదా నిమ్మరసం పిండి విరిగేలా చేస్తేగానీ పాలలోని కొల్లాయిడల్‌ తత్వం పోదు. కానీ మజ్జిగ అంటేనే చిలికిన పెరుగు. పెరుగు అంటనే పాలలో ఈస్ట్‌ బాక్టీరియా విడుదల చేసిన రసాయనాల వల్ల కొల్లాయిడల్‌ తత్వం పోగొట్టుకొని పాలలోని పాల పదార్థాలు గడ్డకట్టుకున్న స్థితి. కాబట్టి అటువంటి పెరుగును చిలికి మజ్జిగ చేసినా కొల్లాయిడల్‌ తత్వాన్ని (విద్యుదావేశాల్ని) పోగొట్టుకున్న పాలలోని పదార్థాలు భూమ్యాకర్షణ వల్ల కిందికి ఎప్పడికపుడు జారుకుంటాయి. కానీ అంతటా వ్యాపించి ఉన్న నీరు పైకి తేరుకున్నట్టు అనిపిస్తుంది.

పాలస్థితిలో అందులోని పదార్థాలకు విద్యుదావేశం ఉండటం వల్ల కలిగే కొల్లాయిడల్‌ తత్వం వల్ల నీరు ఎంత పోసినా సమంగా విస్తరించి ఉంటాయి. కానీ మజ్జిగలోని పాల పదార్థాలకు విద్యుదావేశం లోపించడం వల్ల కొల్లాయిడల్‌ తత్వాన్ని పోగొట్టుకుని భూమ్యాకర్షణ వల్ల కిందికి చేరుకుంటాయి. ఇదే తేడా.

- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; కన్వీనర్‌,-శాస్త్రప్రచార విభాగం, జనవిజ్ఞానవేదిక (తెలంగాణ)

  • ===========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Thursday, November 20, 2014

పాలు మరిగిస్తే ఎందుకు పొంగుతాయి? నీళ్లు ఎందుకు పొంగవు?

  •  
  •  

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

 నీళ్లు పొంగవేం?

ప్రశ్న: పాలు మరిగిస్తే ఎందుకు పొంగుతాయి? నీళ్లు ఎందుకు పొంగవు?

జవాబు: పాలు పొంగడం అంటే పాలలో అధిక మోతాదులో ఉన్న నీళ్లే పొంగుతాయన్న విషయం తెలుసుకోవాలి. పాలు నిర్దిష్టమైన ఒకే పదార్థం కాదు. ఉప్పు లాగా, చక్కెరలాగా, క్లోరోఫారంలాగా, ఆక్సిజన్‌లాగా అది ఒక శుద్ధమైన సంయోగ పదార్థమో, మూలకమో కాదు. పాలు ఓ మిశ్రమ పదార్థం. అలాగని ఉప్పు నీళ్లలాగా, చక్కెర ద్రావణంలాగా సోడా బాటిల్‌లోని నీళ్లలాగా సమసంఘటన ద్రావణం కూడా కాదు. పాలను కొల్లాయిడ్‌ తరహా మిశ్రమ పదార్థం అంటారు. అంటే అందులో ద్రావణి అయిన నీటితోపాటు, కరిగిన కొన్ని లవణాలు, చక్కెరలతో పాటు కరగకుండా పాలలో అన్ని వైపులకూ విస్తరించి ఉన్న పెద్దపెద్ద అణువులు, ప్రోటీన్‌ పీలికలు, జీవ రసాయన బృహదణువులూ ఉంటాయి.

వీటికి తోడుగా చక్కెర గుళిక మీద చీమలు గుమిగూడినట్టు చిన్నపాటి నీటి బిందువుల చుట్టూ పాతుకుపోయిన తైల కణాలు, తైల బిందువుల చుట్టూ ఇదే విధంగా పేరుకున్న నీటి బిందువులు ఉండే సమూహాలు కూడా ఉంటాయి. ఇలాంటి సమూహాలను మైసెల్స్‌ అంటారు. ఇలా ఎన్నో పదార్థాల సమ్మిశ్రణమే పాలు. ఇలాంటి పాలను వేడి చేసినప్పుడు ఉష్ణోగ్రత 100 డిగ్రీల సెల్సియస్‌కు దాటే సమయంలో పాలలోని నీరు ద్రవస్థితి నుంచి వాయు స్థితిగా మారే క్రమంలో బుడగలు ఏర్పడతాయి. అయితే పాలలో వివిధ పదార్థాలు ఉండటం వల్ల పాలలో ఉష్ణం అన్ని వైపులకు ఒకేవిధంగా విస్తరించదు. క్రింద భాగాన అధిక వేడి పైభాగంలో తైల బిందువులు తేలడం వల్ల తక్కువ వేడి ఉంటుంది. కాబట్టి కిందనే మొదట ఏర్పడ్డ నీటి ఆవిరి బుడగలు తమపై ఉన్న పాలభాగాన్ని నెట్టుకుంటూ పైకి వెళతాయి. అందువల్లే పాలు పొంగుతాయి. కానీ నీటి విషయం అలా కాదు. నీరు శుద్ధమైన ద్రావణి కాబట్టి ఉష్ణం అన్ని వైపులకూ ఉష్ణ సంవహనం అనే పద్ధతిలో చేరడం వల్ల నీటిలో అన్ని భాగాల్లోనూ బుడగలు వస్తాయి. కాబట్టి పొంగకుండానే పైనున్న బుడగలు గాలిలో కలుస్తుంటాయి.

  • - ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; కన్వీనర్‌,-శాస్త్రప్రచార విభాగం, జనవిజ్ఞానవేదిక (తెలంగాణ)
  • ============================

Calender papers fly up why?,క్యాలెండర్‌ కాగితాలు మాత్రం పైకే ఎగురుతాయెందుకు?

  •  

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !..

ప్రశ్న: ఫ్యాన్‌ గాలి పైనుంచి కిందకు వీస్తున్నా క్యాలెండర్‌ కాగితాలు మాత్రం పైకే ఎగురుతాయి. ఎందుకు?

జవాబు: ఇలా జరగడానికి కారణం గాలి వస్తువులపై ప్రయోగించే పీడన ప్రభావమే. ఉదాహరణకు రెండు ఆపిల్‌ పళ్లను సన్నని దారాలతో ఒకదాని పక్కన మరొక దానిని వేలాడదీసి వాటి మధ్యన ఉండే ఖాళీ స్థలంలో గాలిని వూదితే, ఆ పండ్లు రెండు ఒకదాని నుంచి మరొకటి దూరంగా జరుగుతాయని అనుకొంటాం. కానీ, నిజానికి అవి రెండూ దగ్గరగా వస్తాయి. గాలి వూదడం వల్ల అంతక్రితం ఆపిల్స్‌ మధ్య ఉన్న గాలి తొలగిపోయి తాత్కాలికంగా అక్కడ కొంత శూన్యం ఏర్పడుతుంది. ఆ శూన్యాన్ని నింపడానికి పక్కల ఉన్నగాలి తోసుకు వస్తుంది. ఆ గాలి తనతోపాటు ఆపిల్స్‌ను కూడా దగ్గరగా తెస్తుందన్నమాట.

ఫ్యాన్‌ నుంచి గాలి వీస్తున్నపుడు కూడా ఇదే సూత్రం క్యాలెండర్‌ కాగితాలపై వర్తిస్తుంది. పైనుంచి వేగంగా వచ్చే ఫ్యాన్‌ గాలి క్యాలెండర్‌ పేపర్ల వద్ద అంతకు ముందున్న గాలిని తొలగిస్తుంది. ఆ ప్రదేశంలో పీడనం తగ్గడం వల్ల క్యాలెండర్‌ కిందవైపు ఉండే గాలి అక్కడకు వస్తుంది. కింద నుంచి గాలి పైకి వచ్చినపుడు తేలికగా ఉండే క్యాలెండర్‌ కాగితాలు పైకి లేచి రెపరెపలాడుతుంటాయి.

- ప్రొ|| ఈవీ. సుబ్బారావు,-హైదరాబాద్‌
  • ============================

Magnatic Trains move -మాగ్నటిక్‌ రైళ్లు చక్రాలు లేకుండానే ఎలా నడుస్తాయి?

  •  
  •  

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

 ప్రశ్న: మాగ్నటిక్‌ రైళ్లు చక్రాలు లేకుండానే ఎలా నడుస్తాయి?

జవాబు: మామూలు రైళ్లు పట్టాల మీద ఆనడం వల్ల పట్టాలకు రైలు చక్రాలకు మధ్య ఏర్పడిన ఘర్షణను చక్రం తిరగడం ద్వారా అధిగమిస్తారు. అందుక్కావలసిన శక్తిని ఇంధనం ద్వారా లేదా సరాసరి విద్యుత్తు ద్వారా పొందుతారు. చక్రాలు గుండ్రంగా ఉండటం వల్ల పట్టాలకు ఆనిన భాగం స్వల్పంగానే ఉంటుంది. ఘర్షణ అనేది మనకు ఆటంకం. దాని విలువ అంటుకొని ఉన్న వస్తువుల మధ్య అంటుకున్న వైశాల్యాన్ని బట్టి పెరుగుతుంది. చక్రాలు పట్టాలకు తాకిన ప్రాంతపు వైశాల్యం తక్కువగా ఉండటం వల్ల ఘర్షణ బలం కొంతలో కొంత తగ్గినట్టే.

కానీ బండి జరగాలంటే చక్రం తిరగాలి. అందుకోసమే శక్తి అవసరం. మాగ్నటిక్‌ రైళ్లలో రైలు బండి చక్రాల ఆధారంగా పట్టాల మీద నిలబడదు. రైలు పట్టాలకు రైలు బండి అడుగున ఉన్న చక్రాల స్థానే ఉన్న పట్టీలకు ఒకే ధృవత్వం ఉన్న అయస్కాంత తత్వాన్ని విద్యుశ్చక్తి ద్వారా ఏర్పరుస్తారు. సజాతి ధృవాలు వికర్షించుకుంటాయని మీరు చదువుకున్నారు. పట్టాల అయస్కాంత ధృవత్వం, రైలు అడుగున ఉన్న విద్యుదయస్కాంత పట్టీల అయస్కాంత తత్వం ఒకేవిధంగా ఉండటం వల్ల ఏర్పడిన వికర్షణ రైలు మొత్తంగా పట్టాల నుంచి కొన్ని మిల్లిమీటర్ల మేరపైకి తీస్తుంది. దీన్నే అయస్కాంత ఉత్‌ప్లవనం అంటారు. ప్రత్యేక పద్ధతిలో పట్టాలకు, పట్టీలకు మధ్య ఏర్పడిన వికర్షణ బలాన్ని మార్చడం ద్వారా రైలు ముందుకు వెళ్లేలా ఏర్పాటు ఉంటుంది. మామూలు రైలు పట్టాల్లాగా ఈ మాగ్నటిక్‌ రైలు బండి పట్టాలు సాఫీగా అవిచ్ఛిన్న రేఖలాగా కాకుండా విచ్ఛిన్నంగా ఉండటం వల్ల ఇలా చలనం వీలవుతుంది.

- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌;-కన్వీనర్‌, శాస్త్రప్రచార విభాగం, జనవిజ్ఞానవేదిక (తెలంగాణ)
  • ==========================

Where did mosquitos go in winter?-చలికాలము లో దోమలు ఎక్కడికి పోతాయి?

  •  
  •  

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్ర : -చలికాలము లో దోమలు ఎక్కడికి పోతాయి?

జ : చలికాలము లో దోమలు ఎక్కడికీ పోవు . చలి ఎక్కువగా ఉన్నప్పుడు వాతావరనము సరిపోక దోమలు ఎటో పారిపోతాయనుకుంటాము కాని నిజానికి అవి ప్రతికూల పరిస్థితులనుండి  తప్పించుకునేందుకు దాక్కుంటాయి. ఎక్కువగా ..వేడిగా ఉన్న మన బెడ్ రూములలోనే నివాసాలు ఏర్పరచుకుంటాయి. వీలైతే మనకు కుట్టడానికి ప్రయత్నిస్తాయి. చలికాలము ముందు పెట్టిన గుడ్లు పొదగబడక అలాగే ఉంటాయి. ప్యూపా దశకు చేరినవి అలాగే నిలబడతాయి.  ఇక పెడ్ద దోమలయితే గోడలకు అంటిపెట్టుకుని అటూ ఇటూ ఎగరక శరీరములో నిలువ చేసునివున్న శక్తిని వినియోగించుకుటాయి. తిరిగి చల్లని ఉష్ణోగ్రత పోయి అనుకూల పరిస్థితులు రాగానే గుడ్లు , ప్యూపాల నుండి దోమలు పుట్టుకొస్తాయి.
  •  ====================

Nalleru pai nadaka?-నల్లేరు పై బండి నడక అంటే ఏమిటి?

  •  

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్ర : నల్లేరు పై బండి నడక అంటే ఏమిటి?
జ : నల్లేరు మీద నడక---అతి సులబమైన పని అని అర్థం.
వివరణ:..... బండి నడిచే దారిలో నల్లేరు అడ్డంగా వుంటే బండి నడకకు అడ్డమేమి కాదు. దాన్ని తొక్కు కుంటూ అతి సులబంగా బండి పెళ్లి పోతుంది. గ్రామాలలో రహదారులు తినంగా ఉండక బాగా గోతులతో అధ్వాన్నము గా ఉండేవి . అటువంటి గోగులలో బండి నడకకు అవరోధము గా ఉన్నాప్పుడు ఆ గోతులలొ నల్లేరును పడేసేవారు. ఆ తీగలను వేయడం ద్వారా బండి నడక సాఫీగా సాగిపోవడము వల్ల ... అనాయాసం గా జరిగే కార్యాలకు ఆవిధంగా " నల్లేరు పై బండి నడక " అనడం అలవాటుగా మారింది
.
  • ===========================

Saturday, November 15, 2014

Do Suras are only 3 crores?- దేవతలు మూడుకోట్లుమందే ఉంటారా?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
  •  
  •  

ప్ర : Do Suras are only 3 crores?- దేవతలు మూడుకోట్లుమందే ఉంటారా?.

జ : దేవతలు కష్యపు మహాముని 14  రకాల సంతానములో ఒక జాతి. అధితి-కష్యపమునికి పుట్టిన సంతానము .దేవలోక నివాసులు . ఈ పద్నాలు లోకాలూ జంబూ ద్వీపములో ఉన్నవే.

ఒకానొక సందర్భము లో చేవతలకు ఇకమీదట సంతానము కలుగరాదని " పార్వతీ దేవి " శపించినది. ఆ కారణముగా అప్పటికే ... అంతకుపూర్వమే సంతానము కలిగి ఉన్నవారు తప్ప ఆ పైన దేవతలకెవరికీ సంతానము లేకుండా పోయింది. కాబట్టి ఆనాటి తర్వాత దేవతల సంఖ్య పెరిగే అవకాశము లేదు. మంకున్నది మూడుకోట్లు దేవతలు కాదు .? 33 కోట్ల మంది దేవతలు.
  •  మూలము : స్వాతి వారపత్రిక తేదీ. 21-11-2014 (అనిల్ స్వాతి).
 దేవతలు అమృతము తాగి చావులేకుండినవారైనందున సంతానము లేకుండా ఉండడమే మేలు . పుట్టుక ఉండి ..చావు లేకపోతే   వారి జనాభా పరగడమే కాని తరగడమంటూ ఉండదు. నేడు దేవతలు ఉన్నారా? లేరా? అనేది ఎవరికీ తెలియని రహస్యము .. ఇది ఒక నమ్మకము మాత్రమే.  జీవ పరిణామ క్రమములో కాలగర్భములో కలిసిపోయారేమో?

  • -=======================

Sunday, November 09, 2014

అంతరిక్ష వస్తువుల ఆకారాలను ఏ అంశాలు నిర్ధరిస్తాయి?

  •  

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: అంతరిక్షంలోని గ్రహాలు, ఇతర ఖగోళ వస్తువుల ఆకారాలను ఏ అంశాలు నిర్ధరిస్తాయి?

జవాబు: అంతరిక్షంలోని ఏ ఖగోళ వస్తువు ఆకారాన్నైనా నిర్ణయించేది అది ఏ పదార్థాలతో నిర్మితమై ఉంది అనే విషయంపైనే కాకుండా దాని ద్రవ్యరాశిపై తద్వారా ఉత్పన్నమయ్యే గురుత్వం (Gravity) పై కూడా ఆధారపడి ఉంటుంది. వాయువులేక ద్రవ పదార్థాలతో కూడుకున్న గ్రహాలు, గోళాకారంలో రూపొందుతాయి. కారణం దానిపై గురుత్వం అన్ని దిశలలో ఒకే రకంగా, సమానంగా పనిచేయడమే. భూమి తొలుత ద్రవ రూపంలోనే ఉండేది. అదే వాటి అంతర్భాగాలు అప్పటికే రాతితో నిర్మితమయి ఉంటే, గురుత్వ బలంకన్నా బరువైన రాయి ప్రయోగించే బలం ఎక్కువవడంతో 'ఆస్టరాయిడ్ల' లాంటి లఘు గ్రహాలు గోళాకారంలో కాకుండా ఒక క్రమంలేని విచిత్రమైన ఆకారాలు కలిగి ఉంటాయి. కానీ ఆస్టరాయిడ్ల వ్యాసం 800 కిలోమీటర్ల కన్నా ఎక్కువగా ఉంటే దాని గురుత్వం తగినంత బలం కలిగి ఉండడంతో అది చాలా వరకు గోళాకారాన్ని కలిగి ఉంటుంది. దీనికి 970 కిలోమీటర్ల వ్యాసం ఉండే లఘు గ్రహం 'సిరీస్‌' మంచి ఉదాహరణ.

తమ చుట్టూ తాము అతి వేగంగా తిరిగే ఖగోళవస్తువులు కచ్చితమైన గోళాకారంలో కాకుండా దీర్ఘవృత్తాకారం (Elliptical form) కలిగి ఉంటాయి. దీనికి కారణం వాటి పరిభ్రమణ వేగం వాటి విషువద్రేఖ (Equator) దగ్గర ఎక్కువగా ఉండడంతో అక్కడ ఏర్పడిన ఉబ్బు వల్లనే.

- ప్రొ|| ఈ.వి.సుబ్బారావు,-హైదరాబాద్‌
  • ============================

Sea water change to drinking water?,సముద్రపు నీటిని మంచినీరుగా మార్చగలమా?

  •  

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న : సముద్రపు నీటిని మంచినీరుగా మార్చగలమా?

జవాబు: కోట్లాది సంవత్సరాలుగా వర్షపు నీరు నదుల్లోనూ, వర్షపాత ప్రాంతాల్లోనూ ఉన్న వివిధ లవణాలను మోసుకెళ్లి సముద్రంలో కలపడం వల్ల సముద్రపు నీరు ఉప్పుమయం అయ్యింది. సముద్రపు నీరు తాగు, సాగునీరుగా పనికిరాదు. ఇలాంటి నీరు తాగితే జీర్ణవాహిక పొడవునా ఉన్న కణాల్లోని నీరు ద్రవాభిసరణం (Osmosis) ద్వారా తాగిన ఈ ఉప్పు నీళ్లలో కలుస్తుంది. తద్వారా జీర్ణవాహిక తన నిర్మాణాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. పైగా సముద్రపు నీటిలో ఉన్న కొన్ని నిరింద్రియ లవణాలు రక్తంలో కలిస్తే మన జీవ భౌతిక వ్యవస్థ అస్తవ్యస్తమవుతుంది. వ్యవసాయానికి ఈ నీరు పారితే పొలంలో ఉన్న సారాన్ని హరించి వేస్తాయి. పంటలు సరిగా పండవు.

సముద్రంలో ఉన్న నీటి మొత్తాన్ని మంచినీరుగా మార్చడం వీలుకాదు. కానీ సముద్రపు నీటిని తక్కువ మోతాదులో 'రివర్స్‌ ఆస్మోసిస్‌' ద్వారా మంచి నీటిగా మార్చగలం. అయితే ఇది ఖర్చుతో కూడుకున్న పని. అయితే రివర్స్‌ ఆస్మాసిస్‌, స్వేదన ప్రక్రియల ద్వారా ఉప్పునీటిని మంచినీటిగా మార్చే అవకాశం శాస్త్రీయంగా ఉంది.

మనం తాగే నీరు, సాగు నీరు వర్షాల నుంచి వచ్చిందే. వర్షాలు సముద్రపు నీటి నుంచి వచ్చే మేఘాల నుంచే కాబట్టి సముద్రంపై నీరు పరోక్షంగా ప్రకృతి వరప్రసాదంగా, మంచి నీరుగా మారినట్టే కదా!

  • - ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌;-కన్వీనర్‌, శాస్త్రప్రచార విభాగం,-జనవిజ్ఞానవేదిక (తెలంగాణ)

  • ===================================

How do fish not hitting walls ,చేపల తొట్టె గోడలకు తగలకుండా ఎలా ఈదగలుగుతున్నాయి?

  •  

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: చేపల తొట్టెలో చేపలు వేగంగా తిరుగుతున్నా అవి ఆ తొట్టె గోడలకు తగలకుండా ఎలా ఈదగలుగుతున్నాయి?

జవాబు: చేపలకు నీటిలో కదలికల వల్ల కలిగే ప్రచోదనాలను (Impulses) గుర్తించగల అతీంద్రయ శక్తి ఉంది. ఈ శక్తికి కారణమైన జ్ఞానేంద్రియం చేపల దేహంలో వాటి కంటి నుంచి తోక చివరి వరకు ఒక రేఖా రూపంలో వ్యాపించి ఉంటుంది. దీనిని 'పార్శ్వరేఖ' అంటారు. ఈ రేఖ అతి చిన్న రంధ్రాలు కలిగి చేపల దేహంలో ఒక పాలిపోయిన గీత రూపంలో ఉండి చేపల చర్మం కింద సన్నని గొట్టాల రూపంలో ఉండే న్యూరోమాస్ట్స్‌ అనే జీవకణాలతో కలుపబడి ఉంటుంది. ఈ కణాలు నీటిలో ఉత్పన్నమయ్యే అతి స్వల్పమైన కంపనాలను, కదలికలను చేపలు గ్రహించేటట్లు చేస్తాయి. అందువల్లే చేపల తొట్టెలో అవి ఎంత వేగంగా ఈదుతున్నా తొట్టె గోడలకు ఢీకొనకుండా ఉంటాయి. మురికి నీటిలో కూడా అవి వాటి మార్గాలకు అడ్డంకులు తగలకుండా ముందుకు పోగలుగుతాయి. ఈ అతీంద్రయ శక్తి వల్లే వాటిి సమీపానికి వచ్చే హానికరమైన ప్రాణుల లేక ఆహారానికి పనికి వచ్చే వాటి ఉనికిని, పరిమాణాన్ని అంచనా వేయగలవు.

  • - ప్రొ|| ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌
  • ================================

Electricity in Trains?,రైళ్లలో విద్యుత్‌ ఎక్కడి నుంచి వస్తుంది?

  •  

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న:
రైళ్లలో ఫ్యాన్లకు, లైట్లకు విద్యుత్తు ఎక్కడి నుంచి వస్తుంది?

జవాబు: మన ఇళ్లలో ఉన్న ఫాన్లకు, రైళ్లలో ఉన్న ఫ్యాన్లకు కొంత తేడా ఉంది. ఇళ్లలో ఉన్న ఫ్యాన్లు సుమారు 230 వోల్టుల విద్యుత్‌ శక్మం ఉన్న ఆల్టర్నేటింగ్‌ కరెంటు(ac) తరహా విద్యుత్‌లో నడుస్తాయి. రైళ్లు స్టేషన్‌లో ఆగి ఉన్నా లోపలున్న ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఫ్యాన్లు తిరగాలి కాబట్టి బ్యాటరీల ద్వారా నడిచే ప్రత్యక్ష విద్యుత్‌ (direct current)లో నడిచేలా ఉంటాయి.

వీటిని 'మోటార్లు' నడిపిస్తాయి. రైలు పెట్టెల కింద చాలా బ్యాటరీలు శ్రేణిలో కలిపి ఉంటాయి. రైలు నడుస్తున్నపుడు ఇరుసులకు సంధానించుకున్న విద్యుదుత్పత్తి సాధనాలు లేదా డైనమోలు విద్యుత్‌ను ఉత్పత్తి చేయగా ఆ విద్యుత్‌తో ఎప్పటికపుడు బ్యాటరీలను ఛార్జ్‌ చేస్తారు. లైట్లు కూడా ఇదే బ్యాటరీల విద్యుత్‌తో నడుస్తాయి. ఆధునిక రైళ్లలో లెడ్‌ స్టోరేజి బ్యాటరీలకు బదులుగా ఘనస్థితి బ్యాటరీలను వాడుతున్నారు.

  • ============================

Saturday, November 08, 2014

కొయ్యను కరిగించవచ్చా?,కొయ్య ద్రవరూపంలో ఉంటుందా?

  •  

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !... కొయ్యను

ప్రశ్న:
కొయ్య ద్రవరూపంలో ఉంటుందా?

జవాబు: ప్రకృతి సహజమైన కొయ్యను కరిగించడానికి వీలు లేదు. అది మామూలు ద్రావకాలలో కూడా కరగదు. కానీ ఈ మధ్య ద్రవరూపంలో ఉండే కొయ్యను శాస్త్రజ్ఞులు రూపొందించారు. దీనితో లౌడ్‌ స్పీకరు పెట్టెల నుంచి పెన్సిళ్లు, తుపాకీ మడమలే కాకుండా అనేక వస్తువులను తయారు చేస్తారు. ఈ పదార్థంలో ఉండే ప్రధాన అంశం కొయ్యలో ఉండే 'లిగ్నిన్‌' అనే పాలిమర్‌. లిగ్నిన్‌ మొక్కలలో ఉండే కణాలకు స్థిరత్వాన్ని సమకూరుస్తుంది. కాగితపు పరిశ్రమలో వాడే కొయ్య నుంచి లిగ్నిన్‌ను వ్యర్థపదార్థం కింద తీసేస్తారు. ఎందుకంటే ఇది కాగితానికి అవసరం లేని పసుపు రంగును ఇస్తుంది. అలా తీసేసిన లిగ్నిన్‌ను ప్రకృతి సహజమైన నారు, పీచు, వివిధ రంగులతో కలపడంతో అది ఒక జిగురు పదార్థంగా ఏర్పడుతుంది. అదే ద్రవరూపంలో ఉండే కొయ్య.

  • - ప్రొ|| ఈవీ.సుబ్బారావు,-హైదరాబాద్ఎ
  • =========================

How pus is formed?,చీము ఎందుకు వస్తుంది?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
  •   

  •  
ప్ర : Why do pus come out?,చీము ఎందుకు వస్తుంది?

: గాయము తగిలితే రక్తము కారుతుంది . తదుపరి రక్తము గడ్డకట్టి రక్తప్రవాహము ఆగిపోయేలోగానే గాయమైన ప్రాంతము లోకి పలు సూక్ష్మజీవులు ప్రవేశిస్తాయి. ఆ సూక్ష్మజీవులు శరీరములో చేరి దెబ్బతీయకుండా చూసే బాద్యత రక్తములోని తెల్లరక్తకణాలది. ఇవి సూక్ష్మజీవులతొ చేసే పోరాతములో కొన్ని తెల్లరక్త కణాలు మరణిస్తాయి. వీటితోపాటు గాయం ప్రాంతములోని మృతకణాలు జతకూడుతాయి. ఇదంతా బయటకు పోయే ప్రయత్నమే చీము కారడము . లిక్విడ్ ప్యూరిన్‌(liquid purin) అనే ద్రవముతో పాటు మృతకణాలు బయటికి పంపబడతాయి. ఆ ద్రవము పసుపు రంగులో ఉంటుంది. . కాబట్టి చీము పసుపు రంగులో ఉండును .
  • ===================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Friday, November 07, 2014

Brahma and brahmachari relation?,బ్రహ్మ కు బ్రహ్మచారులకు సంబంధమేమిటి?.

  •  
  •  

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్ర : బ్రహ్మ కు బ్రహ్మచారులకు సంబంధమేమిటి?.

 జ : త్రిమూర్తులలోని వాడు , సరస్వతీ నాధుడు అయిన బ్రహ్మదేవునికీ , బ్రహ్మచారికి సంబంధము లేదు. వేద , ఉపనిషత్ .. ప్రతిపాధిత మయిన  బ్రహ్మపదార్ధమనే  మహాతత్వానికి  సంబంధించి ఈ బ్రహ్మచారి అనే శబ్ధాన్ని వాడడము జరిగింది.  ఆ బ్రహ్మపదార్ధాన్ని తెలుసుకొనే అన్వేషణా మార్గములో ఉన్నాడనే అర్ధముతో బ్రహ్మచారి అనే పదప్రయోగము చేశారు.
  • ==================