Thursday, November 19, 2015

మొసళ్ల లైంగికత పొదిగేప్పుడే తెలుస్తుందా?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

  •  

  •  
    ప్రశ్న: మొసళ్ల లైంగికత జన్యు పరంగా ముందే నిర్ణయం కాదని, పొదిగే క్రమంలోనే అవి ఆడ, మగ వేరు అవుతాయని విన్నాను. నిజమేనా?

జవాబు: ఇది నిజమే. మనుషులు తదితర క్షీరదాలు, చాలా జంతువుల్లో లైంగిక క్రోమోజోములు ఉంటాయి. తద్వారా ఆడ జంతువు, మగ జంతువు కలిసినపుడు ఆడ జంతువు అండంలో, మగ జంతువు శుక్ర కణం లేదా తదనుగుణమైన కణం సంయోగం చెందుతుంది. ఆ క్రమంలో సంయుక్త బీజకణం (Zygote) ఏర్పడుతుంది. ఈ సంయుక్త బీజ కణంలోని జీవి ఆడనా, మగనా అక్కడే నిర్దేశితమవుతుంది. కాబట్టి గర్భధారణ తర్వాత ఆడ బిడ్డగానీ, మగ శిశువుగానీ జన్మిస్తాయి. అలాగే కోడి పుంజు, కోడిపెట్ట కలిశాక ఏర్పడ్డ గుడ్డును పొదగకముందే పుట్టబోయేది పెట్టనా లేదా పుంజా ముందే నిర్ణయమయి ఉంటుంది. కానీ మొసళ్లు, అలిగేటర్లు వంటి జంతువులలో ఆడ, మగ లైంగికత ఉన్నా వాటిలో లైంగికతను నిర్ణయించే క్రోమోజోములు లేవు. కాబట్టి అండ దశలోనే లైంగికత నిర్ధారణ అయి ఉండదు. గుడ్డు పొదిగే ఉష్ణోగ్రతను బట్టి పుట్టబోయే మొసలి ఆడా, మగనా నిర్ణయమవుతుంది. మొసలి గుడ్డు 30 నుంచి 32 డిగ్రీల సెంటిగ్రేడు కన్నా తక్కువ ఉంటే ఆడ మొసలి వస్తుంది. మొసళ్లు ఒకసారి అనేక గుడ్లు పెడతాయి కాబట్టి ఉష్ణోగ్రత 33 నుంచి 34 డిగ్రీల సెంటిగ్రేడు మధ్య ఉంటే గుడ్లలో కొన్ని ఆడవి, కొన్ని మగవిగా బయటికొస్తాయి. అదే 35 డిగ్రీల సెల్సియస్‌కన్నా ఎక్కువుంటే మగ మొసళ్లు బయటికొస్తాయి.

- ప్రొ.ఎ.రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌;-కన్వీనర్‌, శాస్త్రప్రచారవిభాగం, జనవిజ్ఞానవేదిక (తెలంగాణ)
  • ====================

  • ===========================
  • visit My website > Dr.Seshagirirao - MBBS.- http://dr.seshagirirao.tripod.com/

పురుగులు చిన్నగా ఉంటాయేం?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...పురుగులు చిన్నగా ఉంటాయేం?

ప్రశ్న: పురుగుల పరిమాణం జంతువుల, పక్షుల కన్నా తక్కువగా ఉంటుంది. ఎందువల్ల?

జవాబు: వాతావరణంలోని గాలిలో ఆక్సిజన్‌ శాతం ఇప్పటి కన్నా ఎక్కువగా ఉండి ఉంటే, పురుగుల దేహ పరిమాణం కూడా ఇప్పటి కన్నా ఎంతో ఎక్కువగా ఉండి ఉండేది. వెన్నెముక లేని ప్రాణుల పరిమాణం వాటికి లభించే ఆక్సిజన్‌ పరిమాణంపై ఆధారపడి ఉంటుంది. అతి సన్నని గొట్టాల రూపంలో ఉండే వ్యవస్థ పురుగుల దేహమంతా వ్యాపించి వాటికి ఆక్సిజన్‌ను అందజేస్తుంది. అందువల్ల, పురుగు పరిమాణం పెద్దదయే కొలదీ, దాని దేహానికి ఆక్సిజన్‌ను సరఫరా చేసే వ్యవస్థ విస్తారమైనదే కాకుండా క్లిష్టంగా, చిక్కుపడి ఉంటుంది. అలాంటి వ్యవస్థ పరుగుల పరిమాణంపై కొంత పరిమితిని విధిస్తుంది. వాతావరణంలోని గాలిలో ఉండే ఆక్సిజన్‌ పరిమాణం ఎంత ఎక్కువగా ఉంటే, వాటి దేహంలోని వ్యవస్థ అంత ప్రతిభావంతంగా పనిచేస్తుంది.

ప్రస్తుతం గాలిలో ఆక్సిజన్‌ 21 శాతం ఉంటే, భూమిపై జీవం ఏర్పడి ప్రాణులు తిరుగాడుతున్న తొలి రోజుల్లో గాలిలో ఆక్సిజన్‌ 35 శాతం ఉండేది అందువల్ల ఆ రోజుల్లో రెక్కల పరిమాణం 760 మిల్లీ మీటర్లు ఉండే రాక్షస తూనీగలు ఉండేవి.

అంతేకాకుండా, పురుగుల గరిష్ఠ పరిమాణంపై ఆంక్షలు విధించే మరో అంశం- పురుగుల శ్వాసనాళాల పరిమాణంలో కొంత పరిమితి ఉంటుంది. అందువల్ల పురుగుల పరిమాణం ఆ పరిమితిని దాటితే, ఆ భాగాలకు ఆక్సిజన్‌ లభించదు. అందువల్లే పురుగుల శరీర పరిమాణం అంత తక్కువగా ఉంటుంది.

- ప్రొ|| ఈ.వి.సుబ్బారావు,-హైదరాబాద్‌ visit My website > Dr.Seshagirirao - MBBS.-
  • ================================
dr.seshagirirao.com/

మిగతా మోటారు వాహనాల టైర్లలో లాగా రేస్‌కార్ల టైర్లలో మామూలు గాలి ఎందుకు నింపరు?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

 ప్రశ్న: మిగతా మోటారు వాహనాల టైర్లలో లాగా రేస్‌కార్ల టైర్లలో మామూలు గాలి ఎందుకు నింపరు?

జవాబు: రేస్‌కార్ల టైర్లలో గాలికి బదులు నైట్రోజన్‌ వాయువును నింపుతారు. దీనికి కారణం నైట్రోజన్‌ వాయువులో ఉష్ణం వల్ల ఉత్పన్నమయే సంకోచ, వ్యాకోచాలు సమంగా ఒకే తీరులో ఉంటాయి. మామూలు గాలిలో కొంత శాతం తేమ కూడా ఉండటం వల్ల దాని సంకోచ, వ్యాకోచాలు ఒకే తీరుగా ఉండవు. ఫలితంగా టైర్లలో ఉండే ఒత్తిడిలో తేడాలు వస్తాయి. రేస్‌ కార్లు అత్యంత వేగంతో ప్రయాణించేటపుడు టైర్లలో ఎక్కువ వేడి పుడుతుంది. దాని ప్రభావం వాటి లోపల ఉండే వాయువు మీద పడుతుంది. గాలి కన్నా నైట్రోజన్‌పై ఉష్ణ ప్రభావం తక్కువగా ఉంటుంది కాబట్టి నైట్రోజన్‌ను వాడటం వల్ల ప్రమాదాలు సంభవించే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

- ప్రొ|| ఈ.వి.సుబ్బారావు,-హైదరాబాద్‌
  • ==================

పప్పు తింటే చీము పడుతుందా?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
  •  

  •  
ప్రశ్న: శరీరానికి గాయమయినపుడు పప్పు తింటే చీము పడుతుందంటారు నిజమేనా?

జవాబు: పప్పు తింటే చీము పడుతుందనేది సమాజంలో ఉన్న ఓ పెద్ద మూఢనమ్మకం. నిజానికి గాయం తగిలితే అది తొందరగా మానాలంటే పప్పు తినడం శ్రేయస్కరం. అసలు చీము అంటే ఏమిటి? గాయమయినపుడు ఆ గాయపు రంధ్రం గుండా కన్నంలోంచి దొంగలు దూరినట్లు రోగకారక బాక్టీరియాలు తదితర పరాన్న జీవులు శరీరంలోకి ప్రవేశిస్తే, వాటితో పోరాడి మరణించిన మన తెల్లరక్త కణాలే! మన రక్షణ వ్యవస్థలో భాగమైన ఈ మృతవీరులే గాయమైన చోట చీముగా కనిపిస్తాయి. నశించిన ఈ తెల్ల రక్తకణాల సైన్యం స్థానంలో కొత్త తెల్ల రక్తకణాలు ఏర్పడాలంటే మన శరీరానికి తగినన్ని పోషక విలువలున్న ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు కావాలి. ఈ రెండూ అమితంగా ఉన్న ఆహార పదార్థం పప్పు. బాగా ఉడికించిన పప్పు తింటే గాయమయినా చీము పట్టదు సరికదా పుండు తొందరగా మాని పోతుంది. పప్పు తినకుండా ఉంటేనే గాయానికి ప్రమాదం.

-ప్రొ|| ఎ.రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌;--కన్వీనర్‌, శాస్త్రప్రచారవిభాగం,-జనవిజ్ఞానవేదిక (తెలంగాణ)
  •  =======================

వాతావరణంలోని తేమను ఎలా కొలుస్తారు?

  • ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
  •  

  ప్రశ్న: వాతావరణంలోని తేమను ఎలా కొలుస్తారు?

జవాబు: గాలిలో ఉండే తేమను ఆర్ద్రత అంటారు. ఈ ఆర్ద్రతను రెండు విధాలుగా విభజింపవచ్చు. ఒకటి పరమ ఆర్ద్రత. రెండోది సాపేక్ష ఆర్ద్రత. ఒక నిర్దిష్టమైన ఉష్ణోగ్రత వద్ద గాలిలో ఉండే తేమను పరమ ఆర్ద్రత అంటారు. ప్రస్తుతం ఉండే ఉష్ణోగ్రత వద్ద గాలిలో ఉండే తేమను సంతృప్తీకరణం చేయడానికి కావలసిన తేమ శాతాన్ని సాపేక్ష ఆర్ద్రత అంటారు.

ఆర్ద్రతను హైగ్రోమీటర్‌ అనే పరికరంతో కొలుస్తారు. ఈ హైగ్రోమీటర్లు హెయిర్‌ హైగ్రోమీటర్‌, కెపాసిటివ్‌ హైగ్రోమీటర్‌ అని రెండు రకాలు. సాపేక్ష ఆర్ద్రతను కొలిచే హెయిర్‌ హైగ్రోమీటర్‌లో వెంట్రుకలు ఒక కుచ్చు రూపంలో ఉంటాయి. గాలిలో తేమను పీల్చుకున్నపుడు ఆ వెంట్రుకలు సాగుతాయి. అపుడు పరికరంలో ఉండే అతి సున్నితమైన యాంత్రిక వ్యవస్థ వెంట్రుకల పొడవులోని మార్పును ఒక స్కేలుపై చలనంలో ఉండే సూచికకు అందజేస్తుంది. స్కేలుపై ఆర్ద్రతల విలువలు విభాగాల రూపంలో ఉంటాయి. ఉష్ణోగ్రతలలో స్వల్ప మార్పులను సునిశితంగా గ్రహించే సామర్థ్యం ఉండటం వల్ల స్త్రీల తల వెంట్రుకలను ఈ పరికరంలో వాడతారు.

పరమ ఆర్ద్రతను కొలిచే కెపాసిటివ్‌ హైగ్రో మీటర్‌లో గాలిలోని ఆర్ద్రతను కొలవడానికి విద్యుచ్ఛక్తిని వాడతారు. ఈ పరికరంలో ఒక కండెన్సర్‌ ఉంటుంది. కండెన్సర్‌లో సమాంతరంగా ఉండే విద్యుత్‌ వాహకాలైన రెండు పలకల మధ్య ఉండే టెన్షన్‌ మార్పుల ఆధారంగా ఆర్ద్రతను కొలుస్తారు. ఆర్ద్రత అంటే గాలిలో తేమ తగ్గే కొలదీ కండెన్సర్‌ పలకల మధ్య టెన్షన్‌ తగ్గుతుంది.

- ప్రొ|| ఈ.వి.సుబ్బారావు, హైదరాబాద్‌
  • =============================

Thursday, October 22, 2015

భారీ వర్షం వచ్చే ముందు మనకు చెమట ఎక్కువగా పడుతుంది. ఎందుకని?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
  •  

  •  
ప్రశ్న: భారీ వర్షం వచ్చే ముందు మనకు చెమట ఎక్కువగా పడుతుంది. ఎందుకని?జవాబు: చెమట పట్టడం అనేది చర్మం ఉపరితలంలో నిర్విరామంగా జరిగే ప్రక్రియ. చర్మం కింద ఉండే స్వేద గ్రంధులు చెమటను స్రవింపచేస్తూ ఉంటాయి. అలా చర్మం పైకి వచ్చే చెమట వాతావరణంలోని ఉష్ణాన్ని గ్రహించి ఎప్పటికప్పుడు గాలిలోకి ఆవిరైపోతూ ఉంటుంది. ఇలా ఆవిరవడం గాలిలోని నీటి శాతంపై అంటే తేమపై ఆధారపడి ఉంటుంది. తేమ శాతం తక్కువగా ఉంటే ఆవిరయ్యే ప్రక్రియ త్వరగా జరుగుతుంది. అదే వర్షం వచ్చే ముందు గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉంటుంది. ఆ గాలిలో అప్పటికే బోలెడు తేమ ఉండటం వల్ల ఇక ఏ మాత్రం తేమను అది ఇముడ్చుకోలేదు. అందువల్ల శరీరంపైకి చేరే చెమట ఆవిరి కాకుండా అక్కడే ఉండిపోతుంది. అపుడే మనకు ఉక్కపోస్తున్నట్లు అనిపించి చెమటలు కారిపోతాయన్నమాట.

- ప్రొ|| ఈ.వి.సుబ్బారావు,-హైదరాబాద్‌
  • ======================

Tuesday, October 20, 2015

What is Anti-matter?-విరుద్ధ ద్రవ్యము అంటే ఏమిటి?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: విరుద్ధ ద్రవ్యము అంటే ఏమిటి?

జవాబు: విరుద్ధ ద్రవ్యము (యాంటీ మేటర్‌) అంటే విరుద్ధ కణాలతో కూడిన ద్రవ్యం. ఉదాహరణకు హైడ్రోజన్‌ పరమాణువు కేంద్రకంలో ధనావేశం గల ఒక ప్రోటాన్‌ ఉంటే దాని చుట్టూ రుణావేశం గల ఒక ఎలక్ట్రాన్‌ పరిభ్రమిస్తూ ఉంటుంది. అదే విరుద్ధ హైడ్రోజన్‌ పరమాణువు కేంద్రకంలో రుణావేశముండే విరుద్ధ ప్రోటాన్‌ ఉంటే దాని చుట్టూ ధనావేశముండే పాజిట్రాన్‌ పరిభ్రమిస్తూ ఉంటుంది. విరుద్ధ హైడ్రోజన్‌ను కృత్రిమంగా లాబొరెటరీలో సృష్టించారు. విరుద్ధ ద్రవ్యంలోని కణాల ఉనికిని relativistic quantum mechanics అనే భౌతిక శాస్త్రవిభాగం శాస్త్రవేత్త పాల్‌డిరాక్‌ ఊహించి సిద్ధాంతీకరించాడు. ఒక ద్రవ్య కణము, విరుద్ధ ద్రవ్యకణము ఢీ కొన్నాయంటే సంభవించేది సర్వనాశనమే. దాంతో ఎంతో శక్తి విడుదలవుతుంది.

- ప్రొ|| ఈ.వి.సుబ్బారావు,-హైదరాబాద్‌

  • ====================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

The number of forces in the universe?-విశ్వంలో శక్తులు ఎన్ని?

  •  
  • ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !... 
  •  

  •  
ప్రశ్న: విశ్వంలోని మొత్తం శక్తులు ఎన్ని?
జవాబు: ఈ విశ్వంలో శాస్త్రజ్ఞులు అన్వేషించి నాలుగు శక్తులున్నాయని నిర్ధరించారు.

1. గురుత్వాకర్షణ శక్తి: అన్ని శక్తులకన్నా బలహీనమైనది కానీ దీని అవధి అనంత దూరాలకు వ్యాపించి ఉంటుంది. ద్రవ్యంలోని కణాల మధ్య ఆకర్షణ మూలంగా కుర్చీలు నేలకు అంటుకొని ఉండడానికి, మనం నేలపై నిలబడడానికి ఉపయోగ పడుతుంది. చెట్ల నుంచి పండ్లు నేలపై రాలడానికి, నక్షత్రాలు, గ్రహాలు ఏర్పడడానికి అవి కక్ష్యలో తిరిగేందుకు కూడా ఈ శక్తే కారణం. ఈ శక్తి ఆవిష్కర్త సర్‌ ఐజాక్‌ న్యూటన్‌.

2. విద్యుదయస్కాంత శక్తి: విద్యుదావేశాల మధ్య ఆకర్షణ వికర్షణలకు, పరమాణు నిర్మాణానికి, కాంతి వెలువడేందుకు ఈ శక్తే కారణం. విద్యుత్‌ బల్బులు వెలిగేందుకు, లిఫ్టులు, టీవీలు, కంప్యూటర్లు పనిచేయడానికి ఇదే మూలాధారం. దీని అవధి అనంతం.

3. దుర్బల కేంద్రక శక్తి: ఇది పరమాణు కేంద్రకానికి చెందిన శక్తి. యురేనియం లాంటి రేడియో ధార్మిక మూలకాల కేంద్రకం విచ్ఛిన్నమవుతున్నపుడు ప్రాథమిక కణాలను వెలువరించేందుకు ఈ శక్తి ఉపయోగపడుతుంది. దీని అవధి 10-14 మీటర్లు మాత్రమే.

4. ప్రబల కేంద్రక శక్తి: పరమాణువులోని కేంద్రకాలను ఒకటిగా నిలకడగా ఉంచే శక్తి ఇది. ప్రోటాన్లు, న్యూట్రాన్లు వీటిలో ఉండే 'క్వార్కులు' ఇలా పరమాణు కేంద్రకంలో ఉన్నవాటినన్నిటినీ బంధించి ఉంచేందుకు ప్రబల కేంద్రకశక్తి ఉపయోగ పడుతుంది. ఈ శక్తి అవధి 10-11 మీటర్లు మాత్రమే.

కేంద్రక శక్తుల వల్లే సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. మూలకాలు ఏర్పడుతున్నాయి. మన శరీరంలో ఉన్న కార్బన్‌, ఆక్సిజన్‌లకు కూడా కేంద్రక శక్తులే కారణం. ప్రబల కేంద్రక శక్తి, విద్యుదయస్కాంత శక్తి కన్నా వందరెట్లు ఎక్కువ. విద్యుదయస్కాంత శక్తి గురుత్వాకర్షణ శక్తి

కంటే 1036 రెట్లు ఎక్కువ. దుర్బల కేంద్రక శక్తి గురుత్వాకర్షణ శక్తి కన్నా 1025 రెట్లు ఎక్కువ.

- ప్రొ|| ఈ.వి.సుబ్బారావు, హైదరాబాద్‌

  • =======================

Is there waterfalls in Sea?-సముద్రాల్లో జలపాతాలు ఉన్నాయా?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
  •  

  •  
ప్రశ్న: సముద్రాల లోపల అగ్ని పర్వతాలు ఉన్నట్టే జలపాతాలు కూడా ఉన్నాయంటారు నిజమేనా?

జవాబు: సముద్రాలు చాలా లోతైనవి. ఇందులో ఉన్నవి కేవలం ఉప్పునీరు. సాధారణంగా సముద్రపు నీరు సముద్రంలో పడడం అంటూ ఉండదు. అక్కడక్కడా నదులు, సముద్రాన్ని కలిసేచోట సముద్రపు మట్టం కన్నా నదిలో నుంచి పడే నీరు చాలా ఎత్తు నుంచి పడినట్టయితే ఆ జలధార పడ్డచోటే సముద్రపు నేలలో ఏదైనా నెర్రెలు, ఉన్నట్లయితే ఆ నెర్రెల్లోకి నీరు కిందికి జారినట్లు అనిపిస్తుంది. సముద్రపు జలపాతాలు కావు. మామూలు జలపాతాలే. మారిషస్‌ ద్వీపాల్లో అక్కడక్కడా కొన్ని చోట్ల ఇసుక మేటలతోపాటు సాంద్ర తరమైన కాల్షియం సల్ఫేటు పదార్థపు రేణువులు సముద్రపు నేల ఎగుడుదిగుడుల్లో చారికల్లాగా పేరుకుపోవడం వల్ల సముద్రంలోనే జలపాతం ఉన్నట్లు భ్రమ కల్గుతుంది. నిజానికి సముద్రాల్లో ఎక్కడా జలపాతాలు లేవు.

- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌, కన్వీనర్‌,-శాస్త్రప్రచారవిభాగం, జనవిజ్ఞానవేదిక (తెలంగాణ

  • ======================

Tuesday, September 29, 2015

ధ్రువాల వద్ద ఉండే ఎలుగుబంటి ఒంటిపై వెంట్రుకలు తెల్లగా ఉంటాయి. ఎందుకు?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
  •  
  •  

  ప్రశ్న: ధ్రువాల వద్ద ఉండే ఎలుగుబంటి ఒంటిపై చర్మం నల్లగా ఉండి, దానిపై వెంట్రుకలు తెల్లగా ఉంటాయి. ఎందుకు?

జవాబు: సామాన్యంగా అడవుల్లో ఉండే ఎలుగు బంటి దేహంపై ఉండే చర్మం రంగు, దానిపై గుబురుగా ఉండే వెంట్రుకల రంగూ నల్లగానే ఉంటుంది. అదే ధ్రువ ప్రాంతాల్లో ఉండే ఎలుగుబంటి దేహంపై చర్మం నల్లగా ఉంటే, దానిపై గుబురుగా ఉండే వెంట్రుకలు (బొచ్చు) రంగు తెల్లగా మెరుస్తూ ఉంటుంది. మామూలు ఎలుగుబంటి చర్మంపై ఉండే మందమైన, గుబురైన వెంట్రుకలు శీతాకాలంలో చలి బారిన పడకుండా ఒక కవచంలా, ఉష్ణ బంధకంలా పనిచేస్తుంది. అదే ధ్రువ ప్రాంతంలో పరిసరాలను గడ్డ కట్టించే చలి బారి నుంచి అక్కడి ఎలుగుబంట్లను కాపాడడానికి వాటి చర్మం, దానిపై ఉండే తెల్లటి వెంట్రుకలు బోలుగా ఉండి, వాటిలో గాలి నిండి ఉండడంతో అవి ఉత్తమ ఉష్ణ బంధకరూపంలో పని చేస్తాయి. గాలి ఉత్తమ ఉష్ణ బంధకం.

ధ్రువపు ఎలుగుబంట్ల చర్మం తెల్లగానో లేక లేత పసుపు రంగులోనో కనబడుతుంది. కారణం బోలుగా ఉండే వెంట్రుకల ద్వారా పయనించే సూర్యరశ్మి దాని చర్మంపై ప్రతిఫలించడమే. నిజానికి వాటి చర్మం రంగు నలుపు. అందువల్ల బోలుగా ఉండే వెంట్రుకలగుండా పయనించే సూర్య రశ్మి రంగులు  బాగా శోషించడంతో వాటి రంగు తెల్లగా మెరుస్తూ ఉంటుంది.
Polar bear hair looks white because the air spaces in the hairs scatter light of all colors. When something reflects all of the visible wavelengths of light, we see the color white.

చలి ఎక్కువగా లేని జూలో ("zoo") పెరిగే పోలార్ బే్ర్స్ కొన్ని నల్ల రంగులొనూ కొన్ని గోధుమ రంగులోనూ  ఉంటాయి

- ప్రొ|| ఈ.వి.సుబ్బారావు--హైదరాబాద్‌
  • =====================
 visit My website > Dr.Seshagirirao - MBBS.-

పిడుగు నుంచి వచ్చే వోల్టేజీని స్టోర్‌ చేయగలమా?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
  •  

ప్రశ్న: పిడుగు నుంచి వచ్చే వోల్టేజీని స్టోర్‌ చేయగలమా?

జవాబు: పిడుగు అనేది రెండు వేర్వేరు ధ్రువత్వం గల విద్యుదావేశాలతో నిండుకున్న మేఘాల మధ్య జరిగే విద్యుదుత్సర్గం. ఒక వేళ ఒక మేఘానికి దగ్గర్లో మరో మేఘం లేనట్లయితే మేఘంలో ఏ ధ్రువత్వం గల విద్యుదావేశం పోగు పడిందన్న విషయంలో సంబంధం లేకుండా ఆ స్థిర విద్యుత్తు భూమి వైపు ప్రసరిస్తుంది. ఆ సమయంలో మేఘానికి దగ్గరగా ఎవరున్నా (చెట్లు, భవనం, విద్యుత్సంభం, వ్యవసాయదారుడు లేదా దారిన పోయే దానయ్య, పశువు) వారు విద్యుత్ప్రవాహి అయినట్లయితే వారి గుండా ఈ అధిక విద్యుత్తు ప్రవహించి మరణానికి దారి తీస్తుంది.

ఈ విపత్పరిణామాన్నే మనం పిడుగు పాటు అంటాం. పిడుగు పడే సమయంలో విద్యుత్తు ఉన్న మేఘానికి, భూమికి మధ్య కొన్ని లక్షల వోల్టుల విద్యుత్తు పొటన్షియల్‌ ఉంటుంది. ఈ విద్యుదుత్సర్గం లిప్తపాటు మాత్రమే ఉంటుంది. అదే పనిగా గంటల తరబడి కొనసాగదు. అంత తక్కువ వ్యవధిలో అంత అధిక మోతాదులో ఉన్న విద్యుత్తును నిల్వ చేయగల పరికరాలు, సాధనాలు లేవు. ప్రవహించే విద్యుత్తును దాచుకొని ఆ తర్వాత వాడుకోగలిగిన వ్యవస్థలు భౌతికంగా కెపాసిటర్లు, రసాయనికంగా ఛార్జబుల్‌ బ్యాటరీలు మాత్రమే! కానీ పిడుగు పడే సమయంలో వాటిని పిడుగు మార్గంలో ఉంచితే అవి కాలిపోవడం మినహా విద్యుత్తు నిల్వ ఉండటం దాదాపు అసంభవం.

- ప్రొ|| ఎ.రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; కన్వీనర్‌,-శాస్త్రప్రచార విభాగం, జనవిజ్ఞానవేదిక (తెలంగాణ)
  • ====================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

ఏ పాలు మనం తాగవచ్చు? ఏయే పాలు హానికరం?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
  •  

  •  
  ప్రశ్న: ఏ పాలు మనం తాగవచ్చు? ఏయే పాలు హానికరం?

జవాబు: పాలు జంతువులనుండి , కొన్ని చెట్లనుండి లభిస్తాయి. జంతువు ఏదైనా పాలు వాటి శిశువులకు పోషణ ఇచ్చేందుకే ప్రకృతి సిద్ధంగా క్షీరదాలలో ఉన్న ప్రక్రియ. క్షీరదం ఏదైనా దాని ప్రతి కదలికకు, జీవన చర్యలకు కావాల్సింది గ్లూకోజు మాత్రమే! మనలాగే వాటికీ పెరుగుతున్న దశలో కాల్షియం వంటి లవణాలతో పాటు చక్కెరలు, పోషక విలువలున్న ఆహారం అవసరం. అది పాల ద్వారా శిశు దశలో లభిస్తుంది. కాబట్టి ఏ జంతువు పాలూ మనకు విషతుల్యం కాదు. పచ్చిపాలు తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు. అవి గేదె పాలయినా, ఆవు పాలయినా, గాడిద పాలు, మేక పాలు అయినా పాలను మరగబెట్టి తాగితే ఆరోగ్యానికి మంచిది. జిల్లేడు పాలు, మర్రిచెట్టు పాలు, రబ్బరు పాలు, రావి చెట్టు పాలు, గన్నేరు చెట్టు పాలు పోషక విలువలున్న పాలు కావు. ఆ పాలు ఆయా చెట్లకు రక్షణనిచ్చే విష ద్రవాలు. తెల్లనివన్నీ పాలు కావన్న సామెత ఇక్కడే అమలవుతుంది. చెట్ల పాలు తాగకూడదు కానీ జంతువుల పాలు వేడి చేసుకుని తాగితే ఏదీ హానికరం కాదు.

- ప్రొ|| ఎ.రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; కన్వీనర్‌,-శాస్త్రప్రచార విభాగం, జనవిజ్ఞానవేదిక (తెలంగాణ)
  • ====================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Wednesday, September 16, 2015

హిందూ మతం లో ఎవరెవరిని పుత్రులు గా పరిగనిస్తారు?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
  •  
  •  
ప్ర : హిందూ మతం లో ఎవరెవరిని పుత్రులు గా పరిగనిస్తారు?

జ : 
  •  ధర్మార్ధ కామమోక్షాలకు బాసటగా ఉన్న తాళికట్టిన భార్యకు జన్మించినవాడు -పుత్రుడు లేక కన్నపుత్రుడు ..
  • తన గోత్రపువారినుండి వచ్చినవాడు -క్షేత్రజ్ఞపుత్రుడు .
  • తమకి సంతానము లేకపోవడము వలన ఇంకొ దంపతులనుండి స్వీకరించిన వాడు - దత్తపుత్రుడు .
  • తన భార్యకి తననుంచి కాకుండా.. బలత్కారమువల్లా, భయపెట్టి లొంగదీసుకున్నప్పుడు పుట్టినవాడు - గూఢోత్పన్నపుత్రుడు.
  • కని రోడ్డుమీద వదిలేసినవాణ్ణి పెంచుకుంటే - ఆపద్ధర్మపుత్రుడు .
  • వివాహానికి ముందు పుట్టినవాడు - క్షేత్రజ పుత్రుడు.
  • ====================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Wednesday, August 26, 2015

Important of 12 in the Time?-కాలములో "12 " గొప్పతనము ఏమిటి?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

 ప్ర : కాలములో "12 " గొప్పతనము ఏమిటి? తెలుపగలరు .

జ : కాలములో 12 అంకెకు ఉన్న ప్రాధాన్యత ను పరిశీలిస్తే  చాలా వింతగాను , విచిత్రముగాను ఉంటుంది. . . అంతేకాదు అద్భుతముగానూ ఉండును.
1/2 * 12 = 6 ఋతువులు సంవత్సరములో,
1 * 12 = 12 నెలలు సంవత్సరములో ,
2 * 12 = 24 గంటలు ఒక రోజులో  ,ఉదయము నుండి అస్తమయం వరకూ ఉండే గం్టలు 12, అస్తమయం నుండి ఉదయము వరకూ ఉండే గంటలు 12 ఇలా కాలాన్ని గురించి 12 సంఖ్యావిశేషము .
3 * 12 = 36 ముఖ్య మైన పర్వ(పండుగ) దినాలు సంవత్సరములో ,
4 * 12 = 48  పవిత్ర దినాలు --12  శుద్ద ఏకాదశులు+ 12 బహుళ ఏకాదశులు + 12 పూర్ణిమలు + 12 అమావాస్యలు సంవత్సరములో ,
5 * 12 =  60 వ్యక్తి షష్టి పూర్తి చేసుకోవలసిన కాలము (మనుమడు పుట్టి ఉండాల్సిన కాలము ),
6 * 12 = 72 వ్యక్తి సప్తతి పూర్తి (70 నిండిన ) కాలము (మునిమనుమడు పుట్టి ఉండాల్సిన కాలము),
7 * 12 = 84 సహస్ర  చంద్రులని (సహస్ర చంద్ర దర్శన) చూచించినందుకు గుర్తుగా చేసుకునే ఉత్సవ కాలము ,
8 * 12 = 96 శతమానోత్సవము (నూరు సంవత్సరాలు దాదాపు గా జీవించినందుకు )చేసుకునే పండగ ,
9 * 12 = 108 ఆధ్యాత్మిక  ఉన్నతులు జీవించే కాలము ,
10 * 12 =120 వ్యక్తి ఉండే పూర్ణ ఆయుష్య కాలము జ్యోతిషం ప్రకారము నూట ఇరవై సంవత్సరాలు ,
----------మానవును జీవితం లో జ్యోతిషం ప్రకారము దశలు -- రవిదశ 6 సం.లు ,చంద్రదశ -10 సం.లు , కుజ -7, రాహు 18, గురు -16, శని -19, బుధ -17 , కేతు -7, శుక్ర -20 (మొత్తము 120 సం.లు),

  • courtesy with : Dr. Mylavarapu Srinivasarao.
  • ==========================
 visit My website > Dr.Seshagirirao - MBBS.-

Monday, August 03, 2015

పాములకు చెవులుండవంటారు. మరి అవి ఎలా వినగలుగుతున్నాయి?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: పాములకు చెవులుండవంటారు. మరి అవి ఎలా వినగలుగుతున్నాయి?

జవాబు: మనిషిలాంటి వెన్నెముక గల జీవుల శ్రవణేంద్రియంలో బాహ్య చెవి (తలకు చెరో పక్క డొప్పలా ఉండేవి), మధ్య చెవి, లోపలి చెవి అని మూడు భాగాలుంటాయి. ఇందులో కర్ణభేరి అనే పలుచని పొరపై పడిన ధ్వని తరంగాలను మధ్య చెవిలో ఉండే మాలియస్‌, అంకస్‌, స్టెవీన్‌ అనే చిన్న ఎముకలు లోపలి చెవికి చేరవేస్తాయి. కొన్ని జీవులలో 'కర్ణస్తంభిక' అనే ఎముక కర్ణభేరిని లోపలి చెవితో కలుపుతుంది.

పాముల విషయానికి వస్తే, వాటికి బాహ్యచెవులు, కర్ణభేరి ఉండవు. కాని లోపల చెవి ఉంటుంది. కర్ణస్తంభిక ఒక వైపు పాము లోపలి చెవికి అనుసంధానమై ఉంటే, మరో వైపు చర్మానికి కలిపి ఉంటుంది. పాము చర్మం నేలకు తాకి ఉండటం వల్ల నేలలో పయనించే ధ్వని తరంగాలను మాత్రమే కర్ణస్తంభిక గ్రహించి లోపలి చెవికి అందజేయగలుగుతుంది.

గాలిలో పయనించే ధ్వని తరంగాలు పాముకు ఏ మాత్రం వినబడవు. ఆ రకంగా అది 'పుట్టు చెవిటిదనే' చెప్పుకోవచ్చు. మరి నాగ స్వరం వూదుతుంటే పాము ఎందుకు తలాడిస్తుందంటే?నాగ స్వరం వూదే ముందు పాములవాడు చేతితో నేలను చరుస్తాడు. ఆ శబ్ద తరంగాలు పాము చర్మం ద్వారా లోపలి చెవికి చేరి పాము పడగ విప్పుతుంది. ఆ తర్వాత నాగ స్వరాన్ని వూదుతున్న బూరాని చూస్తూ దాన్ని ఎటుకేసి తిప్పితే అటు పడగ ఆడిస్తుంది. బూరాను కాటు వేయాలనే ఉద్దేశంతోనే తప్ప, సంగీతానికి మైమరచి మాత్రం కాదు. బూరా బదులు ఒక గుడ్డను చేతితో ఆడించినా పాము ఆలానే తలాడిస్తుంది.

  • =====================

 visit My website > Dr.Seshagirirao - MBBS.- 

Saturday, August 01, 2015

ఫ్రిజ్‌ తలుపు తెరిస్తే గది చల్లబడుతుందా?

  • ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !... 

ప్రశ్న: రెఫ్రిజరేటర్‌లోని వస్తువులు చల్లబడతాయి కదా. మరి రెఫ్రిజరేటర్‌ తలుపును తెరిచి ఉంచితే గది చల్లబడుతుందా?

జవాబు: రెఫ్రిజరేటర్‌ తలుపును తెరిచి ఉంచితే గది చల్లబడదు సరి కదా అంతకు ముందు కన్నా వేడెక్కుతుంది. రెఫ్రిజరేటర్‌లో సులభంగా ఆవిరయ్యే ఫ్రియాన్‌ అనే ద్రవ పదార్థాన్ని బోలుగా ఉండే సన్నని తీగ చుట్టల ద్వారా ప్రవహింపచేస్తారు. ఈ ద్రవాన్ని 'రెఫ్రిజరెంట్‌' అంటారు. ఈ ద్రవం ఫ్రిజ్‌లో ఉండే పదార్థాల వేడిని గ్రహించి ఆవిరిగా మారుతుంది. ఫ్రిజ్‌లో చల్లదనాన్ని కలుగచేస్తుంది. ఆవిరిగా మారే ఫ్రియాన్‌ తిరిగి ఫ్రిజ్‌లో ఉండే కండెన్సర్‌లో పీడనానికి గురయి, మళ్లీ ద్రవంగా మారుతుంది. ఇది తిరిగి ద్రవరూపాన్ని పొందేటపుడు అది అంతకు మునుపు ఫ్రిజ్‌లో గ్రహించిన వేడి ఫ్రిజ్‌ వెనుక భాగం నుంచి బయటకుపోతుంది. ఇపుడు ఫ్రిజ్‌ తలుపును తీసి ఉంచితే ఈ వేడి ఫ్రిజ్‌ వెనుక భాగం నుంచి కాకుండా విశాలంగా ఉన్న ముందు భాగం నుంచి బయటకు రావడంతో గది వేడెక్కుతుంది.

- ప్రొ|| ఈ.వి.సుబ్బారావు, హైదరాబాద్‌

మరణించిన తర్వాత మృతదేహం ఎందుకు చెడు వాసననిస్తుంది?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: మరణించిన తర్వాత మృతదేహం ఎందుకు చెడు వాసననిస్తుంది?

జవాబు: మనతోపాటు జీవులన్నింటిలో జీవానికి కారణమైన ఎన్నో రసాయనాలున్నాయి. అందులో ప్రోటీన్లు, డీఎన్‌ఏ, ఆర్‌ఎన్‌ఏ, ఎంజైములలో నత్రజని బాగా ఉంటుంది. కొన్ని ఎంజైములలో గంధకం కూడా ఉంటుంది. మనిషి తదితర జీవులతో పాటు ప్రపంచవ్యాప్తంగా గాలిలోను, నీటిలోను, మట్టిలోను వివిధ రకాలయిన జీవులున్నాయి. అందులో బాక్టీరియాలు కూడా ఉన్నాయి. చాలా మటుకు బాక్టీరియాలు పరాన్నజీవులు. వాటికి సొంతంగా ఆహారం సముపార్జించుకొనే శక్తి లేదు. కేవలం ఇతర జీవ కణాల్లో ఉన్న పోషక పదార్థాల్ని రసాయనికంగా మార్పిడి చేసి తమకనుకూలమైన రూపంలోకి తెచ్చుకొంటాయి. ఆ క్రమంలో కొన్ని వృథారసాయనాలు కూడా ఉత్పత్తి అవుతాయి. ఉదాహరణకు మనం కలప దుంగల నుంచి డైనింగ్‌ టేబుల్‌, కుర్చీ వంటి పరికరాల్ని తయారుచేసుకునే క్రమంలో దుంగలో ఉన్న కర్ర మొత్తాన్ని వాడము కదా! కొంత వృథాగా చెక్క ముక్కల ద్వారా వెళ్లిపోతుంది కదా. అలాగే పరాన్న జీవులయిన బాక్టీరియాలు మృత దేహాల మీద దాడి చేసినపడు ఆ శరీరంలో ఉన్న వివిధ రసాయనాల్ని అవి తమకనుకూల రీతిలో మార్చుకొనే క్రమంలో దుర్గంధాన్ని ఇచ్చే గంధక పదార్థాలు, ఫాస్ఫరస్‌ పదార్థాలు, నత్రజనీ పదార్థాలు విడుదలవుతాయి. ఇవే మనకు దుర్గంధాన్ని కల్గిస్తాయి. మన ప్రాణమున్నంత వరకు ఈ బాక్టీరియాల దాడిని అరికట్టేలా మనలో రక్షణ వ్యవస్థ ఉంటుంది. మరణం తర్వాత రక్షణ వ్యవస్థ ఉండదు. కాబట్టి బాక్టీరియాల ఆటలకు హద్దూ పద్దూ ఉండదు.

- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌,-వరంగల్‌; కన్వీనర్‌, శాస్త్రప్రచార విభాగం,-జనవిజ్ఞానవేదిక (తెలంగాణ)

  • =============================

 visit My website > Dr.Seshagirirao - MBBS.-

చేపల వినలేవా?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: చేపలు మూగవేకాక, వినికిడి శక్తి కూడా లేనివని అంటారు నిజమేనా?

జవాబు: చేపలు శబ్దాలు చేయలేవని, వినలేవనే విషయాలు నిజం కాదు. అవి ఒక దానితో మరొకటి క్లిక్‌, క్లిక్‌ అనే శబ్దాలతోనూ, బొంగురుపోయిన గుర్‌, గుర్‌ అనే శబ్దాలతోను సంకేతాలు పంపించుకుంటాయి. మగ చేపలు గాలిని నింపుకునే సంచుల చుట్టూ ప్రత్యేకమైన కండరాలు ఉంటాయి. ఈ కండరాలను కుంచించడం ద్వారా అవి డ్రమ్ములను వాయించినపుడు వచ్చే శబ్దాలను అతి తక్కువ తీవ్రతలో ఉత్పన్నం చేయగలవు. చేపలు ఒకదానితో మరొకటి మాట్లాడుకోవాలనుకుంటే, గాలిని పీల్చుకుని ఆ గాలిని వ్యర్థ పదార్థాలను విసర్జించే మార్గం ద్వారా వెలువరిస్తూ శబ్దాలను చేస్తూ ఉంటాయి. ఆ విధంగా చేపలు 1.7 నుంచి 2.2 కిలో హెర్ట్జ్‌ పౌనఃపున్యం ఉండే శబ్దాలను వెలువరించగలవు. ఒక్కో శబ్దాన్ని 8 సెకండ్ల వరకు పట్టి ఉంచగలవు. అలా శబ్దాలు చేయగల శక్తి గల చేపలకు వినికిడి శక్తి ఉండటం సహజం. అవి గాలిని నింపుకొనే సంచికి అనుసంధానమై ఉండే లోపలి చెవి ద్వారా వినగలవు. ఆ చెవి శబ్దాలు వినడంలో కర్ణభేరి లాగా పనిచేస్తుంది.

- ప్రొ|| ఈ.వి.సుబ్బారావు, హైదరాబాద్‌

  • ===================

 visit My website > Dr.Seshagirirao - MBBS.- 

కరెంటు బొగ్గు నుంచీ.నీటి నుంచే తయారు చేస్తారు కానీ వేరే సాధనాల నుంచి ఎందుకు తయారు చేయరు?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

 ప్రశ్న: కరెంటు బొగ్గు నుంచీ.నీటి నుంచే తయారు చేస్తారు కానీ వేరే సాధనాల నుంచి ఎందుకు తయారు చేయరు?

జవాబు: కరెంటు లేదా విద్యుచ్ఛక్తిని బొగ్గులో ఉన్న రసాయనిక శక్తిని మార్చుకోవడం ద్వారా ఉష్ణ విద్యుత్‌ కేంద్రాల్లో ఉత్పత్తి చేస్తారు. ఆనకట్టల దగ్గర ఎత్తులో నిల్వ ఉన్న నీటిలోని స్థితి శక్తిని విద్యుచ్ఛక్తిగా జల విద్యుత్‌ కేంద్రాలలో ఉత్పత్తి చేస్తారు. ఇలా శక్తిని ఒక రూపం నుంచి మరో రూపంలోకి మార్చడానికి వీలున్న అన్ని విధానాలలోను విద్యుచ్ఛక్తిని తయారు చేయగలం. ఉష్ణ విద్యుత్తు, జల విద్యుత్తే కాకుండా సౌర ఘటాల్లో సూర్యుని కాంతిలో ఉన్న కాంతి శక్తి విద్యుచ్ఛక్తిగా మారుతుంది. పెద్ద పెద్ద పర్వత శ్రేణుల వాలు మీద అమర్చిన పంఖాల్లాంటి పరికరాల ద్వారా వీచే గాలిలో ఉన్న గతిశక్తిని విద్యుచ్ఛక్తిగా వాయు యంత్రాలలో మారుస్తున్నాం. సముద్రపు అలలలో ఉండే గతిశక్తిని విద్యుచ్ఛక్తిగా తరంగ యంత్రాలలో ఉత్పత్తి చేస్తున్నాం. భూమి పొరల్లో వివిధ ఉష్ణోగ్రతల తేడాల వల్ల సిద్ధించిన ఉష్ణశక్తిని భూగర్భ విద్యుదుత్పత్తి కేంద్రాలలో విద్యుచ్ఛక్తిగా మార్చుకొంటున్నాం. హైడ్రోజన్‌, ఆక్సిజన్‌లలో దాగున్న రసాయనిక శక్తిని ఇంధన ఘటాల్లో విద్యుచ్ఛక్తిగా మార్చుకొని వాడుకొంటున్నారు. ఇలా ఎన్నో రూపాల్లో ఉన్న శక్తిని విద్యుచ్ఛక్తిగా వాడుతూనే ఉన్నాం. అయితే మన అవసరాలను ఎక్కువగా తీర్చేది బొగ్గు, జల విద్యుత్తే.

- ప్రొ|| ఎ. రామచంద్రయ్య,-నిట్‌, వరంగల్‌; కన్వీనర్‌, శాస్త్రప్రచార విభాగం, జనవిజ్ఞానవేదిక(తెలంగాణ)

  • =======================

 visit My website > Dr.Seshagirirao - MBBS.- 

మెదడును మనం సరిగా ఉపయోగించకపోతే ఆలోచనా శక్తి తగ్గిపోతుందా?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: మెదడును మనం సరిగా ఉపయోగించకపోతే ఆలోచనా శక్తి తగ్గిపోతుందా?

జవాబు: 'దానిని ఉపయోగించు, లేకపోతే అది మొద్దుబారి ఎందుకూ పనికి రాకుండా పోతుంది' అనే మాట మెదడు విషయంలో ఎంతో నిజం. మనో వైజ్ఞానికుల ప్రకారం, వయసు మళ్లే కొద్దీ జ్ఞాపకశక్తి తగ్గిపోతుందనే విషయం నిజం కాదు. సమస్యల్లా వయసు పెరిగే కొద్దీ పెద్దలు మానసికంగా సోమరులైపోతారు. వారి రోజువారీ చర్యలు రొటీన్‌గా మారడంతో మేథా సంపత్తిని పెంచుకునే చర్యలు చేపట్టకుండా రోజంతా టీవీ చూడటం, ఒకే రకం వార్తా పత్రికలు చదవడం,

ఆరోగ్య సమస్యల గురించి అనవసరంగా దిగులు పడటం లాంటి వ్యాపకాలతో గడుపుతుంటారు. దాంతో మెదడుకు సరైన వ్యాయామం లేక మొద్దుబారిపోతుంది. అలా జరగకుండా ఉండాలంటే వివిధ సబ్జెక్టులలో ఆలోచనలు రేకెత్తించే పుస్తక పఠనం, చదరంగం, క్యారమ్స్‌ లాంటి ఆటలు ఆడటం, క్రాస్‌ వర్డ్‌ పజిల్స్‌ పూరించడం లాంటివి చేయాలి. ఇవి కూడా ఒకే విధంగా మూసగా ఉండకుండా చూసుకోవాలి. వయసు మళ్లే కొలదీ ఎప్పటికప్పుడు కొత్త కొత్త భాషలు నేర్చుకోవడం, ఇష్టమైన సంగీతం వినడం అలవాటు చేసుకోవాలి. దాంతో మెదడు ఉత్తేజం పొంది, ఆలోచనా శక్తి తగ్గిపోకుండా ఉంటుంది.

మన భూమి తప్ప వేరే గ్రహాల మీద చెట్లను పెంచవచ్చా?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: మన భూమి తప్ప వేరే గ్రహాల మీద చెట్లను పెంచవచ్చా?

జవాబు: భూమ్మీద కూడా బండరాళ్ల మీద, ఎడారుల్లో, అగ్ని పర్వతాల మీద మొక్కలను పెంచలేము. దీనర్థం ఏంటంటే చెట్లు లేదా ఏ జీవ జాతులు బతకాలన్నా తగిన విధంగా ఆ ప్రాంతాలు భౌతిక రసాయనిక పరిస్థితులు కలిగుండాలి. భూమ్మీద ఉండే ఉష్ణోగ్రత, వాతావరణం, నేల రసాయనిక సంఘటనం, సౌరకాంతి తీవ్రత అనువుగా ఉండడం వల్ల పొలాల్లో పంటలు, అడవుల్లో చెట్లు, మైదానాల్లో గడ్డి పెరుగుతున్నాయి. ఇంతగా జీవానికి, వృక్షాల పెరుగుదలకు అనువైన ప్రదేశాలు మన సౌర మండలంలో భూమి మినహా మరే చోటా లేవు. అందుకే సరాసరి ఇతర సౌరమండల గ్రహాల్లో చెట్లను పెంచలేము.

ఈ విశాల విశ్వంలో ఎక్కడోచోట తప్పకుండా భూమిలాంటి వాతావరణ పరిస్థితులు, నేల పరిస్థితులు ఉంటాయనీ అక్కడ కూడా జీవం ఉద్భవించే అవకాశాలు ఉంటాయనీ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అలాంటి స్థావరాల ఉనికి కోసం అమెరికా వాళ్ల నాసా సంస్థ సెటి (SETI: Search for extra terrestrial intelligence) ఉపసంఘం ద్వారా అన్వేషణ సాగిస్తోంది. చంద్రోపరితలం, అంగారక ఉపరితలంపై ప్రత్యేకంగా హరిత గృహాల్ని నిర్మించి అక్కడే సరియైన పరిస్థితుల్ని కల్పిస్తే అక్కడ కొన్ని రకాల చెట్లను పెంచడం అసాధ్యం కాదు.

- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌,-వరంగల్‌, కన్వీనర్‌, శాస్త్రప్రచార విభాగం, జనవిజ్ఞానవేదిక (తెలంగాణ)

  • ===================

 visit My website > Dr.Seshagirirao - MBBS.- 

నల్లని తల వెంట్రుకలు తెల్లవారేటప్పటికి తెల్లబడతాయా?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: నల్లని తల వెంట్రుకలు తెల్లవారేటప్పటికి తెల్లబడతాయా?

జవాబు: వెంట్రుకల రంగు పెరిగే వెంట్రుకలలో, వెంట్రుకల మూలాలలోకి చొప్పించిన వర్ణకాల (పిగ్మెంట్‌ల)పై ఆధారపడి ఉంటుంది. వయసుతో పాటు వెంట్రుకలలో ఉండే 'మెలానిన్‌' అనే నల్లని పదార్థ ఉత్పత్తి నెమ్మదించడంతో, వెంట్రుకలు వాటి కుదళ్ల దగ్గర నుంచి తెల్లబడటం ఆరంభిస్తాయి. వెంట్రుకల పొడవునా వాటి మధ్య భాగంలో ఏర్పడే అతి చిన్న గాలి బుడగలు కూడా వెంట్రుకలు తెల్లగా కనిపించేటట్లు చేస్తాయి. వెంట్రుకలు వాటిలో ఉండే పిగ్మెంట్లను ఉన్నట్లుండి తటాలున కోల్పోవు కాబట్టి, అవి తెల్లవారికల్లా తెల్లబడే ప్రమాదం లేదు.

మధ్య వయసులోని వ్యక్తుల తలల్లో పిగ్మెంట్‌ కలిగి ఉండే వెంట్రుకలు, తెల్లబడి నెరిసిన వెంట్రుకలతో పాటు పెరుగుతుంటాయి. ఏదైనా వ్యాధి సోకి రోగ నిరోధక శక్తి తగ్గిన వ్యక్తుల్లో, పిగ్మెంట్‌తో నల్లగా ఉండే తల వెంట్రుకలు అతి త్వరగా రాలిపోయి, తెల్లని వెంట్రుకలు మాత్రమే మిగులుతాయి. వారి విషయంలో తల వెంట్రుకలు ఉన్నట్లుండి తెల్లబడిపోయాయనే అపోహ కలుగుతుంది. మానసికమైన ఒత్తిళ్ల వల్ల తల వెంట్రుకలు తెల్లబడతాయనే విషయంలో శాస్త్రీయ ఆధారాలు అంతగా లేవు. నాడీ మండల, రోగ నిరోధక వ్యవస్థల మధ్య సంబంధం ఉండటంతో ఆ విషయాన్ని పూర్తిగా కొట్టిపారేయలేము.

- ప్రొ|| ఈ.వి.సుబ్బారావు

  • =================

 visit My website > Dr.Seshagirirao - MBBS.- /

మనుషుల రూపు రేఖల్లో తేడాలెందుకు?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న:అందరిలో డీఎన్‌ఏ, ఆర్‌ఎన్‌ఏ ఒకే విధంగా ఉన్నా మనుషుల రూపు రేఖల్లో ఎందుకు తేడాలుంటున్నాయి?

జవాబు: మానవుడిలో 23 జతల క్రోమోజోములున్నాయి. ప్రతి క్రోమోజోములో డీఎన్‌ఏ పేలికలుంటాయి. ప్రతి డీఎన్‌ఏ పేలికలో న్యూక్లియోటైడులనే విడివిడి రసాయనిక భాగాలు దండలో పూసల్లా ఉంటాయి. ప్రతి న్యూక్లియోటైడు పూసలో ఓ నత్రజని క్షారం, ఓ చక్కెర ధాతువు, ఓ ఫాస్ఫేటు సంధానం ఉంటాయి. చక్కెర ధాతువు, ఫాస్ఫేటు భాగం ప్రతి న్యూక్లియోటైడులో ఒకే విధంగా ఉన్నా నత్రజని క్షారాల వరస క్రమం ఒకే విధంగా ఉండదు. చాలామటుకు సామ్యంగానే ఉన్నా అక్కడక్కడా తేడాలుంటాయి. ఈ తేడాలున్న భాగాలే మనుషుల్లో వ్యత్యాసాలకు ప్రధాన కారణమవుతాయి. సాధారణ వరుస క్రమం మనిషిలో సాధారణ విషయాల్ని (తల, ఆకలి, హార్మోన్లు, అవయవాలు మొదలయిన స్థూల రూపాల్ని) నిర్దేశించగా విశిష్టతను ఈ తేడా భాగాలే నిర్దేశిస్తాయి. ఇలా విడివిడి జీవుల్లో విడివిడి వరుస క్రమాలు, డీఎన్‌ఏ పేలికల సంఖ్యలుంటాయి. వీటినే జన్యువులు అంటారు. మనుషుల్లో అక్కడక్కడ జన్యువుల్లో తేడాలుండడం వల్లే రూపురేఖల్లో తేడా!

-ప్రొ|| ఎ.రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌, కన్వీనర్‌, శాస్త్రప్రచార విభాగం, జనవిజ్ఞానవేదిక(తెలంగాణ)

  • ============================

 visit My website > Dr.Seshagirirao - MBBS.- 

అంతరిక్షం నుంచి చూస్తే ఒక్కో గ్రహం ఒక్కో రంగులో కనిపిస్తుందంటారు. నిజమేనా?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

Q: అంతరిక్షం నుంచి చూస్తే ఒక్కో గ్రహం ఒక్కో రంగులో కనిపిస్తుందంటారు. నిజమేనా?

జవాబు: పదార్థాలపై బహుళవర్ణ కాంతి పడ్డపుడు అందులో కొన్ని వర్ణాల కాంతుల్ని ఆ పదార్థాలు శోషించుకుంటాయి. మిగిలిన కాంతి పరావర్తనం, వితరణం ద్వారా వివిధ దిశల్లో వెలువడుతుంది. ఇలా వెలువడే కాంతి ఏ రంగులో ఉంటుందో అదే రంగు ఆ వస్తువుకున్నట్లు మనకు కనిపిస్తుంది. ఏయే పదార్థాలు, ఏయే కాంతుల్ని శోషించుకుంటాయి, ఏయే వర్ణాల్ని త్యజిస్తాయి అన్న విషయం ఆయా పదార్థాల రసాయనిక సంఘటనం మీద ఆధారపడుతుంది. అన్ని గ్రహాల ఉపరితలాల, లేదా ఆయా గ్రహాల వాతావరణాలు ఒకే విధమైన రసాయనిక సంఘటనతో లేవు. కాబట్టి సౌర కాంతి వాటి మీద పడ్డపుడు అవి త్యజించే కాంతి ఏ వర్ణానిదన్న విషయం ఆయా గ్రహపు ఉపరితల రసాయనిక సంఘటనను బట్టి ఉంటుంది. ఆ పద్ధతిలో భూమి లేత నీలి రంగులో (మేఘాలు, సముద్రాల వల్ల), అంగారక గ్రహం నారింజ ఎరుపు రంగులో (అక్కడున్న ఐరన్‌ఆక్సైడ్‌ వల్ల), బృహస్పతి లేత పసుపు రంగులో (గంధక పదార్థం వల్ల), శని లేత నారింజ రంగులో (అమోనియా తదితర గంధక పదార్థాల వల్ల), యురేనస్‌, నెప్ట్యూన్లు లేత నీలం రంగులో (మీథేన్‌ వాయువు వల్ల) కనిపిస్తాయి.

- ప్రొ|| ఎ.రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌, కన్వీనర్‌, శాస్త్రప్రచార విభాగం, జనవిజ్ఞానవేదిక(తెలంగాణ)

Tuesday, July 28, 2015

ఈ విశ్వంలో మనం కాక మరో నాగరికత ఉన్నట్లు ఎలా కనుగొనగలం?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: ఈ విశ్వంలో మనం కాక మరో నాగరికత ఉన్నట్లు ఎలా కనుగొనగలం?

జవాబు: శాస్త్రవేత్తలు 1960 నుంచి అతి పెద్ద రేడియో ఏంటినాల సాయంతో భూమిపైనే కాకుండా ఈ విశ్వంలో మరెక్కడైనా ప్రాణులున్నాయా అని రోదసినంతా జల్లెడ పడుతూనే ఉన్నారు. కానీ ఇంతవరకు వారు ఆశించిన ఫలితాలు లభించలేదు.

కాలిఫోర్నియాలో రూపొందించిన ఒక టెలిస్కోపు సముదాయం ఉంది. అది బిలియన్ల సంఖ్యలో ఉండే రేడియో ఛానల్స్‌ ద్వారా మిలియన్ల సంఖ్యలో ఉండే నక్షత్రాల రహస్యాలను వెలువరించగలదు. ఈ ప్రాజెక్ట్‌లో భాగమే భూమిపై కాకుండా విశ్వంలో మరేదైనా నాగరికత ఉందా అనే అన్వేషణకు అంకితమైన SETI అనే గ్రహాంతర జీవుల అన్వేషణ సంస్థ. 1960లో ఫ్రాంక్‌డ్రెక్‌ అనే నక్షత్ర శాస్త్రజ్ఞుడు విశ్వంలోని మరేదైనా ప్రాంతం నుంచి మరో నాగరికతకు సంబంధించిన ప్రాణుల నుంచి ఏవైనా సంకేతాలు వస్తున్నాయా అనే అన్వేషణలో, మన పాలపుంతలో అలాంటి అవకాశం ఉందనే అభిప్రాయాన్ని ప్రకటించారు. ఈ ప్రయాసలో ఆయన ఒక సమీకరణాన్ని రూపొందించారు. ఈ సమీకరణం ద్వారా మన నక్షత్ర మండలంలో మన కన్నా సాంకేతికంగా పురోగమించిన నాగరికతల సంఖ్యను లెక్కకట్టవచ్చు. లోపమల్లా ఈ సమీకరణం ద్వారా సేకరించిన విశ్వాంతర నాగరికతల మధ్య పొంతన లేకపోవడమే.

- ప్రొ|| ఈ.వి.సుబ్బారావు, హైదరాబాద్‌

  • ================

 visit My website > Dr.Seshagirirao - MBBS.- 

Monday, July 13, 2015

మిగతా జంతువులతో పోల్చితే కుక్కకు మాత్రమే విశ్వాసం అనే గుణం ఎలా వచ్చింది.

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: మిగతా జంతువులతో పోల్చితే కుక్కకు మాత్రమే విశ్వాసం అనే గుణం ఎలా వచ్చింది.

జవాబు: కుక్కలు, పిల్లులు, గేదెలు, ఆవులు, మేకలు, గొర్రెలు, గుర్రాలు, ఒంటెలు, గాడిదలు మొదలైన క్షీరద జంతువులు మానవ సామాజిక జీవితంలో పెంపుడు జంతువులుగా ఉండనట్లయితే అవి లక్ష సంవత్సరాల క్రితమే అంతరించిపోయేవని జీవావరణ శాస్త్రజ్ఞులు రుజువు చేశారు. ఎందుకంటే వాటికి క్రూరమృగాల నుంచి, విపరీతమైన ప్రకృతి భీభత్సాలనుంచి ఆత్మ రక్షణ చేసుకోగల సత్తాలేదు. అంతేకాదు, కోళ్లు, బాతులు కూడా మానవుడు లేకుంటే ఇంతకాలం పాటు ఉండేవి కావని తెలుస్తోంది.

ఇలా మానవుడితో ప్రత్యక్షంగా (పెంపుడు), పరోక్షంగా (వీధి) శునకాలు భాగమయ్యాయి. కుక్కకు సహజ సిద్ధంగా చాలా సునిశితమైన ఘ్రాణశక్తి ఉంది. మనిషికున్న ఘ్రాణశక్తికన్నా కుక్కలకు కొన్ని వేల రెట్లు ఎక్కువ ఘ్రాణశక్తి ఉంది. అందువల్ల మనుషుల్ని వారి నుంచి విడుదలయ్యే విశిష్టమైన వాసనల ఆధారంగా గుర్తించగలుగుతాయి. అన్నం పెట్టే వారెవరో, పెట్టని పక్కింటి వారెవరో, ఎపుడూ చూడని ఆగంతకులెవరో వాసన ద్వారా ప్రధానంగా చూపులద్వారా కుక్కలు గుర్తించగలుగుతాయి. అలా వీటికి విశ్వాస గుణం అలవడింది.
కుక్కలకు నోరెక్కువ. గట్టిగా మొరగగలవు. కాబట్టి ఆగంతకులు వస్తే అరిచిగోల చేస్తాయి. ఇంటివారికి ఆ విధంగా సహకరించగలవు. అంతేకాకుండా ఇవి కరుస్తాయి. కుక్కలున్న ఇంటికి రావాలంటే దొంగలకు భయం. అందుకే మనుషులకు కుక్కలు మంచి పెంపుడు జంతువులయ్యాయి. మిగతా జీవులను పెంచుకున్నా అవి కుక్కల్లా విశ్వాసం చూపించలేవు.

- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌, కన్వీనర్‌, శాస్త్రప్రచార విభాగం, జనవిజ్ఞానవేదిక (తెలంగాణ)

నీటి సదుపాయం ఏ మాత్రం లేని ఎడారులలో కొన్ని మొక్కలు ఎలా పెరుగగలుగుతున్నాయి?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: నీటి సదుపాయం ఏ మాత్రం లేని ఎడారులలో కొన్ని మొక్కలు ఎలా పెరుగగలుగుతున్నాయి?

జవాబు: ఎడారులలో 'వృక్ష సంపద' అంటూ ఏమీ లేకపోయినా జెముడు (కేక్టస్‌), ఔషధ సంబంధిత గడ్డి మొక్కలు, చిన్న పొదలు అక్కడ పెరుగుతాయి.xerophytese అని ప్రసిద్ధిగాంచిన ఈ మొక్కలకు అంతగా అనుకూలించని పరిసరాలలో కూడా పెరిగే సామర్థ్యంఉంటుంది. ఇవి పెరగడానికి అతి కొద్ది పాటి నీరు (తేమ) సరిపోతుంది. ఆ నీరు సంపాదించుకోవడంలో అవి వివిధ మార్గాలు అవలంబిస్తాయి. ఉదాహరణకు, జెముడు మొక్కలు ఎపుడైనా పడిన వర్షపు తుంపరల నీటిని అనేక నెలల పాటు తమలో నిల్వ ఉంచుకోగలవు. గుబురుగా పొదల రూపంలో ఉండే హెర్బాసియన్‌ మొక్కల వేర్ల వ్యవస్థలు ఎడారులలోని భూభాగం లోపల అతి లోతుగా విశాలంగా వ్యాపించి అక్కడి భూగర్భ జలాన్ని అధిక శాతంలో పీల్చుకుంటాయి. ఎడారులలో ఉండే చెట్ల వేర్లు కూడా భూమి లోతులకు చొచ్చుకొనిపోయి అక్కడి నీటిని పీల్చుకొని, వాటి ఆకులను త్వరత్వరగా రాల్చుకొంటాయి. అందువల్ల చెట్ల ఆకుల నుంచి భాష్పీభవన ప్రక్రియ ద్వారా ఆవిరయ్యే నీటి శాతం తగ్గి, చెట్లలోనే నీరు ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది.

- ప్రొ|| ఈ.వి.సుబ్బారావు, హైదరాబాద్‌

  • =====================

 visit My website > Dr.Seshagirirao - MBBS.- 

మనలో చాలా మందికి చదవుకుంటున్నప్పుడు నిద్ర వస్తుంది ఎందుకు?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: మనలో చాలా మందికి చదవుకుంటున్నప్పుడు నిద్ర వస్తుంది ఎందుకు?

జవాబు: చదివేటప్పుడు నిద్ర రావడమనేది మనం ఏ భంగిమలో ఉన్నాం, ఎంతసేపు ఉన్నాం అనే విషయాలపై ఆధారపడి ఉంటుంది. చదివేటపుడు మన శరీర కదలికలు తక్కువగా ఉండటం వల్ల కండరాలకు ప్రవహించే రక్త ప్రసరణ తగ్గుతుంది. దాని వల్ల శరీరంలోని జీవకణాల్లో దహనచర్య మందగించి, లాక్టిక్‌ యాసిడ్‌ అనే ఆమ్లం తయారవుతుంది. ఈ ఆమ్లం ప్రాణవాయువైన ఆక్సిజన్‌ను అతిగా పీల్చుకొంటుంది. దాంతో శరీరంలోని రక్తానికి కావలసిన ఆక్సిజన్‌లో కొంత తగ్గుతుంది. ఆక్సిజన్‌ తగినంతగా లేని రక్తం మెదడులోకి ప్రవహించడం వల్ల మగతగా, నిద్ర వస్తున్నట్లుగా ఉంటుంది. అందుకే చదివేటప్పుడు ఒకే భంగిమలో ఉండి పోకుండా అపుడపుడూ అటూ ఇటూ కదలడం, ఏకబిగిన చదవకుండా మధ్యలో కాస్త విరామం ఇవ్వడం అవసరం.

- ప్రొ|| ఈ.వి.సుబ్బారావు,--హైదరాబాద్‌

  • =========================

 visit My website > Dr.Seshagirirao - MBBS.- 

Sunday, July 12, 2015

విమానాలు ఆకాశంలో ఎగురుతున్నపుడు వాటి మీద పిడుగులు పడవా?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: విమానాలు ఆకాశంలో ఎగురుతున్నపుడు వాటి మీద పిడుగులు పడవా?

జవాబు: విమానాలు గాలిలో ఎగురుతున్నపుడుగానీ నేలమీద ఉన్నపుడుగానీ వాటిని పిడుగులు సాధారణంగా ఏమీచేయలేవు.
పిడుగు అంటే ఏమిటో తెలుసుకుంటే ఈ విషయం బోధపడుతుంది. మేఘాల రాపిడితో ఉద్భవించిన అత్యధిక స్థిర విద్యుత్తు నేలవైపునకు రావడానికి ప్రయత్నిస్తుంది. ఎందుకంటే నేలకు, విద్యుదావేశితాలయిన మేఘాలకు మధ్య వేల వోల్టుల మోతాదులో శక్మ భేదం (Potential difference) ఉంటుంది. రెండు బిందువుల మధ్య శక్మ భేదం ఉన్నట్లయితే విద్యుదావేశం అతి తక్కువ నిరోధం ఉన్న మార్గం ద్వారా ప్రయాణిస్తుంది. ఆ విద్యుద్గమనం ఉష్ణ రూపంలో బయటపడుతుంది. అదే ప్రమాదాన్ని కలిగించే సంఘటన. కానీ విమానం కిందున్నపుడు విద్యుత్ప్రవాహాన్ని నిరోధించే రబ్బరు టైర్లు ఉంటాయి. మేఘాల్లో ఉన్నపుడు దాని ద్వారా భూమిని చేరే మార్గం మేఘాల్లోని విద్యుత్తుకు లేదు. అసలు విషయం మరోటి ఉంది. విమానం పైకి లేచిన కొన్ని నిముషాల్లోనే అది మేఘాల్ని దాటి పైకి వెళ్లి ప్రయానిస్తుంది. మెరుపులు ఉరుములు, పిడుగులు తన కింద ఎక్కడో సంభవిస్తూ ఉంటాయి. కాబట్టి పిడుగు ప్రభావం విమానం పైన ఉండదు.

- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; కన్వీనర్‌, శాస్త్రప్రచార విభాగం, జనవిజ్ఞానవేదిక (తెలంగాణ)

  • ========================

 visit My website > Dr.Seshagirirao - MBBS.- 

తుపాను వచ్చేముందు కీటకాలకు తెలిసిపోతుందా?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: ఉరుములతో కూడిన 'తుపాను' వచ్చే ముందు కొన్ని పురుగులు, కీటకాలు నేలకు దగ్గరగా ఎగురుతూ ఉంటాయి. ఎందుకు?

జవాబు: మామూలుగా దోమల వంటి చిన్న కీటకాలు గాలిలో ఎగురుతూ, తిరుగుతుంటాయి. వాతావరణ పీడనం ఎక్కువగా ఉన్నపుడు, గాలి బరువుగా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ఎగిరే కీటకాలకు వాతావరణంలోని పై పొరలలోకి ప్రవేశించి ఎగరగలిగే ప్రేరణ లభిస్తుంది. కానీ తుపాను రావడానికి ముందు వాతావరణ పీడనం తగ్గిపోవడంతో ఎక్కువ ఎత్తులో ఎగిరే కీటకాలు భూమికి దగ్గరగా కింది తలాలకు పడిపోతాయి. ఆ పరిస్థితుల్లో అవి తమ రెక్కల సాయంతో కాకుండా తుపాను ముందు వీచే నులివెచ్చని గాలితోపాటు ఎగురుతూ ఉంటాయి. అలా ఎగిరే కీటకాలను తుపాను పురుగులు అంటారు. ఇలా ఎగిరే కీటకాలు ప్రపంచం మొత్తం మీద 5,000 రకాలు ఉన్నాయి. నేలకు దగ్గరగా ఎగిరే ఈ కీటకాలు తుపాను రాకను ముందుగా తెలియజేసి మనకు కొంత వరకు మేలు చేస్తాయి. కానీ అవి ఏపుగా ఎదిగిన మొక్కల ఆకులకు రంధ్రాలు చేసి ఆ మొక్కల్లోని జీవరసాన్ని ఆహారంగా పీల్చి వేయడంతో పూలు, కులు త్వరగా నశిస్తాయి. అలా ఈ కీటకాలు ప్రకృతికి హాని కలగజేస్తాయి.

- ప్రొ|| ఈ.వి.సుబ్బారావు,--హైదరాబాద్‌

  • ============================

 visit My website > Dr.Seshagirirao - MBBS.- 

ఎర్రచందనం, గంధం ఒకటేనా? వాటి ఉపయోగాలేమిటి?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: ఎర్రచందనం, గంధం ఒకటేనా? వాటి ఉపయోగాలేమిటి?

జవాబు: ఎర్రచందనం, గంధపు వృక్షం రెండూ సుగంధ ద్రవ్య వృక్షాలే అయినా వృక్ష శాస్త్ర పరంగా రెండూ ఒకే జాతికి చెందినవి కావు. ఎర్ర చందనానికి వాసన కన్నా రంగు ఎక్కువ. దీనిని వృక్ష శాస్త్రంలో టెరో కార్పస్‌ శాంటాలినస్‌ అంటారు. ఎర్రచందనపు వృక్షం మధ్య భాగం ఖరీదు ఘనపుటడుగు దాదాపు రూ. లక్ష వరకు ఉంటుంది. చాలా దృఢంగా, ముదురు ఎరుపు రంగులో ఉండడం వల్ల ఈ కలపను ఖరీదైన నిర్మాణాల్లోనూ, చైనా వాళ్లు తినడానికి వాడే పుల్లల తయారీలోనూ, ఎర్రని పౌడర్‌ తయారీలోనూ ఎర్రచందనాన్ని వాడుతున్నారు. ఒక్కో చెట్టు విలువ సుమారు కోట్లలో ఉండడం వల్ల ఎర్ర చందనం స్మగ్లింగ్‌కు గురవుతున్నట్టు తరచూ వార్తల్లో వింటూ ఉంటాం. గంధపు చెట్టును శాస్త్రీయంగా శాంటాలమ్‌ పెనిక్యూలాటం అంటారు. ఇవి ఎర్ర చందనం లాగా దృఢంగా ఉండవు. గరుగ్గా ఉన్న బండమీద నీరు పోసి రాస్తే పసుపు రంగులో ఉన్న గంధపు లేపనం లభిస్తుంది. ఈ చెట్టు నుంచి తీసిన నూనెను ప్రధానంగా సుగంధ ద్రవ్యాలలోనూ సబ్బుల తయారీలోనూ వాడతారు. గంధపు చెట్టు కలపను నిర్మాణాల్లో వాడరు.

- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌,--వరంగల్‌; కన్వీనర్‌, శాస్త్రప్రచార విభాగం,--జనవిజ్ఞానవేదిక (తెలంగాణ)

  • ==========================

 visit My website > Dr.Seshagirirao - MBBS.- 

Saturday, July 11, 2015

మోటారు వాహనాలను పెట్రోల్‌కు బదులు గాలితో నడపడానికి వీలుందా?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: మోటారు వాహనాలను పెట్రోల్‌కు బదులు గాలితో నడపడానికి వీలుందా?

జవాబు: రోజు రోజుకూ పెట్రోల్‌ ధర పెరిగిపోతున్న కారణంగా ప్రపంచ దేశాల్లోని శాస్త్రజ్ఞులు ప్రత్యామ్నాయ ఇంధనాల అన్వేషణలో తమ పరిశోధనలు కొనసాగిస్తున్నారు. ఈ ప్రయాసలోని భాగమే బాగా ఒత్తిడికి గురి చేసిన గాలి లేక ఇతర వాయువులను (వీటిని సంపీడన వాయువులు అంటారు) మోటారు వాహనాలను నడపడానికి ఉపయోగించవచ్చా అనే దిశలో ప్రస్తుతం చేస్తున్న ప్రయోగాలు. ఒత్తిడిలో ఉన్న వాయువును వ్యాకోచింపజేస్తే ఉత్పన్నమయే బలం మోటారు వాహన ఇంజన్‌ పిస్టన్‌ను నడపడానికి ఉపయోగపడుతుంది. ఈ పద్ధతిలో నడిచే వాహనం శబ్ద కాలుష్యం లేకుండా నిశ్శబ్దంగా నడవడమే కాకుండా, కార్బన్‌, పొగలాంటి కాలుష్యాలు వెదజల్లదు.

గాలి (వాయువు) సాయంతో నడిచే ఈ 'ఎయిర్‌ కారు'లో అత్యధిక ఒత్తిడికి గురిచేసిన గాలితో నింపిన గాలి సీసాలు ఉంటాయి. ఈ కారు గంటకు 100 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో పయనించేటట్టు డిజైన్‌ చేస్తారు. ఒత్తిడిగల గాలితో టాంకులు నింపడానికి పెట్రోలు టాంకులలా కాకుండా కొంచెం ఎక్కువ సమయం పడుతుంది. పెట్రోల్‌ ప్రమేయం లేకుండా మోటారు వాహనాలను నడిపే మరో ప్రాజెక్టులో నైట్రోజన్‌ను ఇంధనంగా వాడతారు. ఈ వాయువులో 78 శాతం గాలి మైనస్‌ 196 డిగ్రీల సెల్సియస్‌ వద్ద వాయురూపంలో ఉండి, వేడి చేసినపుడు 700 రెట్లు వ్యాకోచిస్తుంది. భవిష్యత్తులో ఇలాంటి ఇంధన స్టేషన్లు దేశదేశాల్లో వెలిసే అవకాశం ఉంది.

- ప్రొ|| ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌

  • ===========================

 visit My website > Dr.Seshagirirao - MBBS.- 

Friday, July 10, 2015

చల్లదనము సృష్టించడము ఎందుకంత కష్టము ?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్ర : చల్లదనము సృష్టించడము ఎందుకంత కష్టము ?

జ: చలిగా ఉంటే అరచేతులు రాచుకుని ముఖము మీద పెట్టుకుంటే వేడిగా తగులుతుంది. కాని వేసవిలో చల్లదనము సృష్టించే మార్గం మన  దగ్గరలేదు. ఫ్రిజ్, ఎయిర్ కండిషనర్ వంటి ఖరీదుతో కూడుకున్నవే చల్లదనానికి వాడేవి . వాయువులో అటు ఇటు అణువులు గందరగోళం గా తిరుగుతుంటాయి . వాటి వేగము తగ్గించి వస్తువును చల్లపరచాలంటే చాలా శక్తి అవసరము . అటువంటి శక్తిని  మనము చేతితో సృష్టించలేము.యాంత్రికము గా మాత్రమే సాధ్యము. అందుకే వస్తువులను సులభముగా వేడిచేయగలము గాని అంతే త్వరగా తక్కువ శక్తితో చల్లబరచలేము .

  • =========================

 visit My website > Dr.Seshagirirao - MBBS.- 

Saturday, July 04, 2015

What is Mirage-ఎండమావి అంటే ఏమిటి?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ఎండమావి (ఎండమావులు) (ఆంగ్లం Mirage) అంటే ప్రకృతి సిద్ధంగా ఏర్పడే ఒక కాంతి ధర్మం. కాంతి కిరణాలు వంగి ప్రయాణించడం వలన దూరంగా ఉన్న వస్తువులు స్పష్టంగా కాక కదలాడుతున్నట్లు భ్రమ కలిగిస్తాయి. ఎడారిలో దూరం నుంచి చూస్తే నీరున్నట్లు కనిపించడం కూడా దీని ప్రభావమే.
ఎండ సమయంలో తారు రోడ్డు మీద మనం నిలబడినపుడు కొంత దూరంలో రోడ్డు మీద నీటి మడుగు ఉన్నట్టు కన్పిస్తుంది. కాని అక్కడ నీరు ఉండదు ఈ విధంగా భ్రమ కలిగించే మాయా నీటి మావులను ఎండమావులు అంటారు. కాంతి కిరణాలు ఒక వస్తువు లోపల సంపూర్ణంగా పరావర్తనం చెందడాన్ని సంపూర్ణాంతర పరావర్తనం అంటారు. తారు రోడ్డు మీద నీరు ఉన్నట్టుగా భ్రమ పడడానికి కూడా కారణం సంపూర్ణాంతర పరావర్తనం. ఇది వాతావరనము లోని ఉష్ణోగ్రత ప్రభాన ఏర్పడతాయి. ఉష్ణోగ్రత పెరిగినపుడు భూమిని అంటిపెట్టుకుని ఉన్న గాలి వేడెక్కి పలుచబడి పైకి వెళ్ళే ప్రయత్నం చేస్తుంది. కాని పైన వున్న గాలి చల్లదనము  వేడిగాలిని పైకి వెళ్ళనివ్వనందున ఈ వేడిగాలి  పక్కకు చేసే ప్రయాణం అలలా ఉండి నీటిప్రవాహాన్ని తలపిస్తుంది... అదే ఎండమావి.

Wednesday, July 01, 2015

పాండవులకు ద్రౌపది కాకుండా వేరే భార్యలున్నారా?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్ర : పాండవులకు ద్రౌపది కాకుండా వేరే భార్యలున్నారా? ఉంటే వారి పేర్లేమిటి?

జ : పాండవులకు ద్రౌపది కాకుండా వేరే భార్యలున్నారు .
ధర్మరాజు కి : దేవిక , పౌరవతి.
భీమునుకి : జలంధర , కాళి , హిడింబ .
అర్జునుకి : సుభద్ర , ఉలూచి , చిత్రాంగద , పమీల .
నకులునికి : కరేణుమతి, (కరుణుక ).
సహదేవునికి : విజయ . ........................ అనే భార్యలు ఉన్నారు.

  • =======================

 visit My website > Dr.Seshagirirao - MBBS.- 

Thursday, June 25, 2015

స్కూటర్‌ లాంటి ద్విచక్ర వాహనాలలో పెట్రోల్‌తో ఆయిల్‌ ను కలిపి పోస్తారెందుకు?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: స్కూటర్‌ లాంటి ద్విచక్ర వాహనాలలో పెట్రోల్‌తో ఆయిల్‌ ను కలిపి పోస్తారెందుకు?

జవాబు: స్కూటర్లలో పెట్రోల్‌తో ఆయిల్‌ను కలిపి నింపడానికి కారణం ఆ వాహనంలోని ఇంజన్‌ భాగాల మధ్య రాపిడి లేకుండా కందెన వేయడానికే. ఇంజన్‌లోని రాడ్‌ బేరింగ్స్‌, రిస్ట్‌పిన్స్‌, కామ్స్‌, ఇంజన్‌ సిలెండర్‌ వాల్స్‌ లాంటి భాగాల మధ్య రాపిడి లేకుండా మిషన్‌ భాగాలు అరిగిపోకుండా ఉండడానికే. అంతేకాకుండా ఆయిల్‌, పెట్రోల్‌ కలిపిన మాధ్యమం స్కూటర్‌ ఇంజన్‌లో ఉత్పన్నమయిన వేడిని తగ్గించి ఒక శీతలీకరణ మాధ్యమం లాగా పనిచేస్తుంది.

ఇలా లూబ్రికేషన్‌ చేయడం స్కూటర్‌లాంటి ద్విచక్రవాహనాలకే కాకుండా బస్సు, లారీల్లాంటి నాలుగు చక్రాల వాహనాలకు కూడా ఎంతో అవసరం. ఈ వాహనాలలో ఈ ల్యూబ్రికేషన్‌ వ్యవస్థ ప్రత్యేకంగా ఆయిల్‌ టాంక్‌, ఆయిల్‌పంపు రూపంలో ఉంటుంది. ఈ టాంక్‌లో నింపిన ఆయిల్‌, ఆయిల్‌ పంపు ద్వారా వాహనం వివిధ యంత్ర భాగాలకు సరఫరా అవుతుంది. ల్యూబ్రికేటింగ్‌ వ్యవస్థ వేరే ప్రత్యేకంగా ఉండటం వల్ల ద్విచక్ర వాహనాలలో లాగా ఎక్కువ పొగ వెలువడడం, స్పార్క్‌ ప్లగ్‌పై కార్బన్‌ డిపాజిట్‌ కావడం లాంటి సమస్యలు తలెత్తవు.

- ప్రొ|| ఈ.వి.సుబ్బారావు, హైదరాబాద్‌

  • =========================

 visit My website > Dr.Seshagirirao - MBBS.- 

Wednesday, June 03, 2015

How does wound heal?-గాయం ఎలా మానుతుంది ?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్ర : గాయం ఎలా మానుతుంది ?

జ : గాయము తగలనానే దెబ్బతిన్న రక్తనాళాలు కుచించుకుపోయి రక్తస్రావము ను తగ్గింస్తాయి . ఈలోగా రక్తము గడ్డకట్టి గాయం చివరల గట్టిపదేలా చేస్తాయి. తెల్ల రక్తనణాలు వచ్చి గాయం లోకి ప్రవేశించే సూక్ష్మజీవులను నిరోధిస్తాయి  తరువాత  చర్మము లోపలి ఫైబ్రోబ్లాస్ట్స్ అనే కణాలు గాయము ప్రాంతానికి చేరి కొత్తకణజాలాలను ఉత్పత్తిచేయడం మొదలుపెడతాయి.

చర్మకణాలు విభజనచెంది కొత్త కణాలు ఉత్పత్తిచేసి గాయం పైనంతా వ్యాప్తిచెందడం మొదలుపెడతాయి. అప్పుడు పైభాగాన నల్లగా కట్టిన చెక్కు వంటిది రాలిపడిపోతుంది.

  • =======================

 visit My website > Dr.Seshagirirao - MBBS.- 

Sunday, May 31, 2015

How dirt clears in hotwater?-వేడినీటిలో ఉతికితే మురికి ఎలా వదులుతుంది?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్ర : వేడినీటిలో ఉతికితే మురికి ఎలా వదులుతుంది?

జ --బట్టల్కు బాగా మురికి పట్టినపుడు వాటిని వదిలించేందుకు వేడినీటిలో వేసి ఉతుకుతారు . వేడినీటికి " తలతన్యత "('surfaceTension) తగ్గించే గుణము ఉండడము వలన నీటికి చొచ్చుకుపోయే శక్తి పెరుగుతుంది. ఫలితము గా వేడినీరు సులభముగా బట్టల పోగుల లోపలకెళ్ళి మురికిని బయటకు నెడుతుంది. నీటిలో ఉడికించి , బయటకు తీసి బట్టలను బండరాయి మీద బాదగానే మురికి పదార్ధము సులభముగా బట్టను వదిలి బయటకు వెళ్ళిపోతుంది. సబ్బులు , డిటర్జెంట్స్ వాడకుండానే మురికి పోగొట్టె విధాము వేడినీటిలో ఉడకపెట్టి బట్టలను ఉతకడము .

  • =========================

 visit My website > Dr.Seshagirirao - MBBS.- 

Friday, May 29, 2015

Sund and volume difference-సౌండ్‌కీ, వాల్యూమ్‌కీ తేడా ఏంటి?

  • ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !... 

ప్రశ్న: మనం సౌండ్‌ పెంచండి అనడానికి బదులు, వాల్యూమ్‌ పెంచండి అంటుంటాం. సౌండ్‌ అంటే శబ్దం, వాల్యూమ్‌ అంటే ఘన పరిమాణం. శబ్దానికీ, ఘన పరిమాణానికీ సంబంధం ఏంటి?

జవాబు: శబ్దానికీ, కాంతికీ సారూప్యత తరంగ చలనమే. రెండూ తరంగాల రూపంలోనే ప్రయాణిస్తాయి. కాంతి తిర్యక్‌ తరంగం. కానీ శబ్దం అను దైర్ఘ్య తరంగం. కాంతికి యానకం అవసరం లేదు. కాబట్టి శూన్యంలో కూడా ప్రయాణించగలదు. కానీ శబ్దానికి యానకం అవసరం. పదార్థాల్లోకి శబ్దం ప్రసరిస్తుంది. శబ్దం అనుధైర్ఘ్య తరంగాలుగా ప్రయాణిస్తుందంటే అర్థం ఏమిటంటే అది తన మార్గంలో ఉండే పదార్థంలోని కణాల్ని లేదా పరమాణువుల్ని ఒత్తుతూ, లూజు చేస్తూ ప్రయాణిస్తుంది. ఒత్తిన ప్రాంతాల్లో దట్టంగా అధిక పదార్థం ఉండటం వల్ల అధిక పీడనంలో ఉంటాయి. లూజు చేసిన ప్రాంతాల్లో తక్కువ పదార్థం ఉండటం వల్ల తక్కువ పీడనం ఉంటుంది. పీడన ప్రాంతాలు, లూజు ప్రాంతాలు నిశ్చలముగా అవే చోట్ల ఉండకుండా శబ్ద వేగంలో కదులుతూ ఉంటాయి. ఆ శబ్ద తరంగాలే మన చెవుల్ని చేరుతాయి. అయితే శబ్దం ఏ స్థాయిలో ఉందనే విషయం, శబ్దతరంగాలలో ఉన్న సంపీడన ప్రాంతాల్లో ఎంత ఘన పరిమాణం మేరకు పదార్థం (గాలిలో అయితే ఎంత ఘనపరిమాణం ఉన్నగాలి) ఉందన్న విషయం మీద, విరళీకరణం ప్రాంతంలో ఎంత మేరకు ఘనపరిమాణం తగ్గింది (గాలిలో అయితే ఎంత ఘనపరిమాణపు గాలి తగ్గింది) అన్న విషయం మీద ఆధారపడుతుంది. ఇలా శబ్ద తరంగాలలో పదార్థపు ఘనపరిమాణపు విలువల్లో ఎంత ఎక్కువ తేడాలు సంభవిస్తే అంత ఎక్కువ మోతాదులో శబ్దం వినిపిస్తుంది. అందువల్లే శబ్దపు తీవ్రతకు, వాల్యూమ్‌కు సరాసరి సంబంధం ఉంటుంది.

- ప్రొ|| ఎ.రామచంద్రయ్య, నిట్‌,--వరంగల్‌; కన్వీనర్‌, శాస్త్రప్రచార విభాగం, జనవిజ్ఞానవేదిక (తెలంగాణ)

  • ========================

 visit My website > Dr.Seshagirirao - MBBS.- 

Wednesday, May 27, 2015

Good smell to flowers during nights?, రాత్రివేళ పూల నుంచి సువాసనలేల?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: రాత్రి వేళల్లో వికసించే మల్లెపూలకు, నైట్‌క్వీన్‌కు అంత సువాసన ఎందుకు?

జవాబు: కొన్ని పూలకు ఆకర్షణీయమైన రంగులు ఉంటే మల్లె, నైట్‌క్వీన్‌(రాత్‌కీ రాణి) లాంటి పూలకు మధురమైన సువాసన ఉంటుంది. కొన్ని పూలకు రంగు, సువాసనా రెండూ ఉంటాయి. వీటి వెనుక ప్రత్యేకమైన ప్రయోజనం ఉంది. క్రిమికీటకాలు, తేనెటీగలు, తుమ్మెదలు, సీతాకోక చిలుకలు పూలలోని మకరందాన్ని పీల్చుకుని జీవిస్తాయి. ఇవి పూలపై వాలినపుడు వాటి కాళ్లకు, రెక్కలకు పూలలోని పుప్పొడి అంటుకుంటుంది.

ఈ కీటకాలు మరో పువ్వుపై వాలినపుడు పుప్పొడి రేణువులు ఆ పూవు అండాశయాన్ని చేరి ఫలదీకరణం జరుగుతుంది. అపుడే పువ్వు కాయగా మారుతుంది. అవే పండ్లుగా మారి వాటి గింజలు భూమిపై పడి మొలకెత్తి మొక్కలు పెరుగుతాయి. ఈ విధంగా మొక్కలు ఉత్పత్తి కావడానికి ఉపయోగపడే కీటకాలను ఆకర్షించేందుకే పూలకు అందమైన రంగులు, రకరకాల సువాసనలు ఏర్పడతాయి.

కీటకాల్లో కొన్ని పగలు సంచరిస్తే మరికొన్ని రాత్రివేళల్లో తిరుగుతుంటాయి. పగటి వేళ వీటిని ఆకర్షించడానికి వాటి రంగులు దోహదపడతాయి. రాత్రివేళ రంగులు కనబడవు కాబట్టి రాత్రి పూచేపూలు మరింత ఎక్కువగా సువాసనను వెదజల్లుతాయి.

సాయం వేళల్లో, రాత్రులలోని వాతావరణ పరిస్థితులకు మాత్రమే ప్రేరణ పొంది వికసించే జాజి, మల్లె, నైట్‌క్వీన్‌ లాంటి పూలకు మనోహరమైన సువాసన ఉండటానికి కారణం అదే. రాత్రిపూట రంగులతో పని ఉండదు కాబట్టి సాధారణంగా అలాంటి పూలు చీకటిలో కనిపించేందుకు వీలుగా తెల్లని రంగులో ఉంటాయి.

- ప్రొ|| ఈ.వి.సుబ్బారావు, హైదరాబాద్‌

  • =======================

 visit My website > Dr.Seshagirirao - MBBS.-