Saturday, March 07, 2015

what is the cause for sputum?-కఫం ఏర్పడడానికి కారణం ఏమిటి?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
  •  
  •  
ప్రశ్న: కఫం ఏర్పడడానికి కారణం ఏమిటి? అది ఏర్పడకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

జవాబు: కఫం (sputum)శ్వాస కోశ సంబంధిత వ్యాధికి చిహ్నం. గొంతుకు సంబంధించిన జబ్జులు, ఊపిరితిత్తుల జబ్బులు, జలుబు, క్షయ వంటి వ్యాధి గ్రస్తులలో ఆయా తీవ్రతనుబట్టి కఫం ఏర్పడుతుంది. దీంట్లో ఎక్కువ భాగం చీమిడి అని పిలిచే మ్యూకస్‌లా ఉంటుంది. లేదా ఊపిరితిత్తుల్లో వ్యాధి వచ్చినట్లయితే అందులో చాలా మేరకు చనిపోయిన లేదా సజీవంగా ఉన్న బ్యాక్టీరియా, నిర్జీవ తెల్ల రక్తకణాలు (చీము), ధ్వంసమైన రక్త కణాలు ఉంటాయి. తెల్లనివన్నీ పాలు కావన్నట్టే కఫాలన్నీ ఒకే రకమైనవి కావు. ఒకే లక్షణానికి చిహ్నాలుకావు. కానీ కఫం మాత్రం ఏదో ఒక అనారోగ్యానికి మాత్రం సూచిక. అందుకే డాక్టర్లు కఫ పరీక్ష చేసి దానికిగల కారణాల్ని తెలుసుకొని తగు విధమైన చికిత్స చేపడతారు. కఫం రాకుండా ఉండాలంటే ఆరోగ్య సూత్రాల్ని, ఆహార నియమాల్ని పాటించడం, కాలుష్యానికి దూరంగా ఉండడమే.

- ప్రొ ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; కన్వీనర్‌, శాస్త్రప్రచార విభాగం, జనవిజ్ఞానవేదిక (తెలంగాణ)
  • ===========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

No comments:

Post a Comment

your comment is important to improve this blog...