Wednesday, April 15, 2015

Cats jump down with fourlegs how?-ఎత్తు నుంచి పిల్లులు అలానే ఎందుకు దిగుతాయి?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
  •  

  •  
ప్రశ్న: కొంత ఎత్తు నుంచి పిల్లులను వదిలితే అవి ఎపుడూ తమ నాలుగు కాళ్లపైనే నేలపై దిగుతాయి. ఎందువల్ల?

జవాబు: కొంత ఎత్తు నుంచి పిల్లులు కిందికి పడేటప్పుడు అవి గిర్రున తిరుగుతూ చక్రభ్రమణాలు చేస్తున్నా చివరికి నేలను తాకేముందు రెండు కాళ్లపైనే దిగుతాయి. వాటి శరీర నిర్మాణం వైవిధ్యంగా ఉంటుంది. నేలను తాకే ముందు వాటి నాలుగు కాళ్లు కింది వైపునకే తిరిగి నేలను నిదానంగా, నిటారుగా తాకుతాయి. ఇలా దిగడం వల్ల నేలను ఢీకొనేటపుడు ఉత్పన్నమయే అధిక తాకిడి ప్రభావం నుంచి ప్రాణాపాయం లేకుండా పిల్లులు తప్పించుకోగలుగుతాయి. అందువల్లనేమో 'పిల్లులకు తొమ్మిది జన్మలుంటాయనే' నానుడి ప్రాచుర్యంలో ఉంది.
కొంత ఎత్తు నుంచి కిందికి ఏ వస్తువునైనా వదిలితే, భూమ్యాకర్షణ శక్తి వలన దాని వేగం కాలంతో పాటు హెచ్చుతూ, నేలను తాకే ముందు వేగం గరిష్ఠం అవుతుంది. దీనిని త్వరణ వేగం అంటారు. కానీ ఎత్తు నుంచి కిందికి పడే పిల్లి తన శరీర భాగాలను నేలకు ఎంత సమాంతరంగా చాస్తుందంటే, అపుడు అది గాలిలో ఎగిరే ఉడుతను పోలి ఉంటుంది. ఇలా చేయడం వల్ల గాలి నిరోధం దాని శరీరంపై పనిచేయడంతో అది కిందికి పడే వేగం తక్కువగా, సమంగా ఉంటుంది. శరీరాన్ని బాగా చాచడం వల్ల పడేటపుడు ఉత్పన్నమయే అభిఘాత తీవ్రత దాని శరీరంలోని కణజాలం గుండా చెల్లాచెదరవుతుంది. చివరగా పిల్లి పేరాచూట్‌లాగా నేలపైకి నిదానంగా దిగుతున్నట్లు నాలుగు కాళ్లపై నేలపైకి సురక్షితంగా దిగుతుంది.

- ప్రొ|| ఈ.వి.సుబ్బారావు, హైదరాబాద్‌
  • ==========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

No comments:

Post a Comment

your comment is important to improve this blog...