Sunday, April 19, 2015

Fruits crop in some seasons only why?- పండ్లు ఆయా కాలాల్లోనే కాస్తాయెందుకు?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...







 ప్రశ్న: పండ్లు ఆయా కాలాల్లోనే కాస్తాయెందుకు?

జవాబు: వేర్వేరు పండ్లకు వేర్వేరు రుచులు రావడానికి కారణం ఆయా పండ్లలో ఉండే జన్యు సంకేతాలే (Genetic code).ఆ జన్యు సంకేతాన్ననుసరించే పండ్లలో ప్రత్యేక రుచుల్ని, వాసనలను, ఇచ్చే పదార్థాలే ఉత్పత్తి అవుతాయి. ఏ పదార్థమూ శూన్యం నుంచి ఏర్పడదు. అంటే ఫలాల్లో ఉన్న పదార్థాల తయారీకి కావలసిన ముడి పదార్థాలు చెట్టుకు అందుబాటులో ఉండాలి. పైగా పండ్ల రుచుల, వాసనల తయారీ సమయంలో తగిన విధంగా వాతావరణంలోనూ, నేలలోనూ అనువైన భౌతిక (ఉష్ణోగ్రతగల పీడనం, గాలిలో తేమ, వెలుతురు మొ||వి), రసాయనిక లక్షణాలు ఉండాలి. ఒకే ప్రాంతంలో సంవత్సరం పాటు ఒకే విధమైన భౌతిక, రసాయనిక లక్షణాలు నేలలోను, వాతావరణంలోనూ ఉండవు. అందువల్లే ఆయా ప్రాంతాలకు, ఆయా రుతువులకు అనుకూలంగా వివిధ పండ్ల మొక్కలు పుష్పించి ఫలిస్తాయి. వివిధ పంటలు పండుతాయి. ఎప్పుడూ కాయలనిచ్చే చెట్లున్నాయి, ఏడాదికోసారి ఫలాలనిచ్చేవి ఉన్నాయి.

- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; కన్వీనర్‌, శాస్త్రప్రచార విభాగం, జనవిజ్ఞానవేదిక (తెలంగాణ)

  • ===========================

 visit My website > Dr.Seshagirirao - MBBS.- 

No comments:

Post a Comment

your comment is important to improve this blog...