Monday, April 13, 2015

Morning walk is good for health How?-ఉదయం వేళ నడక ఆరోగ్యానికి మంచిదని అంటారెందుకు?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...



 ప్రశ్న: ఉదయం వేళ నడక ఆరోగ్యానికి మంచిదని అంటారు. ఎందుకు?

జవాబు: రాత్రి వేళల్లో మనం నిద్ర ద్వారా విశ్రాంతి పొందుతాము. ఆ దశలో చలన సంబంధ అవయవాలు (కాళ్లు, చేతులు మొదలైనవి) సేదదీరి ఉంటాయి. నిద్రలో సేద తీర్చుకున్న తర్వాత అవయవాల్ని, కండరాల్ని పనికి పురికొల్పేందుకు నడక ఉత్తమ మార్గం. పైగా నడక సమయంలో గుండె శరీర భాగాలకు రక్తాన్ని బాగా ప్రసరింపజేస్తుంది. తద్వారా మెదడు, తదితర అంతరంగావయవాలకు సరియైన మోతాదులో రక్తం చేరడం వల్ల అవి ఆరోగ్యవంతంగా ఉంటాయి. తేలికపాటి నడకవల్ల గుండెకు కూడా మంచిదని వైద్యులు అంటున్నారు. అంతేకాదు, నడక సమయంలో చర్మంలోని స్వేద గ్రంథులు ఉత్తేజం పొంది చర్మంపై పొర మీదకు స్వేదాన్ని స్రవించడం వల్ల చర్మపు పై పొర ఆరోగ్యవంతంగా ఉంటుంది. శరీరంపై ముడతలు తగ్గి యవ్వనంగా కనిపిస్తాం. 'నవ్వు నాలుగు విధాల చేటు' అన్న సామెత మాటేమోగానీ 'నడక నలభై విధాల మేలు' అనేది ఇప్పుడు గుర్తుంచుకోవాలి.

-- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; కన్వీనర్‌, శాస్త్రప్రచార విభాగం, జనవిజ్ఞానవేదిక (తెలంగాణ)
  • =====================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

No comments:

Post a Comment

your comment is important to improve this blog...