Monday, April 20, 2015

Ozone bad effects-ఓజోన్‌ కీడు కూడా చేస్తుందా?




  • ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !... 






ప్రశ్న: ఓజోన్‌ వాయువు వల్ల మేలేకాకుండా కీడు కూడా ఉందని అంటారు. నిజమేనా?

జవాబు: ఓజోన్‌ వాయువు భూ వాతావరణంలో పై భాగంలో ఉంటేనే మేలు. అదే కింది భాగంలో ఉంటే కీడు.
భూమి వాతావరణాన్ని వివిధ ఆవరణాలుగా విభజించారు. భూమి ఉపరితలం నుంచి 10 కిలోమీటర్లు దాటాక 50 కిలోమీటర్ల లోపు వ్యాపించి ఉండే ప్రదేశాన్ని నిశ్చలావరణం అంటారు. ఈ ఆవరణలోని మిలియన్‌ భాగాల్లో ఆరు భాగాలు ఓజోన్‌ పొరను కలిగి ఉంటుంది. ఈ పొర సూర్యుని నుంచి వెలువడే అతి నీలలోహిత కిరణాలను పీల్చుకోవడం ద్వారా జీవకోటికి మేలు చేస్తుంది. అందుచేత ఇది అక్కడుంటేనే మేలన్నమాట.

మనం పీల్చుకునే గాలిలో కూడా ఓజోన్‌ ఉంటే అది మన వూపిరితిత్తులకు చాలా హాని చేకూరుస్తుంది. మనకేకాక జంతువులకు, మొక్కలకు కూడా నష్టం కల్గుతుంది. దురదృష్టవశాత్తూ మన రోడ్లపై తిరిగే మోటారు వాహనాలు, పరిశ్రమల ద్వారా వెలువడే కాలుష్యాల్లో ఉండే రసాయనిక పదార్థాలు, కాంతితో సంయోగం చెందితే ఓజోన్‌ ఉత్పత్తి అవుతుంది. అలాంటప్పుడు అది అపకారే మరి.

- ప్రొ|| ఈ.వి.సుబ్బారావు, హైదరాబాద్‌

  • ============================

 visit My website > Dr.Seshagirirao - MBBS.- 

No comments:

Post a Comment

your comment is important to improve this blog...