Tuesday, April 07, 2015

Sea water colors changes prequently?-సముద్రపు నీటి రంగులు మారుతూ ఉంటాయా?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
  •  

  •  
 ప్ర : సముద్రపు నీటి రంగులు మారుతూ ఉంటాయా?.

జ : సముద్రపు నీరు నీలరంగులో ఉంటుంది . సూర్య్కాంతిలోని ఏడు రంగులలో అన్ని రంగులు గ్రహించి ఒక్క నీలి రంగును వెనక్కి వెదజల్లుతుంది. (Sea water surface scatter blue color more than the other colors of the Sun rays) . ఈ వెనక్కి వెదజల్లే లక్షణము వలన సముద్రము రంగు నీలం గా ఉంటుంది.

నీటిలో ఉండే సూక్ష్మజీవులు , ఇసుక , బురద వంటి పదార్ధాలవల్ల సముద్రపు నీరు కొన్ని చోట్ల ఆకుపచ్చ , ఎరుపు రంగులలో అక్కడక్కడా కనిపిస్తుంది. అంతేకాని సముద్రము రంగులు మార్చుకోదు. అలా రంగులు మారవు.
  • =======================
 visit My website > Dr.Seshagirirao - MBBS.-

No comments:

Post a Comment

your comment is important to improve this blog...