Tuesday, April 21, 2015

Solar Winds ?-సౌర పవనాలు అంటే ఏమిటి?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...





  • ప్రశ్న: సౌర పవనాలు అంటే ఏమిటి?

    జవాబు: సౌర పవనాలు విద్యుదావేశంతో కూడిన పరమాణువుల ప్రవాహం. ఈ పవనాల్లో ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, కొంత నిష్పత్తిలో బరువైన కేంద్రకాలు ఉంటాయి. ఇవి సూర్య వాతావరణంలో ఉండే అయస్కాంత క్షేత్రం నుంచి వెలువడుతాయి. సూర్యుని భాగమైన 'కరోనా'లోని అత్యధిక ఉష్ణం వల్ల ఉత్పన్నమయే అధిక పీడనం వల్ల అక్కడ నుంచి వెలుపలకు అంటే గ్రహాంతర ప్రదేశాల్లోని అన్ని దిశలకు ప్రవహించే గాలులే సౌర పవనాలు. సౌర పవనాలు 1,00,000 డిగ్రీల కెల్విన్‌ ఉష్ణోగ్రతతో సూర్యుని నుంచి సెకనుకు 500 కిలోమీటర్ల వేగంతో సూర్యుని క్రియాశీలతని బట్టి వెలువడుతాయి.

    సౌర పవనాలలోని కణాలు భూమిని చేరుకోవడానికి 4, 5 రోజులు పడుతుంది. ఈ పవనాలను అధ్యయనం చేయడం ద్వారా సూర్యునిలో ఏర్పడే అరోరా, అయస్కాంత తుపాను లాంటి దృగ్విషయాలను శాస్త్రజ్ఞులు విశ్లేషించగలుగుతారు.

    - ప్రొ|| ఈ.వి.సుబ్బారావు, హైదరాబాద్‌

  • ======================
 visit My website > Dr.Seshagirirao - MBBS.- 

No comments:

Post a Comment

your comment is important to improve this blog...