Sunday, April 19, 2015

Tea is Good or Bad ?-తేనీరు మంచిదా- కాదా?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...







ప్రశ్న: కొందరు టీ తాగడం ఆరోగ్యానికి మంచిదని, కొందరు హానికరమని అంటున్నారు. ఏది నిజం?

జవాబు: ప్రపంచవ్యాప్తంగా మంచినీరు తర్వాత అత్యధికంగా మానవుడు సేవించే పానీయం టీనే. ఆ తర్వాత కాఫీ, ఆపై ఇతర పండ్లరసాలు, కొబ్బరి నీళ్లు, శీతల పానీయాలు ఉన్నాయి. తేయాకు చెట్ల ఆకుల్ని క్రమబద్ధీకరణ పద్ధతిలో వేడి చేసినపుడు పెళుసైన టీ ఆకులు వస్తాయి. వాటిని దంచితే వచ్చేదే టీ పొడి. ఆకుల కాలం, ఏ ఉష్ణోగ్రతలో వేడి చేశాం, ఏ ప్రాంతంలో పెరిగే తేయాకు తోటలు అన్న విషయాల మీద టీ లోని ధాతువుల స్వరూపం, సంఘటనం ఆధారపడతాయి.

తేయాకు ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో చైనా, ఆ తర్వాత మన భారత దేశం ఉండగా, ఈ రెండు దేశాల ఉత్పత్తి ప్రపంచపు ఉత్పత్తిలో సగం కన్నా ఎక్కువే ఉంది. టీలో ప్రధాన ధాతువు కెఫిన్‌. ఇది ఒక ఆల్కలాయిడ్‌. టీని పరిమిత మోతాదులో తీసుకుంటే హృదయ సంబంధ వ్యాధుల నివారణకు సహకరిస్తుందని పరిశోధనలు రుజువు చేశాయి. కానీ ఎక్కువగా వాడితే ఆరోగ్యానికి మంచిది కాదు.

- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌, కన్వీనర్‌, -శాస్త్రప్రచారవిభాగం, జనవిజ్ఞానవేదిక (తెలంగాణ)

టీ లో 3% వరకు కెఫిన్‌ ('caffeine) ఉంటుంది. . ఇంకా కొంది మోతాదులో 'theobromine , 'theophylline ,xanthines   ఉంటాయి . ఇవన్నీ మెదడును ఉత్తేజపరచును . ఎక్కువగా తీసుకుంటే నిద్రాభంగము కలుగును.

టీ తక్కువ మోతాదులో తీసుకుంటే 'polyphenols , 'flavonoids ఉన్నందున ఊబకాయము , ఆల్జిమెర్ డిసీజ్ నుందు రక్షణ కలిగించును. 'cholesterol తగ్గించుటలోనూ టీ సహకరించును. -

-- డా. శేషగిరిరావు



  • ===========================

 visit My website > Dr.Seshagirirao - MBBS.- 

No comments:

Post a Comment

your comment is important to improve this blog...