Thursday, April 23, 2015

What is penance and Salvation,తపస్సు - మోక్షం అంటే అంటే ఏమిటి?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...







Q : 
తపస్సు అంటే ఏమిటి? ఎందుకు చేయాలి?మోక్షం అంటే అంటే ఏమిటి?

Ans :తపస్సు అంటే ఇల్లు విడిచి పెట్టాలి, అడవులు పట్టాలి, ఆశ్రమాల్లో చేరాలి అని కాదు. భగవంతుని కోసం నిరంతరం తపించటాన్నే ‘తపస్సు’ అంటారు. మనోవాక్కాయకర్మల యందు ఆధ్యాత్మిక చింతనతో తపించటాన్నే తపస్సు అంటారు. నిత్యకృత్యాలు నెరవేరుస్తున్నా భగవంతునితో అనుసంధానం అయి ఉండే కార్యాచరణను కావించటాన్నే తపస్సు అంటారు. ఈ విధంగా ప్రతి మానవుడు పారమార్ధిక ఆత్మనిగ్రహ ప్రయత్నాన్ని ఒక్కొక్క తపస్సుగా గ్రహిస్తాడు. అట్లా తపస్సు చేయటం వలన మల విక్షేప ఆవరణలు అనే త్రివిధ దోషాలు తొలగిపోతాయి. శ్రవణం చేత మల దోషం, మననం చేత విక్షేప దోషం మరియు నిరంతర ధ్యానమనే నిధిధ్యాస చేత ఆవరణ దోషం తొలగుతుంది. ఈ విధంగా మనస్సుని శుద్ధి చేసుకున్న వారికి పాపాలు క్షీణిస్తాయి. వసనాక్షయం జరుగుతుంది. పూర్వ జన్మ వాసనలు క్రమేపి తోలగుతాయి. ఆ విధంగా మనస్సు పాపవాసనాక్షయం చేకూర్చుకోగానే ప్రశాంతత నొందిన రూపం మనస్సుకు చేకూరుతుంది. శారీరకమైన ఆవేదనల్ని, ఇంద్రియలోలత్వాన్ని బుద్దిపుర్వకంగా నిగ్రహించుకోవటం వలన మానవునికి ప్రశాంతత ఏర్పడుతుంది. కాన శారీరకంగాను, మానసికంగాను, తపస్సనేధనాన్ని పొందాలి.

మోక్షం అంటే మనస్సుని, శరీరాన్ని అత్మనుంచి శరీరం ఉండగానే, చైతన్యం ఉండగానే వేర్పాటు చేయడం అన్నమాట. మోక్షం అంటే మరణించిన తర్వాత పొందేది కాదు. బ్రతికి ఉండగానే ఆత్మతో జీవించగలిగేటట్లు సాధనలో సాధ్యమయ్యేటట్లు చేసుకోవటమే కాని మరొకటి కాదు. అదే మోక్షం.

లోకంలో తానే గొప్పవాడినని గర్వించే గుణం ఉండరాదు. అహింస, క్షమాగుణం, మాటలో సరళత, శ్రద్ధతో పెద్దలను పూజించుట, గౌరవించుట, స్థిరబుద్ధి, మనసు-ఇంద్రియ నిగ్రహం వంటి లక్షణాలున్నవాడే తపోనిష్ఠుడు.

  • =========================

 visit My website > Dr.Seshagirirao - MBBS.- 

No comments:

Post a Comment

your comment is important to improve this blog...