Saturday, July 04, 2015

What is Mirage-ఎండమావి అంటే ఏమిటి?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...







ఎండమావి (ఎండమావులు) (ఆంగ్లం Mirage) అంటే ప్రకృతి సిద్ధంగా ఏర్పడే ఒక కాంతి ధర్మం. కాంతి కిరణాలు వంగి ప్రయాణించడం వలన దూరంగా ఉన్న వస్తువులు స్పష్టంగా కాక కదలాడుతున్నట్లు భ్రమ కలిగిస్తాయి. ఎడారిలో దూరం నుంచి చూస్తే నీరున్నట్లు కనిపించడం కూడా దీని ప్రభావమే.
ఎండ సమయంలో తారు రోడ్డు మీద మనం నిలబడినపుడు కొంత దూరంలో రోడ్డు మీద నీటి మడుగు ఉన్నట్టు కన్పిస్తుంది. కాని అక్కడ నీరు ఉండదు ఈ విధంగా భ్రమ కలిగించే మాయా నీటి మావులను ఎండమావులు అంటారు. కాంతి కిరణాలు ఒక వస్తువు లోపల సంపూర్ణంగా పరావర్తనం చెందడాన్ని సంపూర్ణాంతర పరావర్తనం అంటారు. తారు రోడ్డు మీద నీరు ఉన్నట్టుగా భ్రమ పడడానికి కూడా కారణం సంపూర్ణాంతర పరావర్తనం. ఇది వాతావరనము లోని ఉష్ణోగ్రత ప్రభాన ఏర్పడతాయి. ఉష్ణోగ్రత పెరిగినపుడు భూమిని అంటిపెట్టుకుని ఉన్న గాలి వేడెక్కి పలుచబడి పైకి వెళ్ళే ప్రయత్నం చేస్తుంది. కాని పైన వున్న గాలి చల్లదనము  వేడిగాలిని పైకి వెళ్ళనివ్వనందున ఈ వేడిగాలి  పక్కకు చేసే ప్రయాణం అలలా ఉండి నీటిప్రవాహాన్ని తలపిస్తుంది... అదే ఎండమావి.


No comments:

Post a Comment

your comment is important to improve this blog...