Saturday, August 01, 2015

నల్లని తల వెంట్రుకలు తెల్లవారేటప్పటికి తెల్లబడతాయా?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...






ప్రశ్న: నల్లని తల వెంట్రుకలు తెల్లవారేటప్పటికి తెల్లబడతాయా?

జవాబు: వెంట్రుకల రంగు పెరిగే వెంట్రుకలలో, వెంట్రుకల మూలాలలోకి చొప్పించిన వర్ణకాల (పిగ్మెంట్‌ల)పై ఆధారపడి ఉంటుంది. వయసుతో పాటు వెంట్రుకలలో ఉండే 'మెలానిన్‌' అనే నల్లని పదార్థ ఉత్పత్తి నెమ్మదించడంతో, వెంట్రుకలు వాటి కుదళ్ల దగ్గర నుంచి తెల్లబడటం ఆరంభిస్తాయి. వెంట్రుకల పొడవునా వాటి మధ్య భాగంలో ఏర్పడే అతి చిన్న గాలి బుడగలు కూడా వెంట్రుకలు తెల్లగా కనిపించేటట్లు చేస్తాయి. వెంట్రుకలు వాటిలో ఉండే పిగ్మెంట్లను ఉన్నట్లుండి తటాలున కోల్పోవు కాబట్టి, అవి తెల్లవారికల్లా తెల్లబడే ప్రమాదం లేదు.

మధ్య వయసులోని వ్యక్తుల తలల్లో పిగ్మెంట్‌ కలిగి ఉండే వెంట్రుకలు, తెల్లబడి నెరిసిన వెంట్రుకలతో పాటు పెరుగుతుంటాయి. ఏదైనా వ్యాధి సోకి రోగ నిరోధక శక్తి తగ్గిన వ్యక్తుల్లో, పిగ్మెంట్‌తో నల్లగా ఉండే తల వెంట్రుకలు అతి త్వరగా రాలిపోయి, తెల్లని వెంట్రుకలు మాత్రమే మిగులుతాయి. వారి విషయంలో తల వెంట్రుకలు ఉన్నట్లుండి తెల్లబడిపోయాయనే అపోహ కలుగుతుంది. మానసికమైన ఒత్తిళ్ల వల్ల తల వెంట్రుకలు తెల్లబడతాయనే విషయంలో శాస్త్రీయ ఆధారాలు అంతగా లేవు. నాడీ మండల, రోగ నిరోధక వ్యవస్థల మధ్య సంబంధం ఉండటంతో ఆ విషయాన్ని పూర్తిగా కొట్టిపారేయలేము.

- ప్రొ|| ఈ.వి.సుబ్బారావు

  • =================

 visit My website > Dr.Seshagirirao - MBBS.- /

No comments:

Post a Comment

your comment is important to improve this blog...