Thursday, January 29, 2015

What is Foeticides?-భ్రూణ హత్యలు అంటే ఏమిటి ? ఎందుకు జరుగుతున్నాయో ?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

 ప్ర : భ్రూణ హత్యలు అంటే ఏమిటి ? ఇలా ఎందుకు జరుగుతున్నాయో కారణాలు ఏమిటి?

జ : తల్లి గర్భములోనే శిశువుని అబార్షన్‌ చేయడము ద్వారా అంతము చేయడాన్ని " భ్రూణ హత్యలు " అంటాము . ఆ శిశువు ఆడ పిల్ల అయితే " స్త్రీ శిశు భ్రూణ హత్యలు " అంటాము . ప్రతి తల్లి దండ్రులు  .. మగపిల్లవాడినే కోరుకుంటారు. ఈ కోరికకు అంతూ .. అపూ లేకపోతే ... ఆడ : మగ నిష్పత్తి లో తేడావచ్చి కొంతకాలానికి ఆడపిల్లల కొరత ఏర్పడుతుంది. దానిని నివారించేందుకు  ఆయా దేశ ప్రభుత్వాలు ఈ భ్రూణ హత్యలు నివారించే చట్టాలు , జాగ్రత్తలు , నివారణ మార్గాలు ప్రవేశపెడుతూనే ఉంటాయి.

భారతదేశములో ప్రతి 100 మంది మగపిల్లకు  103 మంది ఆడ పిల్లలు పుడుతున్నారు.కాని మగపిల్ల కంటే ఎక్కువ సంఖ్యలో ఆడ పిల్లలు చనిపోతున్నారు. 0-5 వయసున్న పిల్లల్లో మగపిల్లల సంఖ్యకంటే ఆడపిల్లల సంఖ్య చాలా తక్కువగా ఉందని జబాభా లెక్కలు చెబుతున్నాయి. పెద్దయిన తర్వాత కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది.

ఇలా జరగడానికి కారణాలు : 

  • మగపిల్లవాడే కావాలని తల్లిదండ్రులు కోరుకోవడము .
  • పుత్రుడు పుట్టాలనే కోరికతో తల్లిదండ్రులు ముందుగానే లింగ నిర్ధారణ పరీక్షలు చేయింది . గర్భములో ఉన్నది ఏ శిశువో తెలుసుకొని ఆడ బిడ్డ అయితే భ్రూణ-హత్యకు పాల్పడుతున్నారు. 
  • అనేక కుటుంబాలు ఆడపిల్లలను భారముగా భావించి ఈ ధారుణానికి పాల్పడుతున్నారు. 
  • వరకట్నం వేధింపులకు కొందరు ఆడపడుచులు ప్రాణాలు కోల్పోతున్నారు. 
  • మగపిల్లలకు ఇస్తున్న ప్రాధాన్యం ఆడపిల్లలకు ఇవ్వకపోవడము వల్ల కూడా ఆడపిల్లల మరణము పెరుగుతుంది. 
  • వైద్యము విషయములోనూ స్త్రీ . పురుష  వివక్ష - స్త్రీ మరణానికి దారితీస్తుంది. మగపిల్లలకు ఇచ్చే సంరక్షణ , శ్రద్దలతో పోలిస్తే ఆడ పిల్లల ఆరోగ్యం ,జబ్బుల గురించి పట్టించుకోకపోవడము అనే "నిశ్శబ్ద హింస " వల్ల కూడా స్త్రీ జనాభా తరుగుతోంది. 
  • మన చట్టాలలో ఉన్న" స్త్రీ-పురుష  సమానహక్కు" సరిగా అవలు కాకపోడము కూడా  స్త్రీలు... సమాజము లో చిన్నచూపుకి (down thinking)  గురిఅవుతున్నారు. . . . అణగదొక్కపడుతున్నారు. హత్యలకు , మానభంగాలకు, అత్తమామల  వేధింపులకు గురి అవుతున్నారు.   అలా స్త్రీ జనాభా తరిగిపోతుంది . పుట్టుకకు స్త్రీలు ముందంజగానే ఉన్నా ... పెద్ద అయ్యేసరికి కారణాలు ఏమైనా వెనకంజ పడుతున్నారు.

  • ========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

How we calculate female-male population ratio?- స్త్రీ -పురుష జనాభా నిష్పత్తిని ఎలా లెక్కిస్తారు?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్ర : స్త్రీ -పురుష జనాభా నిష్పత్తిని ఎలా లెక్కిస్తారు?(How we calculate female-male population ratio?)

జ : జనాభా లో ప్రతి వెయ్యిమంది పురుషులకు ఎంతమంది స్త్రీలు ఉన్నారో లెక్కించడము ద్వారా స్తీ-పురుష నిష్పత్తిని లెక్కిసతారు . జనభా అంతటికి సంబంధించిన సమాచారాన్ని పద్ధతి ప్రకారము సేకరించి , నమోదుచేయడాన్ని " జనగణన " అంటారు .భారతదేశములో ప్రతి 10 సంవత్సరాలకొక సారి జనాభా సమాచారాన్ని సేకరిస్తారు .
  • ======================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Wednesday, January 14, 2015

Why do we get DAM sound when bulb brokern?,బుల్బ్ పగిలితే ' డాం' శబ్దమెందుకు వస్తుంది?.

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
  •  
  •  
ప్ర : Why do we get DAM sound when bulb brokern?,బుల్బ్ పగిలితే ' డాం' శబ్దమెందుకు వస్తుంది?.

జ :మన ఇళ్ళలోని వాడే కరంటు బల్బ్ టంగస్టన్‌ ఫిలమెంట్ మండడము ద్వారా వెలుతురు వస్తుంది. ఆ ఫిలమెంట్ ను పలుచటి గ్లాస్ బల్బ్ లో పెట్టి సీల్ చేస్తారు . ఆ సీల్ వేసేటప్పుడు లోపల గాలి లేకుండా శూన్యము చేస్తారు.  గాలి ఉంటే ఆనిలోని ఆక్సిజన్‌ బల్బ్ లోపల మంటను పెందే ప్రమాదము ఉంటుంది. బల్బ్ గ్లాసు పల్చగా కనిపించినా బయటి గాలి వత్తిడిని తట్టుకునే సామర్ధ్యము కలిగిఉంటుంది. ఏ కారణముచేతనైనా బల్బ్ పగిలితే లోపల శూన్యములోనికి బటటి గాలి ఒక్కసారిగా అధిక పీడనముతో ప్రవేశించినందున " ఢాం ' అనే శబ్దము వస్తుంది. ఇది ఫిజిక్స్ సూత్రాల పై ఆధారపడి పనిచేస్తుంది.
  • ====================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Saturday, January 03, 2015

Cell towers are dangerous?,సెల్‌ టవర్లతో ప్రమాదమా?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
  •  

  •  
ప్రశ్న: సెల్‌ఫోను టవర్ల వల్ల ప్రమాదం ఉందంటారు. పైగా ఎక్కువసేపు మాట్లాడితే ఫోను వేడెక్కుతుంది. ఎందుకు?
జవాబు: సమాచార రంగంలో సెల్‌ఫోను వ్యవస్థ విప్లవాత్మక మార్పుల్ని తీసుకొచ్చింది. దేశ జనాభా సుమారు 120 కోట్లు ఉండగా మన దేశంలో సుమారు 80 కోట్ల వరకు సెల్‌ఫోను నంబర్లు చలామణీలో ఉన్నట్టు తెలుస్తోంది. 2జీ, 3జీ, 4జీ వంటి ఆధునిక ఎలక్ట్రానిక్‌ సాంకేతిక రూపాల్లోకి మాటలతోనే కాకుండా దృశ్య రూపేణా అందర్నీ తీసుకు రాగలిగింది. విద్యుదయస్కాంత తరంగాలను వాహకాలుగా వాడుకుంటూ అబ్బురపర్చే ఎలక్ట్రానిక్స్‌ మాడ్యులేషన్ల పద్ధతిలో వివిధ సెల్‌ఫోను సంస్థలు పనిచేస్తున్నాయి.

ఇన్ని కోట్ల ఫోన్లున్నా మాట్లాడాలనుకున్న వ్యక్తి సెల్‌ నెంబర్‌ సరిగ్గా నొక్కగానే వారితో వెంటనే మాట్లాడగలగడం సెల్‌ఫోను వ్యవస్థలో ఉన్న సాంకేతిక వైశిష్టతే. సెల్‌ఫోనుల్లో సూక్ష్మ తరంగాల్ని వాడతారు. సుమారు 800 కిలోహెర్ట్జ్‌ నుంచి సుమారు 3 గెగాహెర్ట్జ్‌ ఉన్న సూక్ష్మ తరంగాల్ని సెల్‌ఫోను టవర్ల ద్వారా బకదాని నుంచి మరో సెల్‌ఫోనుకు సంధానం చేస్తారు.

సెల్‌ఫోను వ్యవస్థలో టవర్లు చాలా కీలకమైనవి. ప్రపంచ ఆరోగ్య సంస్థ వెలిబుచ్చిన ప్రకటన ప్రకారం సెల్‌ఫోను టవర్ల వల్ల దగ్గరున్న ప్రజలకు, పక్షులకు ఏ మాత్రం హాని లేదు. కానీ సెల్‌ఫోనును అదే పనిగా చెంప దగ్గర పెట్టుకుని మాట్లాడుతుంటే ఆ సూక్ష్మ తరంగాల ధాటికి తల భాగంలో వేడెక్కి ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఎలక్ట్రానిక్‌ పరికరం ఏదైనా అదే పనిగా వాడినట్లయితే వేడి ఉత్పన్నం కావడం సహజం. ఇందుకు సెల్‌ఫోన్లు మినహాయింపు కాదు.

- ప్రొ|| ఎ.రామచంద్రయ్య,నిట్‌,వరంగల్‌;జనవిజ్ఞానవేదిక,శాస్త్రప్రచారవిభాగం(తెలంగాణ)
  • ================================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Magnetic power more to Earth?,ఆకర్షణ శక్తి భూమికే ఎక్కువా?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
  •  

  •  
ప్రశ్న : మిగతా గ్రహాల కన్నా భూమికే ఎక్కువ ఆకర్షణ శక్తి ఉంటుంది ఎందుకు?

జవాబు : సౌర మండలంలో ఉన్న గ్రహాలన్నింటిలో కన్నా భూమికే ఎక్కువ ఆకర్షణ శక్తి ఉందనుకోవడం సరికాదు. భూమి కన్నా అధిక ఆకర్షణ శక్తి ఉన్న గ్రహాలు ఉన్నాయి. ఫ్లూటోను గ్రహంగా పరిగణించడానికి వీల్లేదని తెలిసిన తర్వాత మన సౌర మండలంలో నవగ్రహాల బదులు అష్టగ్రహాలే ఉన్నట్టు అర్థం చేసుకోవాలి. ఇందులో భూమి కన్నా తక్కువ ఆకర్షణ శక్తి ఉన్న గ్రహాలు, భూమి కన్నా ఎక్కువ ఆకర్షణ శక్తి ఉన్న గ్రహాలూ ఉన్నాయి. సాధారణంగా ఆకర్షణ శక్తిని గురుత్వ త్వరణంతో చూపుతాం. భూమికి ఈ విలువ సుమారు 9.8 మీ/ సె2 ఉంటుంది. కానీ బృహస్పతి గ్రహానికి ఈ విలువ సుమారు 24.8మీ/ సె2 ఉంటుంది. అంటే భూమ్మీద 100 కిలోల బరువు తూగే బియ్యం బస్తా బృహస్పతి మీద సుమారు 250 కిలోల బరువు తూగుతుంది. ఇదే గురుత్వ త్వరణం శనిగ్రహం మీద 10.5మీ/ సె2 కాగా నెప్ట్యూన్‌ మీద 11.2మీ/ సె2 ఉంది. అంటే 100 కిలోల బస్తా శనిగ్రహం మీద సుమారు 110 కిలోల బరువు తూగగా నెప్ట్యూన్‌ మీద సుమారు 120 కిలోలు తూగుతుంది. భూమికి దాదాపు చేరువగా బరువు తూగే గ్రహాలు శుక్రగ్రహం, యూరేనస్‌లు. అక్కడ గురుత్వ త్వరణం విలువ సుమారు 8.9 మీ/సె2 ఉంటుంది. మిగిలిన అన్ని గ్రహాల విలువ భూమి కన్నా చాలా తక్కువే ఉంటుంది. ఒక గ్రహం మీద గురుత్వ త్వరణం ఆయా గ్రహపు ద్రవ్యరాశి, ఆ గ్రహానికి, సూర్యుడికి మధ్య దూరం, ఆ గ్రహానికీ సూర్యుడికీ మధ్య ఉన్న ఇతర గ్రహాల ఉనికిని బట్టి నిర్ణయమవుతుంది.

- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; జనవిజ్ఞానవేదిక, శాస్త్రప్రచార విభాగం (తెలంగాణ)
  • =========================
 visit My website > Dr.Seshagirirao - MBBS.-

How insects flying in Train bogie?,పురుగులు రైల్లో ఎలా ఎగరగలవు?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
  •  

  •  
ప్రశ్న: రైలు వేగంగా వెళుతున్నా రాత్రి వేళల్లో రైలు పెట్టెలోపలి లైట్ల చుట్టూ తిరుగుతున్న పురుగులు అక్కడే ఎలా ఎగరగలుగుతాయి?
జవాబు: స్టేషనులో ఆగి ఉన్న రైలులో మనం కూర్చొని ఒక బంతినిపైకి విసిరితే, అది తిరిగి మన చేతిలోకే పడుతుంది. అదే వేగంగా వెళుతున్న రైలు పెట్టెలో కూర్చొని బంతిని పైకి విసిరినా అది కూడా మన చేతిలోనే పడుతుంది. బంతి పైకి వెళ్లి తిరిగి వచ్చేలోగా రైలు ముందుకు కదులుతుంది కాబట్టి అది వెనక్కి ఎందుకు పడదనే సందేహం మీకు కలగవచ్చు. దీనికి కారణం రైలు సమ వేగంతో ముందుకు వెళుతుండడమే. మనం బంతిని పైకి విసిరినపుడు మన చేతిలోంచి పైకి గాలిలోకి లేచిన బంతికి కూడా రైలు వేగమే ఉంటుంది. అంటే సమవేగంతో వెళుతున్న రైలుకు ఉండే ధర్మాలన్నీ ఆ రైలులో ఉన్న ప్రయాణికులకు, వస్తువులకు కూడా ఉంటాయన్నమాట. అదే సూత్రం రైలులో లైటు చుట్టూ తిరుగుతున్న పురుగులకు కూడా వర్తిస్తుంది. అంటే ఆ పురుగులు కూడా రైలు వేగాన్ని కలిగి ఉంటాయి. అందువల్లే పురుగులు రైలు నిలకడగా ఉన్నప్పుడు, వేగంగా ఉన్నప్పుడు ఒకే రకంగా లైటు చుట్టూ తిరుగుతుంటాయి.

- ప్రొ|| ఈ.వి.సుబ్బారావు, హైదరాబాద్‌
  • =======================
 visit My website > Dr.Seshagirirao - MBBS.-